E-Paper
Advertisement

iQOO Neo 11: డైమెన్సిటీ 9500 చిప్‌సెట్‌తో ఐకూ నియో 11.. ఫీచర్లు చూస్తే మతి పోతుంది భయ్యా!

iQOO Neo 11: డైమెన్సిటీ 9500 చిప్‌సెట్‌తో ఐకూ నియో 11.. ఫీచర్లు చూస్తే మతి పోతుంది భయ్యా!
Advertisement

iQOO Neo 11: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఐకూ నుంచి మరో పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతోంది. గతేడాది చైనాలో ‘ఐకూ నియో 10’ సిరీస్ మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. అదే ఊపును కొనసాగిస్తూ.. ఇప్పటికే స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో కూడిన Neo 11 మోడల్‌ను కంపెనీ పరిచయం చేసింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ సిరీస్‌లో మరో సరికొత్త వేరియంట్‌ను లాంచ్ చేసేందుకు iQOO కసరత్తు చేస్తోంది. ప్రముఖ టిప్‌స్టర్ల సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ ఈ ఏడాది రెండో త్రైమాసికంలో వినియోగదారుల ముందుకు రానుంది.

ఈ ఫోన్ ప్రత్యేకత ఏమిటంటే:

ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌కు బదులుగా మీడియాటెక్ డైమెన్సిటీ 9500 సిరీస్ చిప్‌సెట్‌ను వాడబోతున్నారు. ఇది డైమెన్సిటీ 9500 లేదా దానికంటే కొంచెం మార్పులు చేసిన S వెర్షన్ అయ్యే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్ విడిభాగాల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, పర్ఫార్మెన్స్‌లో రాజీ పడకుండా ధరను అందుబాటులో ఉంచడానికే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. దీనికి iQOO Neo 11 Pro అని పేరు పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Advertisement

Also Read: ఈ ఫోన్ ఉంటే ఇక ల్యాప్‌టాప్ అక్కర్లేదు.. 16GB RAM, 1TB స్టోరేజ్‌తో రెడ్‌మీ విశ్వరూపం!

ఫీచర్ల విషయానికి వస్తే:

ఈ ఫోన్ గేమింగ్ ప్రియులను, హెవీ యూజర్లను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడింది. దీనిలో 6.82 అంగుళాల భారీ అమోలెడ్ డిస్‌ప్లే ఉండబోతోందని సమాచారం. అలాగే 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో వీడియోలు, గేమింగ్ అనుభవం అత్యంత స్మూత్‌గా ఉండనుంది. ఇక కెమెరా విభాగంలో 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్‌తో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాను ఆశించవచ్చు. ఇక సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అమర్చనున్నారు.

భారీ బ్యాటరీ సామర్థ్యం:

Advertisement

ఈ iQOO Neo 11 Pro ఫోన్ ఏకంగా 7,500mAh భారీ బ్యాటరీతో పాటు 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రానుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల వరకు ఎలాంటి టెన్షన్ లేకుండా ఫోన్ వాడుకోవచ్చు. అలాగే 16GB వరకు RAM, 1TB స్టోరేజ్ వంటి ఆప్షన్లతో పాటు ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 6పై ఇది పనిచేస్తుంది.

విడుదల తేదీపై సందిగ్ధత:

అయితే భారతీయ వినియోగదారులకు మాత్రం ఒక చిన్న నిరాశ కలిగించే వార్త ఏమిటంటే.. ప్రస్తుతానికి iQOO ఈ నియో సిరీస్‌ను భారత్‌లో లాంచ్ చేసే ఆలోచనలో లేదని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇది చైనా మార్కెట్‌కే పరిమితం కానుంది. ఒకవేళ భవిష్యత్తులో కంపెనీ తన వ్యూహాన్ని మార్చుకుంటే తప్ప, ఈ పవర్‌ఫుల్ డివైజ్ మన దేశంలోకి వచ్చే సూచనలు తక్కువగానే ఉన్నాయి.

Also Read: 9,000mAh బ్యాటరీతో ‘వన్‌ప్లస్ నోర్డ్ 6’ లాంచ్ డేట్ ఫిక్స్.. ధర కూడా తక్కువే!

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×