E-Paper
Advertisement

Iran Warned Tech Firms: గల్ఫ్‌లో 18 టెక్ కంపెనీలకు ఇరాన్ వార్నింగ్, అలర్టయిన అమెరికా

Iran Warned Tech Firms: గల్ఫ్‌లో 18 టెక్ కంపెనీలకు ఇరాన్ వార్నింగ్,  అలర్టయిన అమెరికా
Advertisement

Iran Warned Tech Firms: ఇరాన్‌లో యుద్ధం తీవ్రరూపు దాల్చుకుంటోంది. నెలరోజులపాటు జరిగిన ఈ పోరులో ఇరాన్ కీలక నేతలను పొగొట్టుకుంది. అలాగని అమెరికా-ఇజ్రాయెల్ పైచేయి సాధించిన సందర్భాలు లేవు. యుద్ధం రెండో నెలలోకి ఇంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ఇరాన్ టెక్ కంపెనీలను టార్గెట్ చేసింది. ఇప్పటికే చాలా కంపెనీలు గల్ఫ్ నుంచి మూటా ముళ్లు సర్దుకుని పోయినట్టు సమాచారం.  దీంతో అగ్రరాజ్యం అమెరికా పౌరులకు కీలక సూచనలు చేసింది.

ఇరాన్ యుద్ధం మరో అంకానికి చేరింది

Advertisement

ఇరాన్ యుద్ధం తీవ్రమైంది. ఈసారి వార్ అంతా టెక్నాలజీ కేంద్రంగా సాగుతోంది. యుద్ధం విషయంలో టెక్ కంపెనీలు అమెరికాకు సహాయం చేస్తున్నట్లు ఇరాన్ భావించింది. ఈ నేపథ్యంలో 18 టెక్ కంపెనీలకు వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. గడిచిన వారం రోజులుగా గల్ఫ్‌లో అమెరికా స్థావరాలపై గురిపెట్టిన ఇరాన్, టెక్‌ కంపెనీలను లక్ష్యంగా చేసుకుంది.

ఏప్రిల్‌ ఒకటి నుంచి టెక్ కంపెనీలపై దాడులు చేసే అవకాశం ఉందని ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కోర్ప్స్ హెచ్చరించింది. ఐఆర్‌జీసీ ప్రకటించిన కంపెనీల్లో మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, టెస్లా, ఐబీఎం, బోయింగ్, హెచ్‌పి, ఇంటెల్, సిస్కో, ఎన్విడియా, ఒరాకిల్, జెపీ మోర్గాన్ వంటి దాదాపు 18 టెక్ సంస్థలు ఉన్నట్లు సమాచారం.

Advertisement

18 టెక్ కంపెనీలకు ఇరాన్ వార్నింగ్, అమెరికా అలర్ట్

టెహ్రాన్ కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 8 గంటల నుండి టెక్ కంపెనీల యూనిట్లను ధ్వంసం చేస్తామని చెప్పకనే చెప్పింది. టెక్ కంపెనీలకు చెందిన యూనిట్లు ధ్వంసం కాకుండా ఉండేందుకు దౌత్య ప్రయత్నాలు చేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు చెబుతున్న వేళ ఇరాన్‌ నుంచి ఈ ప్రకటన రావడంతో అందరూ షాకయ్యారు.

ఆ కంపెనీల పని చేసే ఉద్యోగులు తక్షణమే వెళ్లిపోవాలని సూచన చేసింది ఐఆర్‌జీసీ. ఆయా కంపెనీలకు పరిధిలో ఉండే స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని పేర్కొంది. దాడుల లక్ష్యాలను గుర్తించడంలో అమెరికా టెక్ కంపెనీలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని ఇరాన్ చెబుతున్నమాట. ఇకపై ఆయా సంస్థలు తమ లక్ష్యాలని స్పష్టం చేసింది.

ALSO READ: ఈ ఒక్క ట్రిక్ తెలిస్తే.. ఇంట్లో ఉన్న పాత గిన్నెలన్నీ ఇండక్షన్ స్టవ్‌పై వాడేసుకోచ్చు!

ఇప్పటికే అమెజాన్ డేటా కంపెనీ డ్యామేజ్ కావడంతో చాలామంది ఉద్యోగులు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆ కంపెనీ తాత్కాలికంగా మూసి వేసినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అమెజాన్ బాటలో మరి కొన్ని టెక్ కంపెనీలు ఉన్నాయని తెలుస్తోంది. టెక్ కంపెనీలకు ఇరాన్ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో తమ దేశ పౌరులకు అమెరికా కొత్తగా హెచ్చరిక జారీ చేసింది.

గల్ప్‌లోని వివిధ ప్రాంతాల్లో అమెరికన్లకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో తమ దేశ పౌరులందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశ విదేశాంగ శాఖ హెచ్చరించింది. అమెరికా పౌరులు ఉండే ప్రదేశాలపై తాము పర్యవేక్షిస్తున్నామని సౌదీ అరేబియాలోని అమెరికా ఎంబసీ తెలిపింది.హోటళ్లు, అమెరికా వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు ఇతర సమావేశ స్థలాలు లక్ష్యాలుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అమెరికన్లు ఇంటి లోపల ఉండాలని, అలాగే కిటికీలకు దూరంగా ఉండాలని రాయబార కార్యాలయం కోరింది.

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×