E-Paper
Advertisement

ఐటెల్ జెనో సిరీస్ లాంచ్.. ల్యాప్‌టాప్, ఫోన్, ఇయర్‌బడ్స్.. అన్నింటికీ ఒకే పవర్ బ్యాంక్!

ఐటెల్ జెనో సిరీస్ లాంచ్.. ల్యాప్‌టాప్, ఫోన్, ఇయర్‌బడ్స్.. అన్నింటికీ ఒకే పవర్ బ్యాంక్!
Advertisement

itel Zeno Power Bank: ప్రముఖ స్మార్ట్‌ఫోన్, యాక్సెసరీస్ బ్రాండ్ ఐటెల్ (itel) భారత మార్కెట్లోకి సరికొత్త ‘జెనో పవర్‌ బ్యాంక్’ (Zeno Power Bank) సిరీస్‌ను ఇవాళ (జూలై 17) విడుదల చేసింది. తక్కువ ధరలో ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లను వేగంగా ఛార్జ్ చేసుకునే అత్యాధునిక పోర్టబుల్ ఛార్జింగ్ సొల్యూషన్స్‌ను ఈ సిరీస్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. ఈ లైనప్‌లో 10,000mAhm, 20,000mAh సామర్థ్యం గల రెండు మోడళ్లను కంపెనీ ప్రవేశపెట్టింది. వీటి ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం.

45W ఫాస్ట్ ఛార్జింగ్‌

ఈ జెనో సిరీస్ పవర్‌ బ్యాంకులను యూజర్ల అవసరాలకు తగ్గట్టుగా ఐటెల్ రూపొందించింది. ఈ రెండు మోడళ్లు కూడా శక్తివంతమైన 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. వీటి ద్వారా మొబైల్స్ తో పాటు టైప్-సి పోర్ట్ ఉన్న ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, ఇయర్‌బడ్స్‌ను కూడా సులువుగా ఛార్జ్ చేసుకోవచ్చు. మరోవైపు ప్రయాణాల్లో ప్రత్యేకంగా కేబుల్స్ తీసుకెళ్లే పనిలేకుండా దీనిలోనే ఇన్‌బిల్ట్ టైప్-సి బ్రెయిడెడ్ కేబుల్‌ను అందించారు. మరోవైపు పవర్‌ బ్యాంక్‌లో ఎంత బ్యాటరీ మిగిలి ఉందో ఖచ్చితంగా తెలుసుకోవడానికి వీలుగా రియల్ టైమ్ ‘స్మార్ట్ ఎల్‌ఈడీ డిస్‌ప్లే’ను కూడా అమర్చారు.

స్ట్రాంగ్ డిజైన్.. పూర్తి ప్రొటెక్షన్

Advertisement

జెనో పవర్ బ్యాంకుల భద్రత విషయంలో ఐటెల్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. వీటి బాడీని ఫైర్-రెసిస్టెంట్ ABS+PC షెల్‌తో తయారు చేసింది. అలాగే ఛార్జ్ సమయంలో కనెక్ట్ చేసిన డివైజ్‌లు వేడెక్కకుండా, షార్ట్ సర్క్యూట్ కాకుండా అధునాతన మల్టీ-ప్రొటెక్షన్ ఫీచర్లను వీటికి జోడించారు. మరోవైపు తక్కువ బరువు, చిన్న సైజులో ఉండటం వల్ల ఆఫీసు, టూర్లకు ఎంతో తేలిగ్గా వీటిని తీసుకెళ్లవచ్చు.

Also Read: మ్యూజిక్ లవర్స్‌కు పండగే.. డాల్బీ అట్మాస్‌తో శాంసంగ్ కొత్త స్పీకర్లు.. ధర ఎంతంటే?

ధర ఎంతంటే?

Advertisement

ధరల విషయానికి వస్తే.. ఐటెల్ ఎప్పటిలాగే బడ్జెట్ శ్రేణిలోనే వీటిని తీసుకొచ్చింది. 10,000mAh వేరియంట్ ధర: రూ. 2,000 లోపు, 20,000mAh వేరియంట్ ధర రూ. 3,000 లోపు ఉండనుంది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వేదికగా శుక్రవారమే ఫోన్ ను లాంచ్ చేసినప్పటికీ.. అధికారిక సేల్స్ మాత్రం జులై 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ ధరలో ల్యాప్‌టాప్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న పవర్‌ బ్యాంక్ కోసం చూసేవారికి ఇది ఒక మంచి ఆప్షన్ కానుంది.

Also Read: నీరు లేని టాయిలెట్.. కరెంట్ లేని హీటర్.. సోనమ్ వాంగ్‌చుక్ ఇంట్లో ఎన్ని వింతలో!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×