E-Paper
Advertisement

Jio Network: జియో, వి నెట్‌వర్క్‌లో అంతరాయం.. అసలు ఏమైంది?

Jio Network: జియో, వి నెట్‌వర్క్‌లో అంతరాయం.. అసలు ఏమైంది?
Advertisement

Jio Network: దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థలైన జియో, వొడాఫోన్-ఐడియా నెట్‌వర్క్‌లు సాంకేతిక సమస్యల కారణంగా తాత్కాలికంగా ఈ రోజు అంతరాయాన్ని ఎదుర్కొన్నాయి. ఈ సమస్య ఎయిర్‌టెల్ వినియోగదారులు కూడా ఎదుర్కొన్నారు. జియో, వోడా ఫోన్ నెట్ వర్క్ లు సమస్యను ఎదుర్కొన్న కొన్ని గంటల తర్వాత వెలుగులోకి వచ్చింది. డౌన్‌ డిటెక్టర్‌ వివరాల ప్రకారం.. ఈ రోజ సాయంత్రం 5 గంటల సమయంలో జియో నెట్‌వర్క్‌కు సంబంధించి 200కు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. అదే సమయంలో వొడాఫోన్-ఐడియాకు సంబంధించి సుమారు 100 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ రెండు సంస్థల ఫిర్యాదుల సంఖ్య ఎయిర్‌టెల్‌తో పోలిస్తే తక్కువగా ఉన్నప్పటికీ, సాధారణ స్థాయితో పోలిస్తే కాస్త ఎక్కువగా ఉంది.

సాయంత్రం 8: 30 గంటల సమయంలో డౌన్‌ డిటెక్టర్‌ను మళ్లీ పరిశీలించగా.. జియో ఫిర్యాదుల సంఖ్య 54కి తగ్గగా, వొడాఫోన్-ఐడియా ఫిర్యాదులు 9కి తగ్గాయి. ఇది నెట్‌వర్క్‌లు క్రమంగా సాంకేతిక సమస్య బయట పడ్డాయని తెలిపింది. డౌన్‌ డిటెక్టర్ అందించిన అవుటేజ్ మ్యాప్ ప్రకారం, వొడాఫోన్-ఐడియా సమస్య ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, జైపూర్ వంటి నగరాల్లోని వినియోగదారులు ఎక్కువ ఈ సమస్యకు గురయ్యారు. జియో నెట్‌వర్క్ సమస్య మరింత విస్తృతంగా ఉంది. ఇందులో చండీగఢ్, హైదరాబాద్, లక్నో, పాట్నా, అహ్మదాబాద్ వంటి అనేక నగరాల్లో సమస్య ఎక్కువగా వచ్చింది. అయితే, ఈ రెండు టెలికాం సంస్థలు ఈ సమస్యపై ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

Advertisement

ALSO READ: Mega Job Mela: నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రేపు హైదరాబాద్‌లో మెగా జాబ్ మేళా.. టెన్త్ పాసైతే చాలు

ఇదే రోజు మధ్యాహ్నం 4:32 గంటల సమయంలో ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌కు సంబంధించి 3,600కు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. 5:30 గంటల సమయంలో ఈ సంఖ్య 2,000 కంటే తక్కువకు చేరింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో మొదటగా గుర్తించిన ఈ సమస్య, తర్వాత ముంబై, బెంగళూరు నగరాలకు కూడా వ్యాపించింది. ఎయిర్‌టెల్ సంస్థ ఈ సమస్యను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో అధికారికంగా వివరించింది. మా నెట్‌వర్క్‌లో అంతరాయం ఏర్పడింది. టీమ్ ఈ సమస్యను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తోంది. అసౌకర్యానికి క్షమించండి’ అని ఎయిర్‌టెల్ ఒక ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.

Advertisement

ALSO READ: Asia Cup 2025: టీమిండియాలోకి 14 ఏళ్ల వైభవ్, సాయి సుదర్శన్.. మంగళవారం 1:30 గంటలకు గెట్ రెడీ ?

ఎయిర్‌టెల్‌కు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా మొబైల్ ఫోన్ సేవలు, సిగ్నల్ సమస్యలు, మొబైల్ ఇంటర్నెట్ సమస్యలకు సంబంధించినవి. జియో, వొడాఫోన్-ఐడియా నెట్‌వర్క్‌లు క్రమంగా కోలుకుంటున్నప్పటికీ.. ఈ సాంకేతిక సమస్యలు టెలికాం సేవలపై ఆధారపడే వినియోగదారులకు అసౌకర్యాన్ని కలిగించాయి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×