E-Paper
Advertisement

Lancer 19 Pro Smartwatch: రూ.1,299కే Line Lancer 19 Pro లాంచ్.. ప్రీమియం ఫీచర్లు చూస్తే షాకైపోతారు!

Lancer 19 Pro Smartwatch: రూ.1,299కే Line Lancer 19 Pro లాంచ్.. ప్రీమియం ఫీచర్లు చూస్తే షాకైపోతారు!
Advertisement

Lancer 19 Pro Smartwatch: దేశీయ బ్రాండ్ లైన్ ఒరిజినల్స్ తన కొత్త ఫిట్‌నెస్ ట్రాకర్ Lyne Lancer 19 Pro స్మార్ట్‌వాచ్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఇది 2.01-అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో, బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్‌తో లభిస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ ద్వారా వినియోగదారులు స్మార్ట్‌ఫోన్ లేకుండానే కాల్స్ మాట్లాడుకోవచ్చు. అలాగే, హార్ట్ బీట్ రేట్, SpO2 మానిటరింగ్ వంటి హెల్త్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో లైన్ లాన్సర్ 19 ప్రో వాచ్ ధర, ఫీచర్లు, ఇతర ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం రండి.

ఆఫ్‌లైన్‌లో మాత్రమే:

ఈ Lyne Lancer 19 ప్రో స్మార్ట్‌వాచ్ రూ.1,299 ధరకు లభ్యమవుతోంది. దేశవ్యాప్తంగా ప్రధాన ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. అయితే.. ఇప్పటివరకు ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్స్ అమెజాన్‌లో గానీ ఫ్లిప్‌కార్ట్‌లో గానీ లిస్ట్ అవ్వలేదు. దీని గురించి కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంటుంది.

Advertisement

Also Read: వారెవ్వా ఏముందీ రెడ్‌మీ స్మార్ట్‌వాచ్.. సింగిల్ ఛార్జ్‌తో 18 రోజులపాటు వాడేసుకోవచ్చు!

స్పెసిఫికేషన్లు:

లైన్ లాన్సర్ 19 ప్రో స్మార్ట్‌వాచ్.. 2.01-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. బ్లూటూత్ 5.3 కనెక్టివిటీని కలిగి ఉండి, Android 9, iOS 12, అంతకంటే ఎక్కువ పరికరాలతో సపోర్ట్ ఇస్తుంది. అలాగే ఇన్‌బిల్ట్ మైక్రోఫోన్, స్పీకర్ వినియోగదారులు ఫోన్‌ను తాకకుండానే కాల్స్ చేయడానికి ఈ ఫీచర్లు సహాయపడతాయి. ఈ వాచ్ రోజువారీ ఉపయోగానికి ఈ వాచ్ బెస్ట్ ఆప్షన్.

అదనపు ఫీచర్లు:

Advertisement

దీనిలోని హెల్త్ ఫీచర్లలో హార్ట్ బీట్ రేట్, SpO2 ట్రాకింగ్ సెన్సార్లు ఉన్నాయి. కాల్ రికార్డింగ్, నోటిఫికేషన్ అలెర్ట్స్, ఫోన్ కెమెరా నియంత్రణ వంటి అదనపు ఫీచర్లూ అందుబాటులో ఉన్నాయి. వాటర్, స్వెట్‌, ధుమ్మును నిరోధించడానికి ఈ స్మార్ట్‌వాచ్ IPX4 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది మాగ్నెటిక్ స్ట్రాప్ డిజైన్‌ను కలిగి ఉండటంతో ధరించడానికి ఎంతో సౌకర్యంగానూ ఉంటుంది.

12 రోజుల బ్యాటరీ బ్యాకప్:

ఈ స్మార్ట్‌వాచ్ 210mAh బ్యాటరీతో లభిస్తుంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. బ్లూటూత్ కాలింగ్ ఉపయోగించినప్పటికి 3 నుంచి 4 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది. అలాగే స్టాండ్‌బై మోడ్‌లో ఒకే ఛార్జ్‌లో 12 రోజుల వరకు ఈ స్మార్ట్‌వాచ్‌ను ఉపయోగించవచ్చని తెలిపింది.

Also Read: బట్జెట్ ధరలో స్మార్ట్‌వాచ్ కావాలా.. 16 రోజుల బ్యాటరీ బ్యాకప్, స్టన్నింగ్ ఫీచర్లతో కొత్తవాచ్ లాంచ్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×