E-Paper
Advertisement

జియో సూపర్ ఆఫర్.. సంవత్సరం పాటు.. రోజూ 2.5GB డేటా, నాన్ స్టాప్ వినోదం!

జియో సూపర్ ఆఫర్.. సంవత్సరం పాటు.. రోజూ 2.5GB డేటా, నాన్ స్టాప్ వినోదం!
Advertisement

Jio Plans: టెలికాం రంగంలో తనదైన ముద్ర వేసిన రిలయన్స్ జియో.. లాంగ్ టర్మ్ ప్లాన్స్ కోరుకునే వినియోగదారుల కోసం ఒక అద్భుతమైన ప్లాన్‌ను అందుబాటులో ఉంచింది. అదే రూ. 3,599 ప్రీపెయిడ్ ప్లాన్. ప్రతీ నెలా రీఛార్జ్ చేసుకునే ఇబ్బంది లేకుండా.. ఒకేసారి ఏడాది పొడవునా నిరంతర సేవలు పొందాలనుకునే వారికి ఈ ప్లాన్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఈ ప్లాన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, ప్రయోజనాలు ఈ కథనంలో చూద్దాం.

డేటా యూజర్లకు పండుగే..

రూ. 3,599 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే వినియోగదారులకు 365 రోజుల (ఒక సంవత్సరం) వ్యాలిడిటీ లభిస్తుంది. డేటా వినియోగం ఎక్కువగా ఉండే వారిని దృష్టిలో ఉంచుకుని జియో ఈ ప్లాన్‌లో భారీగా డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు ప్రతిరోజూ 2.5 GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అంటే ఏడాది మొత్తానికి కలిపి దాదాపు 912.5 GB డేటా అందుబాటులోకి వస్తుంది. ఒకవేళ రోజువారీ డేటా పరిమితి ముగిస్తే ఇంటర్నెట్ వేగం 64 Kbpsకి తగ్గుతుంది.

అపరిమిత కాల్స్, ఎస్ఎంఎస్‌లు

Advertisement

ఈ ప్లాన్ కింద భారీ డేటాతో పాటు అపరిమిత కాల్స్ సైతం యూజర్లకు లభిస్తాయి. దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమితంగా (Unlimited) లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. అలాగే రోజుకు 100 SMSలు ఉచితంగా లభిస్తాయి. కాబట్టి రూ.3,599 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే ఏడాది పొడవున కాల్స్ గురించి అస్సలు ఆలోచించాల్సిన పనే ఉండదు.

అన్‌లిమిటెడ్ 5G డేటా ఆఫర్

ఈ ప్లాన్ కింద అపరిమిత 5G డేటాను పొందే అవకాశాన్ని సైతం కస్టమర్లకు జియో కల్పిస్తోంది. మీరు జియో 5G నెట్‌వర్క్ పరిధిలో ఉంటూ 5G స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తుంటే అపరిమిత 5G డేటా లభిస్తుంది. దీనికి ఎలాంటి రోజువారీ పరిమితి ఉండదు.

Advertisement

Also Read: 6000mAh బ్యాటరీ, 7 ఏళ్ల అప్‌డేట్స్‌తో Motorola Razr Fold విడుదల.. ధర ఎంతంటే?

జియో యాప్స్ కంటెంట్

ఈ ప్లాన్ లో కేవలం కాలింగ్, డేటా మాత్రమే కాకుండా వినోదం కోసం జియో తన సొంత అప్లికేషన్ల సబ్‌స్క్రిప్షన్‌ను కూడా ఉచితంగా అందిస్తోంది. జియో సినిమా (JioCinema) యాప్ ద్వారా సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఉచితంగా వీక్షించవచ్చు. అలాగే జియో టీవీ ద్వారా లైవ్ టీవీ ఛానళ్లను మొబైల్‌లోనే చూసే అవకాశం లభిస్తుంది. జియో క్లౌడ్ సాయంతో మీ ముఖ్యమైన ఫోటోలు, ఫైల్స్ దాచుకోవడానికి ఉచిత క్లౌడ్ స్టోరేజ్ కూడా యూజర్ పొందొచ్చు.

Also Read: Gundeninda GudiGantalu Today episode: రోహిణి పై మనోజ్ కు అనుమానం.. మీనాకు కళ్యాణ్ ఆఫర్.. బాలుకు దొరికిన విల్లా విజయ్..

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×