E-Paper
Advertisement

iPhone Manufacturing: ప్రపంచవ్యాప్తంగా ప్రతి 4 ఐఫోన్లలో ఒకటి ‘మేడ్ ఇన్ ఇండియా’.. మార్కెట్లో 25% వాటా మనదే!

iPhone Manufacturing: ప్రపంచవ్యాప్తంగా ప్రతి 4 ఐఫోన్లలో ఒకటి ‘మేడ్ ఇన్ ఇండియా’..  మార్కెట్లో 25% వాటా మనదే!
Advertisement

iPhone Manufacturing: స్మార్ట్‌ఫోన్ రంగంలో భారత్ ఇప్పుడు గ్లోబల్ హబ్‌గా మారుతోంది. ఒకప్పుడు కేవలం అసెంబ్లింగ్‌‌కే పరిమితమైన మన దేశం.. ఇప్పుడు ప్రపంచానికే ఐఫోన్లను సరఫరా చేసే స్థాయికి ఎదిగింది. గడిచిన ఏడాదిలో భారత్‌లో ఐఫోన్ల తయారీ ఏకంగా 53% వృద్ధిని నమోదు చేయడం విశేషం.

గణాంకాలు ఏం చెబుతున్నాయి?

తాజా గణాంకాలను పరిశీలిస్తే.. 2024లో భారత్‌లో 36 మిలియన్ల ఐఫోన్లు తయారు కాగా, 2025 నాటికి ఆ సంఖ్య 55 మిలియన్లకు చేరుకుంది. కేవలం ఏడాది కాలంలోనే ఉత్పత్తి భారీగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 220 నుండి 230 మిలియన్ల ఐఫోన్లు మార్కెట్లోకి వస్తుండగా, అందులో 25% వాటా మన దేశానిదే కావడం గమనార్హం. అంటే.. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యే ప్రతి నాలుగు ఐఫోన్లలో ఒకటి భారత్‌లో తయారైందన్నమాట

Advertisement

Also Read: వామ్మో.. స్మార్ట్‌వాచ్ ఇక రోబోలా మారిపోతుందా? టీసీఎల్ క్రేజీ ఐడియా!

చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్..

అమెరికా – చైనా మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలు యాపిల్ సంస్థను ప్రత్యామ్నాయ మార్గాల వైపు నడిపించాయి. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్న యాపిల్, భారత్‌ను తన ప్రధాన ఉత్పత్తి కేంద్రంగా ఎంచుకుంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న PLI (Production Linked Incentive) పథకాలు, మెరుగైన మౌలిక సదుపాయాలు ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.

తిరుగులేని శక్తిగా భారత్..

Advertisement

ఐఫోన్ల తయారీ పెరగడం వల్ల దేశంలో వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించడమే కాకుండా, ఎగుమతుల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతం లభిస్తోంది. భవిష్యత్తులో ఐప్యాడ్లు, ఎయిర్‌పాడ్ల తయారీ కూడా భారత్‌లో పూర్తిస్థాయిలో మొదలైతే, గ్లోబల్ టెక్ మ్యాప్‌లో ఇండియా తిరుగులేని శక్తిగా అవతరించడం ఖాయం.

Also Read: ప్రపంచంలోనే తొలి 28 ఇంచుల ట్రై-ఫోల్డ్ మానిటర్.. ఇక ఫోన్లనే కాదు.. డెస్క్‌టాప్‌నూ మడతపెట్టొచ్చు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×