E-Paper
Advertisement

టీవీ, ఏసీలను కంట్రోల్ చేసే ఫీచర్‌తో Itel జెనో సిరీస్ ఫోన్లు.. రఫ్ అండ్ టఫ్‌గా వాడేయొచ్చు మావా!

టీవీ, ఏసీలను కంట్రోల్ చేసే ఫీచర్‌తో Itel జెనో సిరీస్ ఫోన్లు.. రఫ్ అండ్ టఫ్‌గా వాడేయొచ్చు మావా!
Advertisement

Itel Rugged Smartphones: బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లను అందించే ప్రముఖ మొబైల్ బ్రాండ్ ఐటెల్ (Itel).. భారత మార్కెట్లో తమ పట్టును మరింత పెంచుకునేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా Zeno సిరీస్‌లో రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్లను భారత్‌లో విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. Itel Zeno 100 Pro, Itel Zeno 100 Lite పేర్లతో ఇవి మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి. దీనికి సంబంధించిన టీజర్ పేజీలు అమెజాన్‌లో లైవ్ అయ్యాయి.

జూలై 16న మార్కెట్లోకి Zeno 100 Pro:

ఈ సిరీస్‌లో హై-ఎండ్ మోడల్‌గా వస్తున్న Itel Zeno 100 Pro స్మార్ట్‌ఫోన్‌ను జూలై 16న భారతదేశంలో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. నిత్యం రఫ్ అండ్ టఫ్ యూసేజ్ కోసం ఫోన్ వెతికే వారికి ఇది ఒక మంచి ఆప్షన్‌గా నిలవనుంది. ఫోన్ పడిపోయినా, ఎండ తీవ్రతకు గురైనా తట్టుకునేలా దీని బాడీని అత్యంత పటిష్టంగా డిజైన్ చేశారు. దీని కోసం ప్రత్యేకంగా మిలిటరీ గ్రేడ్ (MIL-STD 810H) సర్టిఫికేషన్‌ను కూడా ఈ ఫోన్ సొంతం చేసుకుంది.

Advertisement

Also Read: 99% మంది ఐఫోన్ యూజర్లకు తెలియని 5 క్రేజీ ట్రిక్స్.. మీరూ ఓసారి ట్రై చేసేయండి బాస్!

ఆకట్టుకునే సరికొత్త ఫీచర్లు:

ఈ ప్రో మోడల్‌లో ‘పాయింట్ అండ్ టాప్ కంట్రోల్ కనెక్టివిటీ’ అనే సరికొత్త ఫీచర్‌ను అందిస్తున్నారు. అంటే.. దీనిలో ఇన్‌బిల్ట్‌గా ఐఆర్ బ్లాస్టర్ (IR Blaster) ఉండే అవకాశం ఉంది. దీని ద్వారా ఇంట్లోని టీవీ, ఏసీ వంటి హోమ్ అప్లయెన్సెస్‌ను ఫోన్ నుంచే సులభంగా ఆపరేట్ చేయవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ డ్యూయల్ రేర్ కెమెరా సెటప్‌ను ఇస్తున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. అయితే కెమెరా మెగాపిక్సెల్ వివరాలను కంపెనీ ఇంకా సీక్రెట్‌గానే ఉంచింది.

త్వరలోనే Zeno 100 Lite ఎంట్రీ:

Advertisement

ఇక ఇదే సిరీస్‌లో వస్తున్న Itel Zeno 100 Lite మోడల్ ఫీచర్లను కూడా కంపెనీ రివీల్ చేసింది. దీనిలో 90Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.6 ఇంచుల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను ఇస్తున్నారు. అదిరిపోయే సౌండ్ క్వాలిటీ కోసం డీటీఎస్ (DTS) స్పీకర్లు, ఎక్కువ సమయం బ్యాకప్ ఇచ్చేందుకు 5000mAh బ్యాటరీని అమర్చారు. ప్రో మోడల్ లాగే ఇది కూడా మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్‌తో వస్తోంది. ఈ లైట్ వేరియంట్ లాంచ్ డేట్‌ను ఇంకా అనౌన్స్ చేయనప్పటికీ, ప్రో మోడల్‌తో పాటే జూలై 16న విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. దీని ధర, ప్రాసెసర్ వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Also Read: ల్యాండ్‌స్కేప్ కెమెరాతో శాంసంగ్ కొత్త టాబ్లెట్.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×