E-Paper
Advertisement

జస్ట్ రూ.15 ఖర్చు పెడితే చాలు.. ఇల్లంతా కూల్ అయిపోద్ది.. ఇక ఏసీ కూడా ఆన్ చేయరు!

జస్ట్ రూ.15 ఖర్చు పెడితే చాలు.. ఇల్లంతా కూల్ అయిపోద్ది.. ఇక ఏసీ కూడా ఆన్ చేయరు!
Advertisement

Summer Cooling Tips: రోజు రోజుకీ ఎండలు ముదిరిపోతున్న ఈ తరుణంలో.. ఇళ్లను చల్లగా ఉంచుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా రకరకాల వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎప్పుడూ చల్లగా ఉండే బ్రిటన్ వంటి దేశాల్లో సైతం ఇప్పుడు ఉష్ణోగ్రతలు ఏకంగా 34 డిగ్రీల మార్కును తాకుతున్నాయి. అక్కడి వాతావరణ శాఖ హీట్ అలర్ట్ జారీ చేసిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

సాధారణంగా అక్కడి ఇళ్లు చలిని తట్టుకుని, వేడిని లోపలే ఉంచుకునేలా కడతారు. అందుకే ఇప్పుడు ఈ అసాధారణ ఎండలకు ఇళ్లన్నీ సెగలు గక్కుతున్నాయి. మనలాగే అక్కడ కూడా ఏసీలు వాడదామంటే కరెంట్ బిల్లుల మోత, ఫ్యాన్లు వేసినా వేడి గాలే వస్తోంది. ఇలాంటి సమయంలో భారీగా ఖర్చు పెట్టకుండా, ఇంట్లోని వేడిని తగ్గించడానికి అక్కడి ప్రజలు ఒక చవకైన, వినూత్నమైన మార్గాన్ని వెతికారు. కేవలం రూ.15 విలువచేసే కిచెన్ అల్యూమినియం ఫాయిల్‌తో ఇళ్లను చల్లబరుచుకుంటున్నారు. ఎండల నుంచి ఉపశమనం కోసం వారు పాటిస్తున్న ఆ క్రేజీ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఎండను తిప్పికొట్టే ఫాయిల్ పేపర్:

Advertisement

సూర్యరశ్మి కిటికీ అద్దాల గుండా నేరుగా ఇంట్లోకి రావడం వల్ల గది ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోతుంది. దీనిని అడ్డుకోవడానికి కిటికీలకు అల్యూమినియం ఫాయిల్ పేపర్‌ను అంటిస్తున్నారు. ఈ ఫాయిల్ పేపర్ సూర్యుడి నుంచి వచ్చే వేడి కిరణాలను అద్దంలా ప్రతిబింబించి, తిరిగి బయటకు నెట్టేస్తుంది. అయితే, దీనిని కిటికీ లోపలి వైపు కాకుండా, బయటి వైపు అంటించడం వల్ల అద్దాలు వేడెక్కకుండా ఉండి మరింత మెరుగైన ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అల్యూమినియం కరిగిపోతుందనే భయం కూడా లేదు.. ఎందుకంటే ఇది త్వరగా కరగదు.

Also Read: ఏసీ ఆన్ చేశాక ఈ రెండు మార్పులు చేసుకుంటే.. కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గుతుంది!

కిటికీలు, తెరల విషయంలో జాగ్రత్తలు:

Advertisement

పగటిపూట ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు కిటికీలను, తలుపులను పూర్తిగా మూసి ఉంచి, మందపాటి తెరలను (కర్టెన్లు) వేయడం మంచిది. ఎండ తగ్గి, వాతావరణం చల్లబడే సాయంత్రం లేదా రాత్రి వేళల్లో మాత్రమే కిటికీలను తెరిస్తే గదిలోకి చల్లని గాలి వస్తుంది. అలాగే గదుల్లో అక్కడక్కడా గిన్నెల్లో నీళ్లు ఉంచడం వల్ల, ఆ నీరు ఆవిరై గదిలోని వేడిని కాస్త తగ్గిస్తుంది. ఇంట్లో పెంచుకునే మొక్కలు కూడా గాలిలో తేమను విడుదల చేసి సహజసిద్ధమైన ఏసీలా పనిచేస్తాయి.

ఎలక్ట్రానిక్ వస్తువుల సెగలు:

మనం వాడే ల్యాప్‌టాప్‌లు, టీవీలు, గేమ్ కన్సోల్‌లు, చివరకు మొబైల్ ఛార్జర్లు కూడా స్టాండ్‌బై మోడ్‌లో ఉన్నప్పుడు కొంత వేడిని విడుదల చేస్తాయి. ఇవన్నీ కలిసి గది ఉష్ణోగ్రతను పెంచుతాయి. కాబట్టి.. అవసరం లేనప్పుడు వాటన్నిటినీ పూర్తిగా స్విచ్ ఆఫ్ చేయడం మంచిది. ఎక్కువ కాంతిని ఇచ్చే బల్బుల స్థానంలో LED బల్బులను వాడటం వల్ల ఇళ్లు చల్లగా ఉండటమే కాకుండా కరెంట్ బిల్లు కూడా ఆదా అవుతుంది.

Also Read: నెట్ స్లోగా ఉందని రూటర్ మారుస్తున్నారా? ఈ చిన్న సెట్టింగ్స్ మారిస్తే చాలు.. ఇల్లంతా హై-స్పీడ్ ఇంటర్నెట్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×