// // రూ. 10 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీ.. సగం ధరకే అదిరిపోయే ఫీచర్లు! -->
E-Paper
Advertisement

రూ. 10 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీ.. సగం ధరకే అదిరిపోయే ఫీచర్లు!

రూ. 10 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీ.. సగం ధరకే అదిరిపోయే ఫీచర్లు!
Advertisement

Kodak 32 Inch Android TV: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఇంట్లోనూ స్మార్ట్ టీవీ ఉండటం ఒక సాధారణ విషయంగా మారింది. అయితే బెడ్‌రూమ్ లేదా చిన్న రూం కోసం బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లు ఉన్న స్మార్ట్ టీవీని వెతకడం కాస్త కష్టమే. అలాంటి వారి కోసం ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ కోడ్యాక్ నుంచి వచ్చిన మోడలే Kodak 32HDX7XPRO ఆండ్రాయిడ్ టీవీ. కేవలం రూ. 9,499 కే లభించే ఈ స్మార్ట్ టీవీలోని ఫీచర్లు, పిక్చర్ క్వాలిటీ , ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం.

Kodak 32HDX7XPRO Android TV రివ్యూ:

ఇంట్లో కూర్చుని ఓటీటీ సినిమాలు, యూట్యూబ్ వీడియోలు లేదా రోజూవారీ టీవీ షోలు చూడటానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని కోడ్యాక్ ఈ టీవీతో నిరూపిస్తోంది. కేవలం రూ. 9,499 బడ్జెట్‌లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రావడం ఈ టీవీకి ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్.

Advertisement

ఈ టీవీ డిజైన్ పరంగా చాలా సింపుల్ అండ్ మోడ్రన్‌గా ఉంటుంది. సన్నని బెజెల్స్‌తో రావడం.. వల్ల స్క్రీన్ పెద్దదిగా అనిపించడమే కాకుండా గదికి ఒక మంచి లుక్‌ని ఇస్తుంది. ఇందులో హెచ్ డీ రెడీ రెసొల్యూషన్ డిస్‌ప్లే ఉపయోగించారు. దీని డిస్‌ప్లే బ్రైట్‌నెస్ ,కలర్ విజువల్స్ రోజువారీ వాడకానికి చాలా బాగుంటాయి. ఇందులో.. ఉన్న ప్రాసెసర్ వల్ల వీడియోలు ప్లే అయ్యేటప్పుడు ఎక్కడా ల్యాగ్ కాకుండా స్మూత్‌గా రన్ అవుతాయి.

ఓటీటీ యాప్‌లు:

ఇక ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌పై పనిచేస్తుంది. దీని వల్ల గూగుల్ ప్లే స్టోర్ ద్వారా మీకు నచ్చిన వేలాది యాప్స్, గేమ్‌లను నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్ వంటి ప్రముఖ ఓటీటీ యాప్‌లు ఇందులో చాలా వేగంగా ఓపెన్ అవుతాయి.

పవర్‌ఫుల్ స్పీకర్లు:

Advertisement

సౌండ్ విషయంలో.. కూడా ఈ బడ్జెట్ ధరలో కోడ్యాక్ అసలు నిరాశపరచదు. ఇందులో.. పవర్‌ఫుల్ స్పీకర్లను అందించారు. ఇవి మంచి బేస్ , స్పష్టమైన వాయిస్‌ని ఇస్తాయి. చిన్న రూమ్‌లలో విడిగా ఎలాంటి సౌండ్ బార్ కనెక్ట్ చేయకుండానే అద్భుతమైన ఆడియో ఫీల్ పొందవచ్చు.

Also Read: రూ. 14,999 కే హైయర్ 32 ఇంచుల స్మార్ట్ టీవీ.. మతిపోయే ఫీచర్లతో రచ్చ

గూగుల్ అసిస్టెంట్ వాయిస్ కంట్రోల్:

రిమోట్ కంట్రోల్ ద్వారా గూగుల్ అసిస్టెంట్ వాయిస్ కంట్రోల్ సపోర్ట్ లభిస్తుంది. రిమోట్‌లో టైప్ చేసే శ్రమ లేకుండా కేవలం వాయిస్ కమాండ్ ఇచ్చి మీకు నచ్చిన పాటలు లేదా సినిమాలను వెతకవచ్చు. అలాగే ఇన్-బిల్ట్ క్రోమ్‌కాస్ట్ ఫీచర్ వల్ల మీ స్మార్ట్‌ఫోన్‌లోని ఫోటోలు, వీడియోలు లేదా గేమ్‌లను నేరుగా టీవీ పెద్ద స్క్రీన్‌పై ప్లే చేసుకోవచ్చు. కనెక్టివిటీ కోసం హెచ్‌డీఎమ్‌ఐ, యూఎస్‌బీ పోర్టులు, వైఫై, బ్లూటూత్ సపోర్ట్ ఉన్నాయి.

మొత్తానికి రూ. 10వేల లోపు బడ్జెట్‌లో ఆల్ ఇన్ వన్ స్మార్ట్ ఫీచర్లు, మంచి సౌండ్, బ్రాండ్ నమ్మకం కోరుకునే వారికి Kodak 32HDX7XPRO మోడల్ ఒక పర్ఫెక్ట్ వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ అని చెప్పవచ్చు

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×