// // జియో కనీవినీ ఎరుగుని ప్లాన్.. 3 నెలలు రచ్చ రంభోలా! -->
E-Paper
Advertisement

యూత్‌కు జియో బంపరాఫర్.. కనీవినీ ఎరుగుని ప్లాన్.. 3 నెలలు రచ్చ రంభోలా..!

యూత్‌కు జియో బంపరాఫర్.. కనీవినీ ఎరుగుని ప్లాన్.. 3 నెలలు రచ్చ రంభోలా..!
Advertisement

Jio Plan: ప్రముఖ టెలికాం రంగ సంస్థ రిలయన్స్ జియో.. యువత, గేమింగ్ ప్రియులను దృష్టిలో ఉంచుకొని సరికొత్త రీఛార్జ్ ప్లాన్ ను లాంచ్ చేసింది. ‘జియో యూత్ అండ్ గేమింగ్ ప్లాన్’ (Jio Youth and Gaming Plan) పేరుతో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కింద అపరిమిత కాల్స్, డేటా తోపాటు ప్రీమియం సబ్ స్క్రిప్షన్లను సైతం యూజర్ పొందవచ్చు. అవి ఏంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.

ప్లాన్ ధర.. ప్రయోజనాలు

జియో ఈ ప్లాన్ ధరను రూ.459గా నిర్ణయించింది. 28 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చిన ఈ ప్లాన్ లో ప్రతీ రోజూ 2GB డేటా యూజర్ కు లభించనుంది. ఇది కాకుండా బోనస్ కింద మరో 5GB డేటా సైతం రానుంది. మరోవైపు అర్హత కలిగిన యూజర్లకు 5G డేటా అపరిమితంగా అందించనున్నట్లు జియో పేర్కొంది. వీటితో పాటు అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100SMSలు యూజర్ చేసుకోవచ్చు.

ఏఐ ప్రో బెన్‌ఫిట్స్..

Advertisement

రూ.459 ప్లాన్ లో తీసుకొచ్చిన కొన్ని అదనపు ప్రయోజనాలు ఈ ప్లాన్ కే హైలెట్ గా నిలుస్తున్నాయి. మరీ ముఖ్యంగా గూగుల్ జెమిని ప్రో ఉచిత సబ్ స్క్రిప్షన్ ప్రధానంగా ఆకట్టుకుంటోంది. దాదాపు రూ.35,100 విలువైన గూగుల్ జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా (18 నెలలపాటు) యూజర్ పొందవచ్చు. దీంతో పాటు 5TB (5000 GB) క్లౌడ్ స్టోరేజ్ కూడా లభిస్తుంది.

స్నాప్ చాట్, హాట్‌స్టార్ సబ్ స్క్రిప్షన్స్

అలాగే ఈ ప్లాన్ కింద స్నాప్‌చాట్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ ను జియో ఆఫర్ చేస్తోంది. మరోవైపు క్రీడల లైవ్ స్ట్రీమింగ్ కోసం ఫ్యాన్‌కోడ్ యాక్సెస్ యూజర్ కు దక్కుతుంది. అంతేకాకుండా 3 నెలల పాటు జియో హాట్ స్టార్ ఫ్రీ సబ్ స్క్రిప్షన్ (మెుబైల్ వెర్షన్) సైతం యూజర్ పొందవచ్చు. తద్వారా ఐపీఎల్ తో పాటు ఓటీటీ కంటెంట్ ను 90 రోజుల పాటు ఫ్రీగా ఆస్వాదించవచ్చు. జియో గేమ్స్ (JioGames) మెుబైల్ సబ్ స్క్రిప్షన్ కూడా ఈ ప్లాన్ లో భాగంగా అందిస్తున్నారు.

Advertisement

Also Read: బయట 45°C ఎండ.. ఇంట్లో ఫ్యాన్, ఏసీ, కూలర్ .. ఏది వాడితే నెలకు ఖర్చు ఎంత?

ఎలా రీఛార్జ్ చేసుకోవాలి?

అర్హత కలిగిన జియో యూజర్లు.. మై జియో (MyJio) యాప్ లేదా జియో వెబ్‌సైట్ ద్వారా ఈ రూ.459 ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు. లేదంటే గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కూడా ఈ రీఛార్జ్ ను పొందవచ్చు. అనంతరం జెమిని ప్రో వంటి ఆఫర్లను MyJio యాప్‌లోని ‘క్లెయిమ్ నౌ’ (Claim Now) బ్యానర్ ద్వారా యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

Also Read: Redmi Phones: షావోమీ బడ్జెట్ ఫోన్లు.. నిజంగా బాగున్నాయ్ మాష్టారు.. హై రేంజ్ ఫీచర్లు చాలా తక్కువ ధరలో!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×