E-Paper
Advertisement

యూజర్లను చావుదెబ్బ కొట్టిన జియో.. అత్యంత చౌకైన ప్లాన్ తొలగింపు!

యూజర్లను చావుదెబ్బ కొట్టిన జియో.. అత్యంత చౌకైన ప్లాన్ తొలగింపు!
Advertisement

Jio Plans: టెలికాం రంగంలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రిలయన్స్ జియో తన వినియోగదారులకు గట్టి షాకే ఇచ్చింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు వాలిడిటీ కోరుకునే వారికి ఎంతో ఇష్టమైన అత్యంత ప్రజాదరణ పొందిన రూ. 395 ప్రిపెయిడ్ ప్లాన్‌ను జియో పూర్తిగా నిలిపివేసింది. టారిఫ్ ధరల సవరణలో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

రూ. 395 ప్లాన్ ప్రత్యేకత?

జియో తన ‘వాల్యూ ప్లాన్స్’ (Value Plans) విభాగంలో ఈ రూ. 395 ప్లాన్‌ను అందిస్తూ వచ్చింది. 84 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్ ను రీఛార్జ్ చేసుకుంటే అపరిమిత కాల్స్ యూజర్ కు లభించేంది. దీంతో పాటు మొత్తం వాలిడిటీ కాలానికి 6 జీబీ హై-స్పీడ్ డేటా వచ్చేది. తక్కువ బడ్జెట్ ప్లాన్ కోరుకునేవారికి, సిమ్ యాక్టివ్ కోసం, బ్యాంక్ ఓటీపీలు పొందేందుకు ఈ ప్లాన్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటూ వచ్చింది. అందుకే మిడిల్ క్లాస్ యూజర్లలో ఈ ప్లాన్ బాగా పాపులర్ అయ్యింది.

మరి ఎందుకు తీసేశారు?

Advertisement

టెలికాం కంపెనీలు తమ సగటు వినియోగదారు ఆదాయాన్ని (ARPU – Average Revenue Per User) పెంచుకునే పనిలో పడ్డాయి. రూ. 395 కే 84 రోజుల వాలిడిటీని ఇవ్వడం వల్ల కంపెనీ ఆశించిన ఆదాయం రావడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే లాభాలను పెంచుకునే వ్యూహంలో భాగంగా జియో ఈ ప్లాన్‌ను తన పోర్ట్‌ఫోలియో నుండి తొలగించింది. రూ. 395 ప్లాన్‌తో పాటు, లాంగ్ టర్మ్ వాలిడిటీ కలిగిన రూ.1559 ప్లాన్‌ను కూడా జియో నిలిపివేయడం గమనార్హం.

Also Read: ‘Yes పవన్ కళ్యాణ్.. తెలంగాణ మా అయ్య జాగిరే’.. మంత్రి పొన్నం ఉగ్రరూపం

ఇప్పుడు ప్రత్యామ్నాయం ఏంటి?

Advertisement

రూ. 395 ప్లాన్ స్థానంలో ఇప్పుడు జియో కొత్తగా రూ. 448 ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది కూడా రూ.395 ప్లాన్ బెనిఫిట్స్ నే యూజర్ కు అందిస్తుంది. 84 రోజుల వ్యాలిడిటీతో వచ్చిన ఈ ప్లాన్.. 6 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ ఆఫర్ చేస్తోంది. అలాగే 1000 ఎస్ఎంఎస్ లు ఉచితంగా లభిస్తాయి. మరోవైపు రూ.1559 ప్లాన్‌ స్థానంలో రూ. 1748 ప్లాన్ ను జియో తీసుకొచ్చింది. ఇది 336 రోజుల వ్యాలిడిటీతో యూజర్లకు బెనిఫిట్స్ ను అందించనుంది.

Also Read: పవన్ సంచలన ప్రకటన.. తెలంగాణలో జనసేన పోటీ.. తేల్చుకుందామని సవాల్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×