E-Paper
Advertisement

Jio Safety Warnings: హైవేపై ప్రయాణిస్తున్నారా?.. ఇకపై JIO కొత్తగా ఇలా చేయనుంది!

Jio Safety Warnings: హైవేపై ప్రయాణిస్తున్నారా?.. ఇకపై JIO కొత్తగా ఇలా చేయనుంది!
Advertisement

Jio Safety Warnings: జాతీయ రహదారులపై ప్రయాణం సురక్షితంగా సాగేలా కొత్త మొబైల్ ఆధారిత భద్రతా హెచ్చరిక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) రిలయన్స్ Jioతో ఒప్పందం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలు, పొగమంచు, రోడ్లపైకి జంతువులు, సడెన్‌ డైవర్షన్స్‌ వంటి ప్రమాదకర మలుపుల సమాచారం ఇకపై ప్రయాణికుల ఫోన్ నెంబర్లకు నేరుగా పంపనున్నారు. అలాగే, దీనికోసం ఎలాంటి హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయనవసం లేదు. ఈ ప్రాసెస్ మొత్తం జియో 4జీ, 5జీ టెలికాం ఫెసిలిటీపై ఆధారపడి నడుస్తుంది. దీనిలో భాగంగా ప్రయాణికులు SMS, వాట్సప్, హై ప్రయారిటీ కాల్స్‌ ద్వారా ముందస్తు హెచ్చరికలు స్వీకరిస్తారు. దీంతో ప్రయాణికులు వాహన వేగాన్ని తగ్గించడంతో పాటు ప్రమాదకరమైన ప్రాంతాల్లో జాగ్రత్త పడతారు.

ఎలా పని చేస్తుందంటే:

నేష్నల్ హెవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మొదట ఈ పైలట్ ప్రాజెక్ట్‌ను దేశంలోని నాలుగు-ఐదు హైవేలపై ప్రారంభించనున్నారు. వీటిలో ఢిల్లీ, చండీగఢ్, పంజాబ్, హర్యానా, ఒడిశాలోని కొన్ని హైవేలు ఉన్నాయి. ఈ ఫీచర్ కారు, బస్సు, ట్రక్ లేదా ఇతర వాహనాలను నడిపేవారికి ఉపయోగపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Also Read: మెసేజింగ్ యాప్స్‌కు కేంద్రం ఆదేశాలు.. సిమ్‌ ఉంటేనే వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ సేవలు!

అమల్లోకి ఎప్పుడు?

జాతీయ రహదారి మీద ప్రయాణించే వాళ్లకి ఈ సేవ మరికొన్ని నెలలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీని కోసం ఇటీవలె NHAI రిలయన్స్ జియోతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని కింద 4G, 5G నెట్‌వర్క్‌లను ఉపయోగించే స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు హైవేలపై ప్రయాణించేటప్పుడు ఎస్‌ఎంఎస్, వాట్సప్ సందేశాలు అందుతాయని తెలిపారు.

వాయిస్ మెసేజ్ కూడా..

Advertisement

ఈ ప్రాజెక్ట్ ప్రారంభంలో వాహనదారులకు SMS అందుతాయని భావిస్తున్నారు. ఆ తర్వాత వాట్సప్ సందేశాలు అందుబాటులోకి వస్తాయి. అయితే.. రాబోయే రోజుల్లో వాహనదారులు పదే పదే ఫోన్ చూడాల్సిన అవసరం లేకుండా వాయిస్ మెసేజ్‌లు కూడా అందుబాటులోకి వస్తాయని నేష్నల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది.

కలిగే ప్రయోజనాలివే:

కొత్తగా తీసుకురానున్న ఈ ఫీచర్ వాహనదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. హైవేపై ప్రయాణిస్తున్న వారికి ఒకటి లేదా రెండు కిలోమీటర్ల ముందుగానే ప్రమాదకరమైన మలుపులు ఉన్నాయనో లేదా దట్టమైన పొగమంచు ఏర్పడిందనో సమాచారం అందుతుంది. దీంతో పాటు ఏనుగులు లేదా ఇతర జంతువుల ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో కూడా NHAI నుంచి హెచ్చరికలు అందుతాయి.

Also Read: వాట్సాప్‌లో APK ఫైల్స్‌తో మిమ్మల్ని ఎలా దోచేస్తారో తెలుసా? ఈ వీడియో చూస్తే షాకే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×