E-Paper
Advertisement

జియో రూ.199 ప్లాన్.. బడ్జెట్ ధరలో అపరిమిత బెనిఫిట్స్.. కానీ ఓ మెలిక ఉంది!

జియో రూ.199 ప్లాన్.. బడ్జెట్ ధరలో అపరిమిత బెనిఫిట్స్.. కానీ ఓ మెలిక ఉంది!
Advertisement

Jio Plan: జియో తన యూజర్ల కోసం రూ. 199 లకే సరికొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర టెలికాం కంపెనీల పోటీని తట్టుకుని ఈ ప్లాన్ నిలబడుతుందా? లేదా వాటి ముందు తోక ముడుస్తుందా? అనే ఆసక్తికరమైన చర్చ ప్రస్తుతం నడుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, విశ్లేషణను ఒకసారి పరిశీలిద్దాం.

సామాన్యుల కోసమే..

రీఛార్జ్ ధరలు పెరిగినప్పటి నుంచి సామాన్య, మధ్యతరగతి వినియోగదారులు తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చే ప్లాన్ల కోసం ఎదురుచూస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే జియో ఈ రూ. 199 ప్లాన్‌ను డిజైన్ చేసింది. తద్వారా బడ్జెట్ యూజర్లను ఆకట్టుకోవాలని జియో భావించింది.

ప్లాన్ లో లభించే బెనిఫిట్స్

Advertisement

రూ.199 ప్లాన్ ద్వారా వినియోగదారులకు అనేక రకాల ప్రయోజనాలు లభించనున్నాయి. 18 రోజుల వ్యాలిడిటీతో వచ్చిన ఈ ప్లాన్ ను రీఛార్జ్ చేసుకోవడం ద్వారా దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమితంగా వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. రోజువారీ అవసరాల కోసం ప్రతీరోజూ 1.5GB డేటా లభించనుంది. ప్లాన్ పూర్తయ్యే సరికి మెుత్తంగా 27GB డేటాను యూజర్లు పొందొచ్చు. డేటా పరిమితి అయ్యాక కూడా 64kbps స్పీడుతో అపరిమిత డేటాను వాడుకోవచ్చు. దీంతో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్ లను యూజర్ చేసుకోవచ్చు.

అదనపు బెనిఫిట్స్..

రూ.199 ప్లాన్ కింద జియో మరికొన్ని అదనపు బెనిఫిట్స్ ను సైతం ఆఫర్ చేస్తోంది. జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ వంటి జియో యాప్స్‌కు ఉచిత యాక్సెస్ ను అందిస్తోంది. కాబట్టి యూజర్.. ఈ యాప్స్ ను ఉపయోగించుకొని లైవ్ టీవీలు, షోలు, క్రీడలు వీక్షించవచ్చని జియో వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Also Read: జగదీష్ రెడ్డి గుంటకండ్ల కాదు.. గుంటనక్క కళ్లు.. ఎంపీ చామల ఫైర్!

లాభమా? నష్టామా?

ప్రస్తుతం ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (Vi) కూడా రూ. 200 బడ్జెట్ లో రకరకాల ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఎయిర్ టెల్ సరిగ్గా రూ.199 ధరకే ఓ బడ్జెట్ ప్లాన్ తీసుకొచ్చింది. అయితే ఇది 28 రోజుల వ్యాలిడిటీతో ప్రతీరోజూ 2GB డేటాను ఆఫర్ చేస్తోంది. కాలింగ్, ఎస్ఎంఎస్ లు కూడా ఉచితంగా అందిస్తోంది. కాబట్టి డేటా పరంగా, వ్యాలిడిటీ పరంగా ఎయిర్ టెల్ ప్లాన్ కాస్త ఎక్కువ ప్రయోజనాలను అందిస్తోందని చెప్పవచ్చు. అయితే జియో ప్లాన్ లో.. జియో కంటెంట్ ఉచితంగా లభిస్తుండటం యూజర్లకు ప్రధాన అడ్వాంటేజ్ గా కానుంది.

Also Read: మనసు మార్చుకున్న బాలినేని.. సీఎం చంద్రబాబుతో భేటీ వెనుక, మేటర్ అదేనా.. మరి ఎప్పుడు?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×