E-Paper
Advertisement

Lab Grown Gold: ల్యాబ్ లో తయారవుతున్న ‘బంగారం’.. ఆభరణాలు తయారీ, అమ్ముకోవడానికి పనిచేస్తుందా?

Lab Grown Gold: ల్యాబ్ లో తయారవుతున్న ‘బంగారం’.. ఆభరణాలు తయారీ, అమ్ముకోవడానికి పనిచేస్తుందా?
Advertisement

Lab Grown Gold: భూమి లోపల బంగారం వెలికితీత అంటే భారీగా నిధులు, నీరు, ఇతర సదుపాయాలు అవసరం. సంప్రదాయ బంగారానికి పెరుగుతున్న డిమాండ్ తో.. బంగారాన్ని ల్యాబ్ లో కూడా తయారు చేస్తున్నారు. ఈ గోల్డ్ క్వాలిటీ ఎంత? దీంతో ఆభరణాలు చేయించుకోవచ్చా? అమ్ముకోవడానికి పనిచేస్తుందా? అంటే నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం. ప్రయోగశాలలో తయారు చేసిన బంగారం.. భూమిలోంచి తవ్వి తీసిన బంగారం మాదిరిగానే ఉంటుంది.

ల్యాబ్ లో తయారీ కానీ

శాస్త్రవేత్తలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ బంగారాన్ని తయారు చేస్తారు. ఇది ఏదైనా లోహానికి బంగారు పూత లేదా రోల్డ్ గోల్డ్ లాంటిది కాదు. ఇది కూడా నిజమైన బంగారమే. ప్రయోగశాలలో బంగారం తయారీకి రెండు మార్గాలున్నాయి. మొదటి పద్ధతిలో బంగారం అణువులను నిర్మిస్తారు. ఈ పద్ధతి చాలా ఖరీదైనది. రెండో పద్ధతిలో రీసైకిల్ చేసిన బంగారాన్ని ఉపయోగిస్తారు. బంగారం ప్యూరిటీ కోసం ల్యాబ్ లో ప్రాసెస్ చేస్తారు. అయితే ఈ బంగారం ఇంకా ఆభరణాల తయారీ వరకు రాలేదు.

బంగారం చౌకగా

Advertisement

బంగారం మైనింగ్ కు భారీగా నీటితో పాటు సైనైడ్, పాదరసం వంటి హానికరమైన రసాయనాలు అవసరం. అదే ల్యాబ్ లో తయారు చేసిన బంగారం పర్యావరణ అనుకూలమైనది. కానీ ల్యాబ్ లో గోల్డ్ తయారీకి భారీగా ఖర్చు అవుతుంది. దీనిని ఉత్పత్తి చేయడానికి అధునాతన సాంకేతికత మౌలిక సదుపాయాలు అవసరం. భవిష్యత్తుల్లో ఇది చౌకగా మారవచ్చు. దీంతో ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ల్యాబ్ లో సృష్టించిన బంగారాన్ని ప్రజలు నమ్మడానికి కొంత సమయం పడుతుంది. అప్పటి వరకూ దీని రీసేల్ వ్యాల్యూ తక్కువగానే ఉంటుంది.

Also Read: పరుగులు పెడుతున్న పుత్తడి.. మళ్ళీ పెరిగిన రేట్లు.. తులం బంగారం ఎంతంటే?

భవిష్యత్తులో ల్యాబ్ గోల్డ్ కు డిమాండ్

Advertisement

రానున్న రోజుల్లో సాంకేతిక మరింత అభివృద్ధి చెంది, ల్యాబ్ లో సృష్టించిన బంగారానికి వ్యాల్యూ పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం కొనుగోలు దారులు దీనిని అంతగా నమ్మకపోయినా.. పెరుగుతున్న అవసరాలకు భవిష్యత్తులో మార్పులు వస్తాయంటున్నారు. ల్యాబ్ గోల్డ్ ను కేవలం ఒక లోహంగా కాకుండా ఆస్తిగా భావించే పరిస్థితులు వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. సైన్స్.. బంగారం తయారీ విధానాన్ని మారుస్తుంది. కొత్త డిజైన్లు, క్వాలిటీ, ఉత్పత్తి అవకాశాలను ఛేంజ్ చేస్తుంది. ల్యాబ్ లో చేసిన బంగారం సంప్రదాయ బంగారాన్ని భర్తీ చేయలేదు కానీ.. బంగారం మార్కెట్ ను మరింతగా పెంచుతుంది. దీనిని జ్యువెలరీ తయారీ, ఇతర అవసరాలకు వినియోగించనున్నారు. రాబోయే కాలంలో ల్యాబ్ గోల్డ్ ను కూడా ప్రజలు అత్యంత విలువైన లోహంగా గుర్తించి, కొనుగోలు చేయడం, పెట్టుబడి పెట్టడం చేస్తారని నిపుణులు అంటున్నారు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×