E-Paper
Advertisement

Jio సూపర్ ప్లాన్.. ఫ్రీ కాల్స్, 28 రోజుల వ్యాలిడిటీ.. ఇంత తక్కువ ధరకా..!

Jio సూపర్ ప్లాన్.. ఫ్రీ కాల్స్, 28 రోజుల వ్యాలిడిటీ.. ఇంత తక్కువ ధరకా..!
Advertisement

Jio Plans: రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త, చౌకైన ప్లాన్లను పరిచయం చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ప్రయోజనాలను ఆశించే వారి కోసం జియో ఒక అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులో ఉంచింది. కేవలం రూ. 190 లోపే.. పూర్తి 28 రోజుల వ్యాలిడిటీతో వస్తున్న ఈ ప్లాన్ కు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం.

రూ. 189 ప్లాన్ బెనిఫిట్స్

జియో అందిస్తున్న ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్.. ధర రూ. 189. నెల రోజులు వ్యాలిడిటీతో తక్కువ ధరకే బెస్ట్ ప్లాన్ కోరుకునేవారికి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది. ఈ ప్లాన్ కింద యూజర్ కు అపరిమిత వాయిస్ కాల్స్ లభిస్తాయి. దేశంలో ఏ నెట్ వర్క్ కు అయినా ఎంతసేపైనా ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. దీంతో పాటు 28 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 300 ఉచిత ఎస్ఎంఎస్‌లు కూడా లభిస్తాయి.

మరి డేటా సంగతేంటి?

Advertisement

రూ.189 ప్లాన్ ను ప్రధానంగా కాలింగ్ అవసరాలు, సిమ్ యాక్టివ్ గా ఉంచుకోవాలని భావించే వారికోసం జియో తీసుకొచ్చింది. కాబట్టి ఇందులో డేటాను నామమాత్రంగానే జియో ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ లో మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 2 GB హై స్పీడ్ డేటా లభించనుంది. ఈ డేటా లిమిట్ పూర్తయిన తర్వాత కూడా ఇంటర్నెట్ ఆగిపోదు. కానీ స్పీడ్ 64 Kbps కి తగ్గుతుంది. వాట్సాప్ మెసేజ్‌లు పంపుకోవడానికి ఇది సరిపోతుందని జియో వర్గాలు చెబుతున్నాయి.

ఫ్రీగా జియో యాప్స్

రూ.189 ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులకు అదనపు ప్రయోజనాలను సైతం జియో అందిస్తోంది. జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ వంటి జియో యాప్స్‌కు ఉచిత యాక్సెస్ ఆఫర్ చేస్తోంది. దీనివల్ల ప్రయాణాల్లో లేదా ఖాళీ సమయంలో సినిమాలు, లైవ్ టీవీ షోలను ఉచితంగా చూసి ఎంజాయ్ చేయవచ్చు.

Advertisement

Also Read: Jio యూజర్లకు పండుగే.. తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చే.. టాప్-5 ప్లాన్‌లు ఇవే!

ఈ ప్లాన్ ఎవరికి బెస్ట్?

ఇంట్లో లేదా ఆఫీస్‌లో వైఫై ఉండి మొబైల్ డేటాతో పెద్దగా పనిలేని వారికి ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. అలాగే ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ కాల్స్ కోసం సెకండరీ సిమ్ కార్డ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వారికి సైతం ఈ రూ. 189 ప్లాన్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

Also Read: రూ.100 లోపే అదిరిపోయే డేటా ప్లాన్స్.. Jio, Airtel, Vi, BSNL ఏదైనా సరే.. యూజర్లకు పండగే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×