E-Paper
Advertisement

ఆండ్రాయిడ్ 16, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్.. ఐకూ నుంచి అదిరిపోయే బడ్జెట్ 5G ఫోన్ వచ్చేసింది!

ఆండ్రాయిడ్ 16, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్.. ఐకూ నుంచి అదిరిపోయే బడ్జెట్ 5G ఫోన్ వచ్చేసింది!
Advertisement

iQOO Z11i: ఐకూ కంపెనీ చైనా మార్కెట్లో సరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. iQOO Z11i పేరుతో వచ్చిన ఈ మొబైల్.. తక్కువ ధరలో ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఆశించే వారిని టార్గెట్ చేస్తూ రూపుదిద్దుకుంది. ఆకర్షణీయమైన డిజైన్, నమ్మకమైన ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఆకట్టుకునే డిజైన్:

ఈ సరికొత్త ఐకూ ఫోన్ 6.74 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. దీని స్మూత్ 120Hz రీఫ్రెష్ రేట్ వల్ల ఫోన్ వాడుతున్నప్పుడు చాలా వేగంగా స్పందిస్తుంది. ఫోన్ వెనుక భాగంలో స్క్వేర్ షేప్ కెమెరా మాడ్యూల్ ఇచ్చారు. అలాగే ఫోన్ కిందపడినా తట్టుకునేలా ఎస్‌జీఎస్ 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్, ధూళి, నీటి చుక్కల నుంచి రక్షణ కోసం IP65 రేటింగ్‌తో ఇది వస్తోంది. దీనిలో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది.

స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్:

Advertisement

పనితీరు విషయానికి వస్తే.. దీనిలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది రోజువారీ పనులను చాలా సులువుగా రన్ చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 సాఫ్ట్‌వేర్‌పై పనిచేస్తుంది. అలాగే ఇందులో 8GB వరకు ర్యామ్, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

Also Read: ఇలాంటి గాడ్జెట్స్ కోసమే కదా టెక్ ప్రియులు ఎదురుచూసేది.. ఫీచర్లు చూస్తే వెంటనే కొనాలనిపిస్తుంది!

కెమెరా విశేషాలు:

Advertisement

ఇక ఫొటోగ్రఫీ కోసం ఈ ఫోన్ వెనుక వైపు 13MP సింగిల్ కెమెరాను, ఎల్‌ఈడీ ఫ్లాష్‌ను అమర్చారు. ఇది 10x డిజిటల్ జూమ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇక సెల్ఫీల కోసం స్క్రీన్ పైభాగంలో వాటర్‌డ్రాప్ నాచ్ స్టైల్‌లో 5MP ఫ్రంట్ కెమెరాను అందించారు. దీని ద్వారా 1080p క్వాలిటీతో వీడియోలు రికార్డ్ చేసుకోవచ్చు.

భారీ బ్యాటరీ, ధర వివరాలు:

ఈ స్మార్ట్‌ఫోన్‌కు ప్రధాన ఆకర్షణ దీనిలోని 6,500mAh బ్యాటరీ. ఇది సింగిల్ ఛార్జ్‌తో దాదాపు 25 రోజుల కంటే ఎక్కువ స్టాండ్‌బై టైమ్‌ను ఇస్తుందని కంపెనీ చెబుతోంది. దీనికి 15W టైప్-సి ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. చైనాలో ఈ ఫోన్ బేస్ వేరియంట్ (6GB+128GB) ధర దాదాపు రూ.18,000గా ఉంది. ఇది డెజర్ట్ గోల్డ్, మో యింగ్, కింగ్‌ఫెంగ్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తోంది.

Also Read: 14 రోజుల బ్యాటరీ లైఫ్, 2000 నిట్స్ బ్రైట్‌నెస్.. భారత్‌లోకి వచ్చేసిన Huawei Band 11 సిరీస్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×