E-Paper
Advertisement

రూ.448 vs రూ.548.. సామాన్యుల కోసం జియో, ఎయిర్‌టెల్ బడ్జెట్ ప్లాన్స్!

రూ.448 vs రూ.548.. సామాన్యుల కోసం జియో, ఎయిర్‌టెల్ బడ్జెట్ ప్లాన్స్!
Advertisement

Jio Airtel: దేశంలోని ప్రముఖ టెలికాం రంగ సంస్థల్లో జియో, ఎయిర్ టెల్ ముందు వరుసలో ఉన్నాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ రెండు సంస్థలు పోటాపోటీగా ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే 3 నెలల వ్యాలిడిటీతో బడ్జెట్ లో వచ్చి రూ.448 ప్లాన్ (జియో), రూ.548 ప్లాన్ (ఎయిర్ టెల్) సామాన్యులకు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. రూ.100 తేడాతో వచ్చిన ఈ రెండు ప్లాన్ల వివరాలు, వాటిలో ఏది బెస్ట్ అన్నది ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

జియో రూ. 448 ప్రయోజనాలు

జియో ఈ ప్లాన్ ను కేవలం ఫ్రీ కాల్స్ కోరుకునే యూజర్ల కోసం తీసుకొచ్చింది. 84 రోజుల వ్యాలిడిటీతో వచ్చిన ఈ ప్లాన్ ద్వారా.. యూజర్లు దేశవ్యాప్తంగా ఏ నెట్ వర్క్ కైనా అన్ లిమిటెడ్ గా కాల్స్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా మొత్తం 1000 ఉచిత ఎస్ఎమ్ఎస్ (SMS) సౌకర్యం కూడా లభిస్తుంది. అయితే ఇందులో ఎలాంటి డేటా లభించదు. కానీ అదనపు ప్రయోజనాల కింద జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ యాప్స్‌కు ఉచిత యాక్సెస్ లభిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ. 548 ప్లాన్

Advertisement

ఎయిర్ టెల్ ప్లాన్ విషయానికి వస్తే ఇది కూడా 84 రోజుల వ్యాలిడిటీతో వచ్చింది. దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. అలాగే ప్లాన్ మెుత్తం కాలానికి 900 ఉచిత ఎస్ఎమ్ఎస్‌లు లభిస్తాయి. అయితే ఈ ప్లాన్ లో 7GB లిమిటెడ్ డేటాను ఎయిర్ టెల్ ఆఫర్ చేస్తోంది. వైఫై అందుబాటులో లేనప్పుడు, చిన్నపాటి ఆన్‌లైన్ పనుల కోసం ఈ డేటాను వాడుకోవచ్చు. ఇక అడిషనల్ బెనిఫిట్స్ కింద ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే, అపోలో 24/7 సర్కిల్, హలో ట్యూన్స్ కు ఫ్రీ యాక్సెస్ లభించనుంది.

Also Read: జియో ధమాకా ఆఫర్.. భారీగా ‘ఎక్స్‌ట్రా డేటా’.. గేమర్స్, యూత్‌కు పండగే!

రెండింటిలో ఏ ప్లాన్ బెస్ట్?

Advertisement

తక్కువ ఖర్చులో వాయిస్ ఓన్లీ ప్లాన్ కోరుకుంటే.. జియో రూ.448 బెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది ఎయిర్‌టెల్ కంటే రూ. 100 తక్కువకే లభిస్తుంది. ఒకవేళ జియో రీఛార్జ్ చేసిన తర్వాత డేటా అవసరమైతే చిన్నపాటి డేటా వోచర్లతో విడిగా రీఛార్జ్ చేసుకోవచ్చు. అలాకాకుండా యూపీఐ పేమెంట్స్ కోసం కచ్చితంగా పరిమిత డేటా కోరుకుంటే మాత్రం.. ఎయిర్ టెల్ రూ.548 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాల్సిందే. ఫైనల్ గా మీ అవసరానికి ఏ ప్లాన్ సరిగ్గా సరిపోతుందో చూసి మీరే ఎంచుకోండి.

Also Read: బాత్రూమ్‌లో చేసే ఈ 7 తప్పులు ఇంట్లో సమస్యలకు కారణం.. ఆర్థిక కష్టాలకు ఆహ్వానం

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×