E-Paper
Advertisement

ఈ కొత్త ఫోన్ కొంటే.. రూ.6,000 డిస్కౌంట్‌తో పాటు రూ.2,000 విలువైన ఇయర్‌బడ్స్ ఫ్రీ!

ఈ కొత్త ఫోన్ కొంటే.. రూ.6,000 డిస్కౌంట్‌తో పాటు రూ.2,000 విలువైన ఇయర్‌బడ్స్ ఫ్రీ!
Advertisement

iQOO 15 Apex Edition: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ఐక్యూ కంపెనీ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. తమ పాపులర్ ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో భాగంగా ‘ఐక్యూ 15 అపెక్స్ ఎడిషన్’ను ఇండియన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఆల్ఫా, లెజెండ్ ఎడిషన్ల కంటే ఇది చాలా కొత్తగా, ఇంకా చెప్పాలంటే ఎంతో క్లాసీ లుక్‌తో కనిపిస్తోంది. ఫోన్ వెనుక భాగంలో వాడిన డైనమిక్ ఇంక్ వాష్ పెయింటింగ్ డిజైన్ చూస్తుంటే.. టెక్నాలజీకి కాస్త ఆర్టిస్టిక్ టచ్ ఇచ్చినట్లుగా అనిపిస్తుంది. ప్రీమియం ఫోన్ వాడాలనుకునే వారికి ఈ కొత్త డిజైన్ కచ్చితంగా నచ్చుతుంది.

ధర ఎంత? ఆఫర్లు ఏమున్నాయ్?

ఈ ఫోన్ రేటు విషయానికి వస్తే.. మన దగ్గర రెండు ఆప్షన్లలో దొరుకుతుంది. 12GB RAM వేరియంట్ ధర రూ.72,999 కాగా, మరీ ఎక్కువ స్టోరేజ్ కావాలనుకునే వారి కోసం 16GB RAM వేరియంట్‌ను రూ.79,999కి అందుబాటులో ఉంది. ఏప్రిల్ 5వ తేదీ నుంచి అమెజాన్, ఐక్యూ వెబ్‌సైట్లలో ఈ ఫోన్ విక్రయాలు మొదలవుతాయి. అయితే ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. కొనేటప్పుడు బ్యాంక్ కార్డులు వాడితే రూ.6,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అంతేకాకుండా.. ముందే బుక్ చేసుకునే వారికి దాదాపు రూ.1,900 విలువ చేసే ఇయర్‌బడ్స్‌ను కంపెనీ గిఫ్ట్‌గా ఇస్తోంది.

Advertisement

Also Read: రూ.15,000 లోపు గూగుల్ అసిస్టెంట్ టీవీలు.. ఈ టాప్ రేటెడ్ మోడల్స్‌పై ఓ లుక్కేయండి బాస్!

డిస్‌ప్లే క్వాలిటీ, స్పీడ్ ఎలా ఉంది?

ఈ ఫోన్‌లో వాడిన స్క్రీన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 6.85 అంగుళాల కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే అద్భుతమైన కలర్స్‌ని ఇస్తుంది. దీని బ్రైట్‌నెస్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఎంతటి ఎండలో అయినా ఫోన్ క్లియర్‌గా కనిపిస్తుంది. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. దీనిలో లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ వాడారు. దీంతో ఫోన్ ఎంతసేపు వాడినా హ్యాంగ్ అవ్వడం లాంటి సమస్యలు ఉండవు. పైగా గేమింగ్ కోసం ప్రత్యేకంగా ఒక చిప్‌ను కూడా పెట్టారు. కాబట్టి.. గేమర్లకు ఇక పండగే అని చెప్పాలి.

బ్యాటరీ లైఫ్ ఎంతంటే?

Advertisement

ఫొటోలు బాగా తీసేవారి కోసం ఈ ఫోన్‌లో వెనుక వైపు మూడు 50 మెగాపిక్సెల్ కెమెరాలను సెట్ చేశారు. మీరు క్లోజప్ షాట్స్ తీసినా లేదా లాంగ్ షాట్స్ తీసినా ఫొటోలు చాలా షార్ప్‌గా వస్తాయి. సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. భారీ 7000mAh బ్యాటరీని ఇచ్చారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలా సేపు వాడుకోవచ్చు. పైగా ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది కాబట్టి.. కొన్ని నిమిషాల్లోనే ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. దీంతోపాటు వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది.

Also Read: హాలీవుడ్ రేంజ్ సెటప్ ఇక ఇంట్లోనే.. ఈ చిన్న మ్యాజిక్ లైట్‌తో బెడ్‌రూమ్ లుక్కే మారిపోద్ది!

ముఖ్య గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×