E-Paper
Advertisement

జులైలో రాబోతున్న స్మార్ట్‌ఫోన్లు..టెక్ లవర్స్‌కు పండగే!

జులైలో రాబోతున్న స్మార్ట్‌ఫోన్లు..టెక్ లవర్స్‌కు పండగే!
Advertisement

July Smartphone Launches: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ప్రతి నెలా కొత్త మోడళ్లు వస్తూనే ఉంటాయి. అయితే జూలై నెల మాత్రం టెక్ ప్రియులకు ప్రత్యేకంగా నిలవబోతోంది. ప్రముఖ బ్రాండ్లు తమ కొత్త 5G, ఏఐ, ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. మెరుగైన కెమెరాలు, భారీ బ్యాటరీలు, ఫవర్ ఫుల్  ప్రాసెసర్లు, ఆకట్టుకునే డిజైన్లతో ఈ ఫోన్లు కస్టమర్లను ఆకర్షించనున్నాయి. బడ్జెట్ నుంచి ప్రీమియం సెగ్మెంట్ వరకు అనేక ఆసక్తికరమైన మోడళ్లు జూలైలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

జులైలో రాబోతున్న స్మార్ట్‌ఫోన్లు.. ఏవి ప్రత్యేకం?

Advertisement

జూలై నెలలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో భారీ పోటీ కనిపించనుంది. ఇప్పటికే పలు కంపెనీలు తమ కొత్త డివైజ్‌లను ప్రకటించగా.. మరికొన్ని కంపెనీలు అధికారిక లాంచ్‌లకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ఏఐ ఫీచర్లు, ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, ప్రీమియం కెమెరా సెటప్‌లపై బ్రాండ్లు ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి.

ఈ లిస్ట్‌లో ముందుగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఫోన్ నథింగ్ ఫోన్ 3. ప్రత్యేక డిజైన్,పవర్ ఫుల్  ప్రాసెసర్, మెరుగైన కెమెరా వ్యవస్థతో ఈ ఫోన్ ప్రీమియం సెగ్మెంట్‌లో పోటీని పెంచనుంది. అలాగే బెస్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు కూడా యూజర్లకు స్పెషల్ అట్రాక్షన్ గా మారనున్నాయి.

Advertisement

వన్‌ప్లస్ నుంచి కూడా కొత్త మోడళ్లు రానున్నాయి. ముఖ్యంగా Nord సిరీస్‌లో కొత్త ఫోన్లు బెస్ట్ ఫర్మామెన్స్, ఫాస్ట్ ఛార్జింగ్, పెద్ద బ్యాటరీలతో మార్కెట్‌లోకి అడుగుపెట్టనున్నాయి. మధ్యతరగతి యూజర్లకు లక్ష్యంగా చేసుకుని కంపెనీ ఈ ఫోన్లను తీసుకురానుంది.

ఫోల్డబుల్ ఫోన్ల అభిమానులకు కూడా జూలై మంచి వార్తలు తీసుకురానుంది. శామ్‌సంగ్ కొత్త ఫోల్డబుల్ సిరీస్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. గత మోడళ్లతో పోలిస్తే మరింత సన్నగా, తేలికగా, ఉండేలా ఈ డివైజ్‌లు రూపొందుతున్నాయని సమాచారం.

వివో కూడా తన ప్రీమియం ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా కెమెరా ప్రియులను దృష్టిలో పెట్టుకుని లేటెస్ట్ ఫోటోగ్రఫీ ఫీచర్లతో కొత్త మోడళ్లను అందించనుంది. ZEISS కెమెరా టెక్నాలజీ వంటి ప్రత్యేకతలు వీటిలో ఉండే అవకాశం ఉంది.

ఇక రియల్‌మీ, ఒప్పో వంటి బ్రాండ్లు ఏఐ ఫీచర్లపై దృష్టి సారిస్తున్నాయి. ఫోటో ఎడిటింగ్, స్మార్ట్ అసిస్టెన్స్, బ్యాటరీ మేనేజ్‌మెంట్ వంటి విభాగాల్లో ఏఐ టెక్నాలజీని మరింతగా వినియోగించనున్నాయి. దీంతో కస్టమర్లు మరింత స్మార్ట్ ఫీల్ లభించనుంది.

మొత్తంగా చూస్తే జూలై నెలలో బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం, ఫోల్డబుల్ ఇలా అన్ని విభాగాల్లో కొత్త స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. కొత్త ఫోన్ కొనాలనుకుంటున్న వారు కొద్ది రోజులు వేచి చూస్తే మరిన్ని ఆప్షన్లు లభించే అవకాశం ఉంది. మార్కెట్‌లో పోటీ పెరగడంతో ధరలు కూడా యూజర్లకు అనుకూలంగా ఉండే అవకాశం కనిపిస్తోంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×