E-Paper
Advertisement

రూ.2000 లోపే బ్రాండెడ్ 3 జార్ మిక్సీలు.. మసాలాలు, గ్రేవీలు చిటికెలో రెడీ!

రూ.2000 లోపే బ్రాండెడ్ 3 జార్ మిక్సీలు.. మసాలాలు, గ్రేవీలు చిటికెలో రెడీ!
Advertisement

Best Mixer Grinders Under 2000: భారతీయ వంటకాల్లో మసాలాలు,ఘాటైన గ్రేవీల ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే టేస్టీ వంటకాలు చేయాలంటే.. కిచెన్‌లో పర్‌ఫెక్ట్ మిక్సర్ గ్రైండర్ ఉండాల్సిందే. చాలా మంది బ్రాండెడ్ మిక్సీ అనగానే బడ్జెట్ ఎక్కువ ఉంటుందని అనుకుంటారు. కానీ.. కేవలం రూ.2000 లోపే గట్టి మసాలా దినుసులను, ఇడ్లీ-దోశ పిండిని, థిక్ గ్రేవీలను సైతం స్మూత్‌గా గ్రైండ్ చేసే సూపర్ బ్రాండెడ్ 3 జార్ మిక్సీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ వాల్యూ ఇచ్చే టాప్ 3 మిక్సర్ గ్రైండర్ల వివరాలు మీకోసం.

రూ. 2వేలలోపు టాప్ 3 బ్రాండెడ్ మిక్సర్ గ్రైండర్లు:

1. బజాజ్ రెక్స్ 500-వాట్ మిక్సర్ గ్రైండర్ (Bajaj Rex 500W Mixer Grinder):
బడ్జెట్ ధరలో నమ్మకమైన హోమ్ అప్లయెన్సెస్ అనగానే గుర్తొచ్చే మొదటి బ్రాండ్ బజాజ్. ఈ బజాజ్ రెక్స్ మిక్సీ 500 వాట్స్ మోటార్‌తో వస్తుంది. ఇది రోజువారీ కిచెన్ పనులకు, చట్నీలు, మసాలా పొడులు గ్రైండ్ చేయడానికి చాలా పర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. దీనితో పాటు 3 స్టెయిన్‌లెస్ స్టీల్ జార్లు (లిక్విడైజింగ్, డ్రై గ్రైండింగ్, చట్నీ జార్) ఇస్తారు. రస్ట్ ప్రూఫ్ బాడీ, మల్టీ-ఫంక్షనల్ బ్లేడ్ సిస్టమ్ ఉండటం వల్ల ఇది లాంగ్ లైఫ్ ఇస్తుంది.

Advertisement

ధర : సుమారుగా రూ.1,999

2. లైఫ్‌లాంగ్ ఎల్‌ఎల్‌ఎమ్‌జీ20 యాస్పైర్ 500-వాట్ మిక్సీ (Lifelong LLMG20 Aspire 500W):
ఆన్‌లైన్ మార్కెట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ కేటగిరీలో లైఫ్‌లాంగ్ బ్రాండ్ చాలా పాపులర్ అయింది. ఈ 500 వాట్స్ మిక్సర్ గ్రైండర్ చాలా కాంపాక్ట్‌గా, ట్రెండీ డిజైన్‌తో వస్తుంది. దీని మోటార్ గట్టి మసాలాలను కూడా ఈజీగా గ్రైండ్ చేయగలదు. ఇందులో ఓవర్‌లోడ్ ప్రొటెక్టర్ ఉంటుంది. అంటే మిక్సీపై లోడ్ ఎక్కువైతే మోటార్ పాడవకుండా ఇది ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. దీనితో వచ్చే 3 స్టీల్ జార్ల హ్యాండిల్స్ మంచి గ్రిప్‌ను ఇస్తాయి.

Advertisement

ధర : రూ.1,499 మధ్య ఉంటుంది.

3. క్రాంప్టన్ అమేరియో 500-వాట్ మిక్సర్ గ్రైండర్ (Crompton Ameo 500W):
లైటింగ్ , ఫ్యాన్స్ రంగంలో పేరుగాంచిన క్రాంప్టన్ బ్రాండ్, కిచెన్ అప్లయెన్సెస్ లోనూ బెస్ట్ క్వాలిటీ అందిస్తోంది. క్రాంప్టన్ అమేరియో మోడల్ రూ.2000 లోపు దొరికే మరో బెస్ట్ ఆప్షన్. దీని డిజైన్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. అంతే కాకుండా కిచెన్‌కు మోడ్రన్ లుక్ ఇస్తుంది. దీని లీక్-ప్రూఫ్ జార్లు వంటగది చిందరవందర అవ్వకుండా చూస్తాయి. దీనిలోని మోటార్ వెంటిలేషన్ టెక్నాలజీ వల్ల మిక్సీ త్వరగా వేడెక్కదు.

Also Read: ట్రెండీ లుక్, అదిరిపోయే ఫిట్‌నెస్ ఫీచర్లతో..టాప్ 3 శామ్‌సంగ్ వాచ్‌లు!

ధర: రూ. 1,899

ఈ మిక్సీలను ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్స్ లో కొనుగోలు చేసేటప్పుడు బ్యాంక్ ఆఫర్స్ లేదా సేల్ డిస్కౌంట్స్ ఉపయోగిస్తే.. ఇవి ఇంకా తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది. చివరిగా.. మీ బడ్జెట్ రూ. 2000 లోపు ఉండి, మసాలాలు, గ్రేవీలను ఈజీగా గ్రైండ్ చేసే నమ్మకమైన బ్రాండెడ్ మిక్సీ కావాలనుకుంటే.. ఈ మూడింటిలో మీ కిచెన్‌కు నచ్చిన మోడల్‌ను హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×