E-Paper
Advertisement

Jio మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. రూ.200 రీఛార్జ్ చేస్తే రూ.1500 లాభం.. ఛాన్స్ మిస్ అవ్వకండి మామా!

Jio మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. రూ.200 రీఛార్జ్ చేస్తే రూ.1500 లాభం.. ఛాన్స్ మిస్ అవ్వకండి మామా!
Advertisement

Jio 200 OTT Plan: రిలయన్స్ జియో తమ యూజర్ల కోసం అద్భుతమైన ఓటీటీ ప్లాన్‌ను తీసుకొచ్చింది. కేవలం రూ.200కే ఏకంగా రూ.1500 విలువైన ప్రయోజనాలను అందిస్తూ సరికొత్త OTT Add-on Packను ప్రవేశపెట్టింది. డిజిటల్ వినోదాన్ని ఇష్టపడే వారికి, విడివిడిగా సబ్‌స్క్రిప్షన్లు తీసుకోలేక ఇబ్బంది పడేవారికి ఇదొక గొప్ప సువర్ణావకాశం అని చెప్పవచ్చు.

ఒకే ప్యాక్‌లో 15 ఓటీటీలు:

ఈ సరికొత్త ప్లాన్ ద్వారా యూజర్లు మొత్తం 15 ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను ఉచితంగా యాక్సెస్ చేయొచ్చు. దీనిలో అందరికీ ఎంతో ఇష్టమైన యూట్యూబ్ ప్రీమియంతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, సోనీ లివ్, జీ5, లయన్స్ గేట్ ప్లే వంటి టాప్ యాప్స్ ఉన్నాయి. సినిమా ప్రేమికులకు, వెబ్ సిరీస్ ఫ్యాన్స్‌కు, స్పోర్ట్స్ ఫాలోవర్లకు అవసరమైన అన్ని రకాల కంటెంట్ ఇందులో లభిస్తుంది.

బోనస్‌గా డేటా, లైవ్ టీవీ:

Advertisement

కేవలం ఓటీటీలే కాకుండా ఈ ప్లాన్‌తో పాటు 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన 30 జీబీ హైస్పీడ్ డేటాను జియో అందిస్తోంది. దీనివల్ల బఫరింగ్ లేకుండా నచ్చిన షోలను హ్యాపీగా చూసేయొచ్చు. వీటితో పాటు జియో డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా 1000కి పైగా లైవ్ టీవీ ఛానళ్లను కూడా వీక్షించవచ్చు. అలాగే వార్తలు, సీరియల్స్, పిల్లల ప్రోగ్రామ్స్ అన్నీ ఒకే చోట అందుబాటులో ఉంటాయి.

Also Read: వాషింగ్ మెషిన్ నుంచి కాలిన వాసన వస్తోందా? వెంటనే ఈ పని చేయకపోతే ఎప్పుడైనా పేలొచ్చు!

ఇలా యాక్టివేట్ చేసుకోండి:

Advertisement

ఇది ఒక యాడ్ ఆన్ ప్లాన్ మాత్రమే. అంటే.. ఈ ఆఫర్ పొందాలంటే మీ మొబైల్‌లో ఏదైనా ఒక రెగ్యులర్ జియో ప్లాన్ యాక్టివ్‌గా ఉండాలి. యూజర్లు తమ మైజియో యాప్ లేదా జియో అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి ఈ రూ.200 ప్యాక్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీ ఫోన్ లేదా టాబ్లెట్‌లో సంబంధిత ఓటీటీ యాప్స్ లాగిన్ అయి వినోదాన్ని ఆస్వాదించవచ్చు.

దూకుడు పెంచిన జియో:

టెలికాం రంగంలో జియో తన హవాను కొనసాగిస్తూనే ఉంది. కేవలం ఏప్రిల్ నెలలోనే దాదాపు 29.4 లక్షల మంది కొత్త వినియోగదారులు జియో నెట్‌వర్క్‌లో చేరారు. ఇప్పుడు తక్కువ ధరలోనే ఇన్ని ఓటీటీ ప్రయోజనాలను తీసుకురావడంతో, మరిన్ని ఎక్కువ మంది కస్టమర్లను ఆకట్టుకోవడంలో జియో సఫలమవుతుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

Also Read: కనీ వినీ ఎరుగని ఆఫర్.. 70 రోజుల పాటు రోజూ 3GB డేటా.. BSNL కొత్త ప్లాన్ చూశారా?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×