E-Paper
Advertisement

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!
Advertisement

iQoo Mini Tablet: స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కి పరిచయం అక్కర్లేని బ్రాండ్ ఐకూ (iQoo). ప్రీమియం ఫీచర్లు, అదిరిపోయే పెర్ఫార్మెన్స్‌తో మార్కెట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ కంపెనీ.. ఇప్పుడు ఒక సరికొత్త డివైజ్‌తో మనముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు పెద్ద స్క్రీన్లతో టాబ్లెట్లను తీసుకొచ్చిన ఐకూ.. ఈసారి మొదటిసారిగా ఒక మిని సైజ్ టాబ్లెట్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

సర్టిఫికేషన్ సైట్‌లో వివరాలు లీక్:

తాజాగా చైనాకు చెందిన SRRC సర్టిఫికేషన్ డేటాబేస్‌లో iPA2691 మోడల్ నెంబర్‌తో ఒక కొత్త ఐకూ డివైజ్ కనిపించింది. ప్రముఖ టెక్ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ కథనం ప్రకారం.. ఇది ఐకూ రాబోయే కొత్త టాబ్లెట్. దీనిలో కేవలం వైఫై (2.4GHz, 5GHz), బ్లూటూత్ సపోర్ట్ మాత్రమే ఉన్నట్లు ఈ లీక్స్ ద్వారా స్పష్టమవుతోంది. అంటే.. ఇందులో సెల్యులార్ నెట్‌వర్క్ ఫీచర్ ఉండకపోవచ్చు. ఇది పూర్తిగా వైఫై వెర్షన్‌గానే మార్కెట్‌లోకి రానుంది.

Advertisement

Also Read: ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

నెక్ట్స్ లెవెల్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్:

ఈ చిన్న టాబ్లెట్‌ నెక్ట్స్ జనరేషన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 సిరీస్ చిప్‌సెట్‌‌తో రానున్నట్లు సమాచారం. ఇది 2nm ప్రాసెస్ ఆధారంగా రూపొందుతుంది. గతంలో వచ్చిన ఐకూ ప్యాడ్ 6 ప్రోతో పోలిస్తే.. ఈ చిన్న టాబ్లెట్ పెర్ఫార్మెన్స్, పవర్ ఎఫిషియెన్సీ పరంగా చాలా మెరుగ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. గేమింగ్, మల్టీటాస్కింగ్ ప్రియులకు ఇది సూపర్ ఆప్షన్ కానుంది.

ఐకూ 16తో పాటే లాంచ్:

Advertisement

ఈ కాంపాక్ట్ టాబ్లెట్‌ను ఐకూ తమ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ‘ఐకూ 16’తో కలిపి మార్కెట్లోకి తీసుకొచ్చే ప్లాన్‌లో ఉంది. 2026 చివరి త్రైమాసికంలో ఇవి విడుదలయ్యే అవకాశం ఉంది. ఐకూ 16 ఫోన్ కూడా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రో ప్రాసెసర్, 50MP ప్రైమరీ కెమెరా, భారీ 8,500mAh బ్యాటరీ వంటి హై-ఎండ్ ఫీచర్లతో రాబోతున్నట్లు సమాచారం.

Also Read: ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×