E-Paper
Advertisement

జస్ట్ రూ.1,799కే Itel Aqua వాటర్ ప్రూఫ్ ఫోన్.. అరగంట పాటు నీటిలో ఉన్నా ఏం కాదు!

జస్ట్ రూ.1,799కే Itel Aqua వాటర్ ప్రూఫ్ ఫోన్.. అరగంట పాటు నీటిలో ఉన్నా ఏం కాదు!
Advertisement

Itel Aqua: ఫీచర్ ఫోన్ వాడేవారికి ఐటెల్ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. భారతీయ మార్కెట్లోకి ‘ఇన్నో సిరీస్’ పేరుతో సరికొత్త ఫోన్లను లాంచ్ చేసింది. ఇందులో భాగంగా తీసుకొచ్చిన itel Aqua మొబైల్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మన దేశంలో IP67 రేటింగ్‌తో వచ్చిన ఏకైక ఫీచర్ ఫోన్ ఇదే కావడం విశేషం. సాధారణంగా ఇలాంటి ఫీచర్లు ఖరీదైన స్మార్ట్‌ఫోన్లలో మాత్రమే కనిపిస్తాయి. అయితే సామాన్యులకు కూడా ఈ రక్షణను అందించాలనే ఉద్దేశంతో ఐటెల్ ఈ ఫోన్‌ను రూపకల్పన చేసింది.

నీటిలో పడినా నో ప్రాబ్లం:

చాలామంది ఫీచర్ ఫోన్ వినియోగదారులు తమ ఫోన్లు నీళ్లలో పడి పాడైపోతున్నాయని బాధపడుతుంటారు. కంపెనీ జరిపిన ఓ సర్వేలో కూడా దాదాపు 42 శాతం ఫోన్లు నీటి వల్లే పాడవుతున్నట్లు తేలింది. ఈ సమస్యకు పరిష్కారంగానే ఐటెల్ ఆక్వాను ఐపీ67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్‌తో తెచ్చారు. దీనివల్ల ఫోన్ పొరపాటున నీళ్లలో పడినా, బురదలో లేదా వర్షంలో తడిసినా ఎలాంటి నష్టం జరగదు. అరగంట పాటు నీటిలో ఉన్నా కూడా ఈ ఫోన్ సురక్షితంగా పనిచేస్తుంది.

సరికొత్త వాయిస్ టెక్నాలజీ:

Advertisement

ఈ ఫోన్ కేవలం గట్టిదనం మాత్రమే కాదు.. అద్భుతమైన కాలింగ్ అనుభవాన్ని కూడా ఇస్తుంది. దీనిలో ఏఐ ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (AI ENC) టెక్నాలజీని వాడారు. దీంతో మనం మార్కెట్లు, ఫ్యాక్టరీలు, లేదా ట్రాఫిక్ లాంటి రద్దీ ప్రదేశాలలో ఉన్నప్పుడు చుట్టుపక్కల వచ్చే శబ్దాలను ఇది తగ్గిస్తుంది. అవతలి వారికి మన మాటలు చాలా స్పష్టంగా వినిపించేలా చేస్తుంది.

Also Read: ఓటీటీ ప్రియులు ఎగిరి గంతేసే ఆఫర్.. రూ.99లకే సోనీ లివ్, ఆహాతో పాటు 20 ఓటీటీలు ఫ్రీ!

అద్భుతమైన ఫీచర్లు:

Advertisement

ఇక మిగతా ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 2.4 ఇంచుల డిస్‌ప్లే ఉంటుంది. రోజంతా ఛార్జింగ్ టెన్షన్ లేకుండా ఉండటానికి 1200mAh బ్యాటరీని అమర్చారు. అలాగే ఇప్పుడు వస్తున్న ఆధునిక ఫోన్ల తరహాలోనే దీనికి కూడా Type-C ఛార్జింగ్ పోర్ట్ అందించడం విశేషం. దీంతో పాటు వైర్‌లెస్ ఎఫ్‌ఎమ్ రేడియో, ఆటో కాల్ రికార్డింగ్, బ్లూటూత్, వీజీఏ కెమెరాతో పాటు మెమరీని 32GB వరకు పెంచుకునే సదుపాయం ఉంది.

ధర వివరాలు ఇలా:

భారతీయుల కోసం ఇందులో ప్రత్యేకంగా ‘కింగ్ వాయిస్’ అనే ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. ఇది ఫోన్ మెనూ, మెసేజ్‌లు, కాల్ వివరాలను హిందీ, ఇంగ్లీష్ భాషల్లో చదివి వినిపిస్తుంది. అలాగే మరో 10 ప్రాంతీయ భాషలను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. దాదాపు 1,000 కాంటాక్టులను ఈ ఫోన్‌లో దాచుకోవచ్చు. బ్లూ, రెడ్, బ్లాక్ రంగుల్లో లభిస్తున్న ఈ ఫోన్ ధర కేవలం రూ.1,799 మాత్రమే. బడ్జెట్ ధరలో గట్టి ఫోన్ కావాలనుకునే వారికి ఇదొక మంచి ఆప్షన్.

Also Read: CCTV కంటే డేంజర్‌గా మారనున్న Wi-Fi.. ఇంట్లో మనుషుల కదలికలను కూడా పసిగట్టొచ్చంటున్న నిపుణులు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×