E-Paper
Advertisement

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!
Advertisement

Jio Q1 FY27 Results: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్.. డిజిటల్ రంగంలోనూ దుమ్మురేపుతోంది. టారిఫ్‌ల పెంపు, 5జీ సేవల విస్తరణ, డిజిటల్ సేవల అద్భుత వృద్ధి కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (FY27) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో జియో రెండంకెల ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. త్వరలోనే పబ్లిక్ లిస్టింగ్ (IPO) కానున్న తరుణంలో ఈ ఫలితాలు కంపెనీకి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.

పెరిగిన ఆదాయం.. మెరుగైన లాభాలు

జూన్ 2026తో ముగిసిన త్రైమాసికానికి జియో ప్లాట్‌ఫామ్స్ కార్యకలాపాల ద్వారా రూ. 39,173 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ. 35,032 కోట్లతో పోలిస్తే ఇది 11.8 శాతం ఎక్కువ కావడం విశేషం. కంపెనీ నిర్వహణ లాభం 15.1 శాతం వృద్ధితో రూ. 20,865 కోట్లకు చేరింది. ఎబిటా మార్జిన్లు 150 బేసిస్ పాయింట్లు మెరుగుపడి 53.3 శాతానికి పెరిగాయి. ఇక నికర లాభం సైతం 9.2 శాతం వృద్ధితో రూ.7,764 కోట్లుగా నమోదైంది.

డిజిటల్ ఈకోసిస్టమ్ సూపర్ హిట్

Advertisement

జియో కేవలం టెలికాం సేవలకే పరిమితం కాకుండా ఒక సంపూర్ణ డిజిటల్ ఈకోసిస్టమ్‌గా ఎదిగింది. కంటెంట్, క్లౌడ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ , మేనేజ్డ్ సర్వీసులకు డిమాండ్ పెరగడంతో జియో డిజిటల్ బిజినెస్ ఏకంగా 20 శాతం వృద్ధిని సాధించింది. కనెక్టివిటీ బిజినెస్ కూడా 11 శాతం వృద్ధిని నమోదు చేసింది.

53 కోట్లు దాటిన సబ్‌స్క్రైబర్లు

దేశీయ 5జీ మార్కెట్‌లో జియో తన అగ్రస్థానాన్ని ఈ త్రైమాసికంలో మరింత సుస్థిరం చేసుకుంది. కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 53.3 కోట్లు దాటగా.. అందులో 28.5 కోట్ల మంది 5జీ సబ్‌స్క్రైబర్లే ఉన్నారు. దీంతో దేశంలోనే అతిపెద్ద 5జీ ఆపరేటర్‌గా జియో రికార్డు సృష్టించింది. ఒక్కో జియో కస్టమర్ నుంచి వచ్చే సగటు ఆదాయం రూ. 215.6 కి పెరిగింది. అలాగే కస్టమర్లు నెట్‌వర్క్ మారే రేటు 1.6 శాతానికి పడిపోవడం విశేషం.

హోమ్ బ్రాడ్‌బాండ్‌లోనూ హవా

Advertisement

మొబైల్ సేవలనే కాకుండా హోమ్ బ్రాడ్‌బాండ్ మార్కెట్‌ను కూడా జియో సత్తా చాటింది. తొలి త్రైమాసికం నాటికి ఫిక్స్‌డ్ బ్రాడ్‌బాండ్ కస్టమర్ల సంఖ్య 2.86 కోట్లకు చేరడంతో ఈ విభాగంలో జియో 43 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకుంది. ముఖ్యంగా జియో ‘ఎయిర్‌ఫైబర్’ సర్వీస్ 1.4 కోట్ల మంది వినియోగదారులతో దేశంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తోంది.

Also Read: యూట్యూబ్ యాడ్స్ ఇబ్బంది పెడుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్స్ మీ కోసమే!

డీప్-టెక్ సంస్థగా మార్పు

ఇదిలా ఉంటే.. తమ కంపెనీ టెలికాం ఆపరేటర్ మాత్రమే కాదని అధునాతన సాంకేతికత, అంతర్జాతీయ పేటెంట్లతో కూడిన ‘డీప్-టెక్’ బిజినెస్‌గా రూపాంతరం చెందిందని జియో ప్లాట్‌ఫామ్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాష్ ఎం. అంబానీ స్పష్టం చేశారు. ఐపీఓ దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ఈ అద్భుత ఆర్థిక ఫలితాలు జియో వ్యూహాత్మక విజయానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

Also Read: వీఐ ‘ఇన్‌స్టాడేటా’ ఆఫర్.. ఫ్రీగా 1GB ఎమర్జెన్సీ డేటా.. కానీ ఒక షరతు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×