E-Paper
Advertisement

జియో సరికొత్త ప్లాన్.. రూ.200కే 15 ఓటీటీలు.. 1000 టీవీ ఛానెల్స్ ఫ్రీ!

జియో సరికొత్త ప్లాన్.. రూ.200కే 15 ఓటీటీలు.. 1000 టీవీ ఛానెల్స్ ఫ్రీ!
Advertisement

Jio OTT Pass: ప్రముఖ ప్రైవేటు టెలికాం సంస్థ జియో.. మరో సరికొత్త ప్లాన్ ను లాంచ్ చేసింది. ‘జియో ఓటీటీ పాస్’ పేరుతో ప్రత్యేక యాడ్ ఆన్ ప్యాక్ ను తీసుకొచ్చింది. కేవలం రూ.200కే ఉచితంగా ఓటీటీ సబ్ స్క్రిప్షన్స్ తో పాటు, హైస్పీడ్ డేటా కస్టమర్లకు లభించనుంది. ఇంతకీ ఈ ప్లాన్ వల్ల యూజర్లకు కలిగే బెనిఫిట్స్ ఏంటి? ఎవరికి లాభం? వంటి వివరాలను ఇప్పుడు చూద్దాం.

రూ. 200లకే వినోదాల విందు

టెలికాం రంగంలో తన మార్క్ సంచలనాలకు కేరాఫ్ గా నిలిచిన జియో.. ఈసారి సామాన్యుడి బడ్జెట్‌లో భారీ ఆఫర్‌ను ప్రకటించింది. 28 రోజుల వ్యాలిడిటీతో రూ. 200కే ఏకంగా 15 ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. సినిమా ప్రియులకు, సిరీస్‌లు చూసేవారికి ఇది భారీ శుభవార్త అని చెప్పవచ్చు.

1,000 లైవ్ టీవీ ఛానెళ్లు

Advertisement

ఓటీటీలతో పాటు వినోదాన్ని మరింత పెంచేందుకు ఈ ప్లాన్‌లో 1,000కి పైగా లైవ్ టీవీ ఛానెళ్లను కూడా జియో చేర్చింది. దీంతో కేబుల్ టీవీ, డీటీహెచ్ ఖర్చుల భారానికి చెక్ పడినట్లే అని టెలికాం వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు స్మార్ట్ టీవీ, మొబైల్ లేదా టాబ్లెట్‌లలో నేరుగా ఈ ఛానెళ్లను వీక్షించవచ్చని జియో వర్గాలు పేర్కొంటున్నాయి.

అన్‌లిమిటెడ్ 5G డేటా

రూ.200 ఓటీటీ పాస్ ద్వారా అన్‌లిమిటెడ్ 5G డేటాను సైతం యూజర్ కు జియో అందించనుంది. మీ ఏరియాలో జియో 5G నెట్‌వర్క్ ఉండి మీ దగ్గర 5G మొబైల్ ఉంటే.. ఎలాంటి డేటా లిమిట్ లేకుండా హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను ఎంజాయ్ చేయవచ్చు. అయితే 5G అపరిమిత డేటా ఛాన్స్ లేని వారికి ఈ ప్యాక్ కింద ఎలాగో 30GB డేటాను జియో ఆఫర్ చేస్తోంది. దాని ద్వారా ఓటీటీ కంటెంట్ ను చూసి ఎంజాయ్ చేయవచ్చు.

Advertisement

Also Read: Helium AC: మార్కెట్లో సంచలనం.. బుల్లి ఏసీ వచ్చిందోచ్.. మధ్యతరగతికి పండగే!

ఎవరికి లాభం?

తక్కువ ఖర్చుతో ఎక్కువ వినోదాన్ని కోరుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు రూ.200 ఓటీటీ ప్యాక్ ది బెస్ట్ గా నిలవనుంది. అలాగే రూమ్‌లలో ఉండే స్టూడెంట్స్, బ్యాచిలర్స్‌కు ఈ ప్యాక్ ఒక పర్‌ఫెక్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు. అంతేకాదు వేర్వేరు ఓటీటీలకు వేల రూపాయలు ఖర్చు పెట్టే బదులు.. జియో తెచ్చిన ఈ సింగిల్ ప్యాక్‌తో బోలెడంత డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఈ ప్యాక్ ను మైజియో (MyJio) యాప్ లేదా జియో వెబ్‌సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.

Also Read: ఇంట్లోనే వర్షం.. బెడ్‌రూమ్ పక్కనే వెన్నెల.. మన తాతల నాటి ‘ఏసీ ఇల్లు’!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×