E-Paper
Advertisement

JBL Grip Portable Speaker: వచ్చేసిందిరోయ్ JBL పోర్టబుల్ స్పీకర్.. AI సౌండ్ బూస్ట్‌తో బాక్స్ బద్దలైపోద్దిక!

JBL Grip Portable Speaker: వచ్చేసిందిరోయ్ JBL పోర్టబుల్ స్పీకర్.. AI సౌండ్ బూస్ట్‌తో బాక్స్ బద్దలైపోద్దిక!
Advertisement

JBL Grip Portable Speaker: మ్యూజిక్ లవర్స్ కోసం ప్రముఖ ఆడియో బ్రాండ్ జేబీఎల్ నుంచి సరికొత్త ‘JBL Grip’ పేరుతో అదిరిపోయే పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్‌ భారత మార్కెట్లో విడుదలైంది. ఇది చూడటానికి చిన్నగా, స్టైలిష్‌గా ఉన్నా.. దీని పర్ఫార్మెన్స్ మాత్రం చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని కంపెనీ చెబుతోంది. ముఖ్యంగా దూరపు ప్రయాణాలు, చిన్న చిన్న పార్టీల కోసం మంచి ఆడియో ఎక్స్‌పీరియన్స్ కోరుకునే వారికి ఈ పోర్టబుల్ స్పీకర్స్ కచ్చితంగా నచ్చుతుంది.

ధర ఎంతంటే?

భారత్‌లో ఈ JBL గ్రిప్ స్పీకర్ ధరను రూ.11,999గా నిర్ణయించారు. ఇది బ్లాక్, వైట్, పర్పుల్, రెడ్, బ్లూ, క్యామో వంటి ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. దీనిని కొనుగోలు చేయాలనుకుంటే JBL అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్లు, ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంటాయి.

Advertisement

Also Read: వన్‌ప్లస్ నుంచి కళ్లు చెదిరే స్మార్ట్‌ఫోన్.. ఐఫోన్ రేంజ్ ఫీచర్లు, ధర కూడా తక్కువ!

ఏఐ సౌండ్ బూస్ట్ ప్రత్యేకత..

ఈ స్పీకర్‌లో బిగ్ హైలైట్ ఏమిటంటే.. ‘ఏఐ సౌండ్ బూస్ట్’ ఫీచర్. ఇది మనం వినే మ్యూజిక్‌ను రియల్ టైమ్‌లో అనలైజ్ చేసి, సౌండ్ క్వాలిటీ తగ్గకుండా చూస్తుంది. ఎక్కువ వాల్యూమ్ పెట్టినప్పుడు కూడా ఆడియో క్లారిటీ మిస్ అవ్వకుండా, డిస్టార్షన్ లేకుండా క్లియర్ సౌండ్ ఇస్తుంది. దీనివల్ల పాటలు వినేటప్పుడు మంచి ఫీల్ కలుగుతుంది. 16W అవుట్‌పుట్‌తో వచ్చే ఈ స్పీకర్ ‘JBL ప్రో సౌండ్’ అనుభూతిని అందిస్తుంది.

12 గంటల బ్యాటరీ బ్యాకప్..

Advertisement

ఈ పోర్టబుల్ స్పీకర్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 12 గంటల పాటు కంటిన్యూగా వాడుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ సేపు మ్యూజిక్ కావాలనుకుంటే ‘ప్లేటైమ్ బూస్ట్’ ఆప్షన్ ద్వారా మరో రెండు గంటల అదనపు బ్యాకప్ పొందొచ్చు. కాకపోతే ఈ స్పీకర్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 3 గంటల సమయం పడుతుంది. ఇక దీని డిజైన్ విషయానికి వస్తే, ఒక సెల్ట్జర్ క్యాన్ తరహాలో చిన్నగా, పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. దీనికి ఉన్న రోప్ లూప్ సాయంతో ఎక్కడికైనా ఈజీగా తగిలించుకుని తీసుకెళ్లవచ్చు.

వర్షంలో తడిచినా ఏం కాదు..  

నీరు, ధూళి నుంచి రక్షణ కోసం దీనికి IP68 రేటింగ్ ఇచ్చారు. దీంతో వర్షంలో తడిసినా, పొరపాటున నీళ్లలో పడినా ఏమీ కాదు. అలాగే ఇది డ్రాప్‌ రెసిస్టెంట్ కూడా. అంటే కింద పడినా అంత త్వరగా పాడవదన్నమాట. ఈ గ్యాడ్జెట్ బ్యాక్ ప్యానల్‌లో ఉన్న అంబియంట్ లైటింగ్ స్పీకర్‌కు మంచి లుక్ ఇస్తుంది. దీనిని JBL పోర్టబుల్ యాప్‌తో కనెక్ట్ చేసుకుని సెట్టింగ్స్ మార్చుకోవచ్చు.

Also Read: భారీ డిస్కౌంట్‌తో షావోమీ 75 ఇంచుల టీవీ లాంచ్.. 4 ఏళ్ల వారంటీ ఉచితం!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×