E-Paper
Advertisement

Amazon TV Offers: తక్కువ ధరలో థియేటర్ ఎక్స్‌పీరియన్స్.. TCL 43, 55 ఇంచుల టీవీలపై క్రేజీ డీల్స్!

Amazon TV Offers: తక్కువ ధరలో థియేటర్ ఎక్స్‌పీరియన్స్.. TCL 43, 55 ఇంచుల టీవీలపై క్రేజీ డీల్స్!
Advertisement

Amazon TV Offers: చాలామంది తమ లైఫ్‌లో కష్టపడి సెటిల్ అయ్యాక.. తమకంటూ ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని కలలు కంటారు. ఆ కలను నిజం చేసుకున్నాక.. ఆ ఇంట్లో పెద్ద స్క్రీన్ టీవీ లేకపోతే అస్సలు బాగోదు కదా! కానీ, లక్షలు పెట్టి పెద్ద టీవీలు కొనడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటి వారికోసం, తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం అనుభూతిని అందించే బ్రాండ్లలో TCL ఒకటి. ముఖ్యంగా, మధ్యస్థ పరిమాణంలో ఉండే గదులకు 43 ఇంచులు, 55 ఇంచుల స్క్రీన్ సైజులు బాగా సరిపోతాయి. వీటిలో సాధారణ LEDతో పాటు, క్వాంటం డాట్ టెక్నాలజీ కలిగిన QLED, QD Mini LED మోడల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అమెజాన్‌లో ప్రస్తుతం లభిస్తున్న లేటెస్ట్ మోడల్స్, వాటి ధరల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

TCL టీవీలు ఎందుకు బెస్ట్?

బెస్ట్ ఫీచర్లను తక్కువ ధరకే అందించే బ్రాండ్‌గా TCL మంచి పేరు తెచ్చుకుంది. సాధారణ టీవీల కంటే భిన్నంగా, దీనిలో 4K రిజల్యూషన్, డాల్బీ విజన్, డాల్బీ ఆడియో వంటి అత్యాధునిక సదుపాయాలు ఉంటాయి. ఇక గేమింగ్ ప్రియుల కోసం 144Hz రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు ఉండటం చాలా విశేషం. గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ టీవీలు యూజర్లకు చాలా సులువుగా అర్థమవుతాయి. వాడుకోవడానికి కూడా చాలా సులభంగా ఉంటాయి.

Advertisement

Also Read: ఏం లుక్ మావా ఇది.. ఐఫోన్ 18 ప్రో బర్గండీ కలర్ లీక్, చూస్తే కళ్లు తిప్పుకోలేరు!

43 ఇంచుల టీవీల ప్రత్యేకతేంటి?

చిన్నగా ఉండే బెడ్‌రూమ్స్ లేదా లివింగ్ రూమ్ కోసం 43 ఇంచుల టీవీ బాగా సెట్ అవుతుంది. దీనిలో LED వేరియంట్లు కేవలం రూ.21,990కే అందుబాటులో ఉన్నాయి. మెటాలిక్ బాడీ, బెజెల్ లెస్ డిజైన్‌తో ఇవి చాలా స్టైలిష్‌గా కనిపిస్తాయి. ఒకవేళ మీకు కలర్స్ ఇంకాస్త రిచ్‌గా, క్వాలిటీగా కావాలనుకుంటే.. QLED మోడల్స్‌ను ఎంచుకోవచ్చు. వీటి ధర రూ.21,499 నుండి రూ.25,990 వరకు ఉంటుంది. తక్కువ కరెంట్ వినియోగంతో మంచి పిక్చర్ క్వాలిటీని ఇవి అందిస్తాయి. కరెంట్ బిల్లు కూడా తక్కువగానే వస్తుంది.

55 ఇంచుల టీవీల విషయానికొస్తే?

Advertisement

పెద్ద లివింగ్ రూమ్‌లు ఉన్నవారికి 55 ఇంచుల టీవీ మినీ థియేటర్ అనుభూతిని ఇస్తుంది. సాధారణ LED మోడల్స్ రూ.30,990కే లభిస్తున్నాయి. కానీ, ఈ విభాగంలో QD Mini LED టెక్నాలజీ హైలైట్‌గా నిలుస్తుంది. ఇది అత్యుత్తమ బ్రైట్‌నెస్, డీప్ బ్లాక్ కలర్స్ అందిస్తుంది. సినిమా చూస్తున్నప్పుడు మనకు నిజమైన ఫీల్‌ను అందిస్తుంది. అమెజాన్‌లో వీటి ధరలు రూ.36,990 నుండి రూ.72,990 మధ్యలో ఉన్నాయి. సూర్యరశ్మి నేరుగా పడే గదులకు QLED మోడల్స్ చాలా బాగుంటాయి. ఈ టీవీల్లో డే టైమ్‌లో కూడా స్క్రీన్ క్లియర్‌గా కనిపిస్తుంది.

Also Read: గూగుల్ టీవీలో జెమినీ ఏఐ.. దిమ్మతిరిగే ఫీచర్లతో పిచ్చెక్కిస్తోంది మామ!

ముఖ్య గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×