E-Paper
Advertisement

బడ్జెట్ ధరలో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. iQOO Neo 11S స్పెసిఫికేషన్స్ చూశారా?

బడ్జెట్ ధరలో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. iQOO Neo 11S స్పెసిఫికేషన్స్ చూశారా?
Advertisement

iQOO Neo 11S: టెక్ ప్రియుల కోసం ఐకూ (iQOO) సంస్థ తమ నియో సిరీస్ నుంచి మరో పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. చైనాకు చెందిన ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ లీక్ చేసిన వివరాల ప్రకారం.. ఈ కొత్త ఫోన్ iQOO Neo 11S పేరుతో త్వరలోనే విడుదల కానుంది. చైనాలో జులై లేదా ఆగస్టు నెలల్లో జరిగే సమ్మర్ షాపింగ్ సీజన్‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా గేమర్స్, ఎక్కువ సమయం ఫోన్ వాడే వారిని టార్గెట్ చేస్తూ ఈ ఫోన్‌ను డిజైన్ చేస్తున్నారు.

ఈ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ పరంగా యూజర్లకు అద్భుతమైన అనుభూతిని ఇవ్వనుంది. దీనిలో 2K రెజల్యూషన్‌తో కూడిన ఫ్లాట్ డిస్‌ప్లేను అందించనున్నారు. దీనికి తోడు 144Hz రీఫ్రెష్ రేట్ ఉండటంతో గేమింగ్ ఆడేటప్పుడు, వీడియోలు చూసేటప్పుడు స్క్రీన్ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. భద్రత కోసం ఇందులో అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో పాటు, దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం ఐపీ68 లేదా ఐపీ69 రేటింగ్‌ను కూడా ఇస్తున్నారు.

Advertisement

Also Read: ఇంతకంటే తక్కువకు రాదు.. Google Pixel 10పై రూ.29,000 వరకు లాభం పొందే సూపర్ ఛాన్స్!

ఐకూ నియో 11S ఫోన్ మీడియాటెక్ కంపెనీకి చెందిన నెక్స్ట్ జనరేషన్ డైమెన్సిటీ 9500 అండర్‌క్లాక్డ్ వర్షన్‌తో పనిచేయనుంది. దీనిని డైమెన్సిటీ 9500s అని పిలవవచ్చు. క్లాక్ స్పీడ్ కొద్దిగా తక్కువగా ఉన్నప్పటికీ, ఇది ఫ్లాగ్‌షిప్ స్థాయి పర్‌ఫార్మెన్స్‌ను అందిస్తుంది. గత ఏడాది నవంబర్‌లో వచ్చిన ఐకూ నియో 11 ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. దానికంటే ఈ కొత్త మోడల్ స్పీడ్ కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ.. రోజువారీ పనులకు, భారీ గేమింగ్‌కు ఎలాంటి డోకా ఉండదు.

Advertisement

ఈ ఫోన్‌లో అందరినీ ఆశ్చర్యపరిచేలా 8000mAh కంటే ఎక్కువ సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాప్ ఫోన్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. గత మోడల్ ఐకూ నియో 11 లో 7,500mAh బ్యాటరీ ఉండగా, ఇప్పుడు దానికి మించిన బ్యాటరీ బ్యాకప్‌తో ఈ సరికొత్త 11S మోడల్ రాబోతోంది.

ఐకూ నియో 11 కంటే ఈ కొత్త ఐకూ నియో 11S తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది. కెమెరాల పరంగా పెద్దగా మార్పులు లేకపోయినా.. అదిరిపోయే డిస్‌ప్లే, అద్భుతమైన గేమింగ్ పవర్‌తో పాటు కొండంత బ్యాటరీ లైఫ్ కావాలనుకునే వారికి ఈ ఫోన్ ఒక బెస్ట్ ఛాయిస్ కానుంది. కంపెనీ అధికారికంగా దీని ధరను ప్రకటిస్తే ఈ ఫోన్ వాల్యూ ఏంటో పూర్తిగా తెలిసిపోతుంది.

Also Read: మార్కెట్లోకి కొత్త సూపర్ కార్ ఎడిషన్ ఫోన్.. ఈ లుక్ చూస్తే ఐఫోన్ కూడా దిగదుడుపే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×