E-Paper
Advertisement

Lava Bold N1 5G: ఏంట్రా బాబు ఈ ఫోన్ అమెజాన్‌లో ఇంత తక్కువా..! దిమ్మతిరిగే పీచర్లతో లావా బోల్డ్ ఎన్1 5జి..

Lava Bold N1 5G: ఏంట్రా బాబు ఈ ఫోన్ అమెజాన్‌లో ఇంత తక్కువా..! దిమ్మతిరిగే పీచర్లతో లావా బోల్డ్ ఎన్1 5జి..
Advertisement

Lava Bold N1 5G: భారత బడ్జెట్ మొబైల్ మార్కెట్‌లో లావా మళ్లీ చర్చలోకి వచ్చింది. తక్కువ ధరలో 5జి మోడళ్లను వరుసగా విడుదల చేస్తూ వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. తాజా బోల్డ్ ఎన్1 5జిపై అమెజాన్ ప్రకటించిన తగ్గింపు ధరతో ఈ మోడల్ మార్కెట్‌లో మళ్లీ దృష్టి కేంద్రంగా మారింది. సులభంగా ఉపయోగించగల డిజైన్, పెద్ద డిస్‌ప్లే, పనితీరు వంటి ముఖ్య అంశాలు బడ్జెట్ వర్గంలో లావాకు తిరిగి అవకాశాలు తెచ్చాయి. ఇప్పుడు అదే స్పీడ్ తో లావా బోల్డ్ ఎన్1 5జి బడ్జెట్ సెగ్మెంట్‌లోకి వచ్చి వినియోగదారుల్లో మంచి ఆసక్తిని పెంచుకుంది. ముఖ్యంగా తక్కువ ధరలో 5జి తీసుకోవాలనుకునే వారికి ఇది సరైన ఎంపికగా కనిపిస్తోంది. ధర తగ్గింపుతో ఈ ఫోన్‌పై మరింత ఆకర్షణను సంపాదించిందని చెప్పాలి. దీనిపై ధర ఎంత తగ్గింది? అసలు ధర ఎంత అనే వివరాలు చూసేద్దామా.

డిజైన్.. లుక్ పూర్తిగా క్లారిటీ 

Advertisement

డిజైన్ విషయానికి వస్తే లావా బోల్డ్ ఎన్1 5సి సింపుల్‌గా, లైట్‌గా, ఉపయోగించడానికి సౌకర్యంగా ఉండేలా రూపొందించబడింది. చేతిలో పట్టుకున్నప్పుడు బరువు ఎక్కువగా అనిపించకపోవడం దీని మొదటి మంచి లక్షణం. బ్యాక్ సైడ్‌లో ఇచ్చిన ఫినిష్ చేతిలో గట్టి పట్టును ఇస్తుంది కాబట్టి ఏ సమయంలోనూ జారిపోతుందేమో అనే ఆందోళన ఉండదు. బడ్జెట్ రేంజ్‌లోకి వచ్చినా లుక్ పూర్తిగా క్లారిటీగా కనిపించడం, చీప్‌గా అనిపించకపోవడం ఈ మోడల్‌కు పెద్ద ప్లస్.

6.75 ఇంచుల పెద్ద స్క్రీన్‌

Advertisement

డిస్‌ప్లే ఈ మోడల్‌లో అత్యంత ఆకర్షణీయమైన భాగం. 6.75 అంచుల పెద్ద స్క్రీన్‌తో వీడియోలు, న్యూస్ బ్రౌజింగ్, సోషల్ మీడియా అన్నీ కంఫర్ట్‌గా కనిపిస్తాయి. హెచ్‌డి ప్లస్ రిజల్యూషన్ ఈ పరిమాణంలో సరైన విజువల్ అనుభవాన్ని ఇస్తుంది. పైగా 90Hz రిఫ్రెష్ రేట్ స్క్రోలింగ్‌ను ఎంతో సాఫ్ట్‌గా మార్చేస్తుంది. పెద్ద స్క్రీన్ కావడంతో కంటెంట్ చదవడం, ఆన్‌లైన్ క్లాసులు చూడటం, యూట్యూబ్ వీక్షించడం అన్నీ చాలా ఈజీగా అనిపిస్తాయి. బడ్జెట్ రేంజ్‌లో ఇంత పెద్ద డిస్‌ప్లే రావడం ఇది బెస్ట్ ఆప్సన్‌గా చెప్పొచ్చు.

13ఎంపి మెయిన్ కెమెరా

కెమెరా విషయానికి వస్తే 13ఎంపి మెయిన్ కెమెరా డేలైట్‌లో మంచి నేచురల్ లుకింగ్ ఫోటోలు ఇస్తుంది. రంగులు కంటికి ఇంపుగా అనిపిస్తాయి కాబట్టి సోషల్ మీడియా కోసం ఫోటోలు తీసుకునే వారికి ఇది సరిపోతుంది. ఆశ్చర్యమేమంటే 4K 30fps వీడియో రికార్డింగ్ కూడా ఉంది. ఈ ధర రేంజ్‌లో 4కె రావడం చాలా అరుదు. మొదటిసారి కంటెంట్ క్రియేట్ చేయాలనుకునే వారికి ఇది మంచి అదనపు అవకాశం. ఫ్రంట్ కెమెరా 5ఎంపి అయినా వీడియో కాల్స్, సాధారణ సెల్ఫీలకు తగినంత పనితీరు ఇస్తుంది.

Also Read: Vivo T4X Smartphone: వివో నుంచి కొత్త స్మార్ట్ ఫోన్.. అదిరిపోయే ఫీచర్లతో దుమ్ములేపేస్తుంది..

5000mAh సామర్థ్యం గల బ్యాటరీ

బ్యాటీ ఈ మోడల్‌లో బలమైన హైలైట్. 5000mAh సామర్థ్యం వల్ల ఉదయం చార్జ్ చేస్తే సాయంత్రం వరకూ సాఫ్ట్ వినియోగంలో కూడా బ్యాటరి తగ్గినట్లే అనిపించదు. సోషల్ మీడియా, కాల్స్, వీడియోలు అన్నీ కలిపి ఉపయోగించినా ఒక రోజు కంఫర్ట్‌గా పూర్తి చేస్తుంది. 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల చార్జింగ్ కూడా ఎక్కువ సమయం తీసుకోదు. రోజువారీగా బ్యాటరి టెన్షన్ ఉండాలని అనుకోని వారికి ఇది సరైన ఎంపికగా నిలుస్తుంది.

యూనిసాక్ టి765 చిప్‌సెట్ మోడల్‌

చిప్‌సెట్ విషయానికి వస్తే యూనిసాక్ టి765 ఈ మోడల్‌కు ప్రధాన శక్తి. 2.3GHz డ్యూయల్ కోర్, 2.1GHz హెక్సా కోర్ ఆర్కిటెక్చర్ సాధారణ వినియోగాన్ని సాఫ్ట్ మరియు స్థిరంగా ఉంచుతుంది. యాప్స్ ఓపెన్ అవ్వడం, టాస్క్‌ల మధ్య స్విచ్ అవ్వడం అన్నీ సులభంగా నడుస్తాయి. యూట్యూబ్, స్టడీస్, మెసేజింగ్, సోషల్ మీడియా అన్నీ పనులకు ఈ చిప్‌సెట్ బాగా సరిపోతుంది.

యూనిసాక్ టి765 చిప్‌సెట్

పర్‌ఫార్మెన్స్ విషయానికి వస్తే యూనిసాక్ టి765 చిప్‌సెట్ ఈ మోడల్‌కు ప్రధాన బలం. ఈ చిప్‌సెట్‌లో ఉన్న ప్రాసెసింగ్ యూనిట్లు 2.3GHz వరకు, 2.1GHz వరకు పనిచేయడంతో బ్రౌజింగ్, సోషల్ మీడియా స్క్రోలింగ్, వీడియోలు, లైట్ మల్టీటాస్కింగ్ అన్నీ సాఫ్ట్‌గా నడుస్తాయి. భారీ గేమింగ్ కోసం ఇది కాకపోయినా రోజువారీ ఉపయోగంలో అవసరమైన పనులు సులభంగా పూర్తవుతాయి. 4జిబి ర్యామ్ సాధారణ వినియోగానికి తగినంతగా ఉండటం వల్ల మొత్తం పనితీరు స్థిరంగా అనిపిస్తుంది.

ధర, అమెజాన్ ఆఫర్ ఎంతంటే?

ధర విషయానికి వస్తే లావా బోల్డ్ ఎన్1 5జి మొదట్లో రూ.9,999 ధరతో వచ్చింది .అయితే ఇప్పుడు అమెజాన్‌లో రూ.7,499 వేలకు మాత్రమే ఆఫర్లో ఉంది. ఈ మోడల్‌ను బడ్జెట్ రేస్‌లో బలమైన పోటీదారునిగా మార్చేసింది. రూ.8 వేలకు లోపు ధర తగ్గడంతో ఈ మోడల్‌పై ఆసక్తి మరింత పెరిగింది. 5జి సపోర్ట్, పెద్ద డిస్‌ప్లే, సాధారణ వినియోగానికి సరిపోయే పనితీరు ఇవి ఈ రేంజ్‌లో పోటీ ఉన్నప్పటికీ ఈ మోడల్‌ను ప్రత్యేకంగా నిలబెడుతున్న అంశాలు. తక్కువ ధరలో స్థిరమైన ఉపయోగం కోరుకునే వారికి ఇది పరిశీలించదగిన ఆప్షన్‌గా మార్కెట్‌లో నిలుస్తోంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×