E-Paper
Advertisement

iPhone Fold: ఐఫోన్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ స్క్రీన్.. అండర్ డిస్‌ప్లే కెమెరాతో రానున్న ఆపిల్ ఫోల్డ్

iPhone Fold: ఐఫోన్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ స్క్రీన్.. అండర్ డిస్‌ప్లే కెమెరాతో రానున్న ఆపిల్ ఫోల్డ్
Advertisement

iPhone Fold: ఆపిల్ నుంచి వచ్చే తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌పై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. చైనా నుంచి వచ్చిన తాజా లీక్‌లు చూస్తే 2026 ఐఫోన్ లైనప్‌లో ఈ కొత్త ఫోన్ ఖచ్చితంగా చేరబోతుందన్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఐఫోన్ ఫోల్డ్ అనే పేరుతో పిలుస్తున్న ఈ ఫోన్, ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఆపిల్ అధికారికంగా అడుగుపెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని స్పష్టం అవుతుంది. ఇప్పటివరకు ఆండ్రాయిడ్ బ్రాండ్స్ ఆధిపత్యం ఉన్న ఈ సెగ్మెంట్‌లో ఆపిల్ ఎలా తన ముద్ర వేయబోతుందో అన్నదే ఇప్పుడు పెద్ద చర్చ.

బయోమెట్రిక్స్‌లో పెద్ద మార్పు

Advertisement

ఈ ఫోల్డబుల్ ఐఫోన్‌లో ఫేస్ ఐడీ ఉండదని లీక్‌. ఎందుంటే దాని స్థానంలో సైడ్ మౌంటెడ్ టచ్ ఐడీ అందించే అవకాశముంది. పవర్ బటన్‌లోనే ఫింగర్‌ ప్రింట్ సెన్సార్ ఉండే విధంగా డిజైన్ చేయనున్నారని సమాచారం. దీనివల్ల ఫోన్ మందం తగ్గించవచ్చు అనే ఆలోచనతోనే ఆపిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ టెక్నాలజీని ఈ మొదటి జనరేషన్ ఫోల్డబుల్‌లో ఉపయోగించకుండా, నమ్మకమైన ఫిజికల్ సెన్సార్‌కే ఆపిల్ ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తోంది.

డిస్‌ప్లే డిజైన్ ప్రత్యేకత

Advertisement

ఐఫోన్ ఫోల్డ్ ఒక వైడ్ స్టైల్ ఫోల్డబుల్‌గా రానుంది. లోపల 7.58 అంగుళాల భారీ డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. ఇది ఇప్పటివరకు వచ్చిన ఐఫోన్‌లలోనే అతిపెద్ద స్క్రీన్ కావడం విశేషం. ఐప్యాడ్ మినీ తరహా అనుభూతిని ఇది ఇవ్వబోతుందని చెబుతున్నారు. ఈ ఇంటర్నల్ స్క్రీన్‌లో అండర్ డిస్‌ప్లే సెల్ఫీ కెమెరా ఉండే అవకాశముంది, అంటే నాచ్ లేకుండా పూర్తిగా క్లిన్ లుక్ కనిపించవచ్చు. బయట 5.25 అంగుళాల కవర్ డిస్‌ప్లే ఉండి, హోల్ పంచ్ కట్ అవుట్‌తో డైలీ యూజ్‌కు ఉపయోగపడేలా డిజైన్ చేస్తారని సమాచారం.

Also Read: Samsung LED TV 2026: ఇంట్లోనే థియేటర్ అనుభూతి.. 2026లో 55 నుంచి 100 ఇంచుల వరకు శామ్‌సంగ్ టీవీలు

క్రీజ్ లేని స్క్రీన్ లక్ష్యం

ఫోల్డబుల్ ఫోన్లలో ఎక్కువగా కనిపించే క్రీజ్ సమస్యను పూర్తిగా తొలగించాలనే లక్ష్యంతో ఆపిల్ పని చేస్తున్నట్టు లీక్‌లు చెబుతున్నాయి. దీనికోసం కార్నింగ్, షాట్ లాంటి స్పెషల్ గ్లాస్ సప్లయర్స్‌తో కలిసి కొత్త రకం గ్లాస్ టెక్నాలజీని ఉపయోగించబోతున్నారని సమాచారం. డిస్‌ప్లే ఓపెన్ చేసినప్పుడు మధ్యలో మడత గుర్తు కనిపించకూడదన్నదే ఆపిల్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

కెమెరా ఫోకస్, 2026 రోడ్‌మ్యాప్

ఈ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉండే అవకాశం ఉంది. కనీసం ఒకటి 48 మెగాపిక్సెల్ సెన్సార్ ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. ప్రో మోడల్స్‌లా భారీ కెమెరా బంప్ కాకుండా స్లిమ్ డిజైన్, బలమైన హింజ్‌పైనే ఆపిల్ ఎక్కువ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. 2026లో ఆపిల్ ప్లాన్ చాలా పెద్దది. స్ప్రింగ్ 2026లో ఐఫోన్ 17ఈ లాంచ్, ఫాల్ 2026లో ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌తో పాటు ఈ ఫోల్డబుల్ ఐఫోన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. కొందరు దీనిని ఐఫోన్ అల్ట్రా అనే పేరుతో తీసుకురావచ్చని కూడా చెబుతున్నారు. ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ టెక్ ప్రపంచాన్ని మరోసారి షేక్ చేసే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇండియాలో ధర ఎంతంటే?

ఇండియాలో ఆపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ ధర ఇప్పటివరకు అధికారికంగా వెల్లడికాలేదు. కానీ లీక్‌లు, ఇండస్ట్రీ రిపోర్ట్స్ ఆధారంగా చూస్తే ఈ ఫోన్ ప్రీమియం సెగ్మెంట్‌లోనే లాంచ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం ఇండియాలో ఐఫోన్ ఫోల్డ్ ధర సుమారు రూ.1,70,000 నుంచి రూ.2,10,000 మధ్యలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఫోల్డబుల్ డిస్‌ప్లే టెక్నాలజీ, స్పెషల్ హింజ్ డిజైన్, క్రీజ్ లేని స్క్రీన్ లక్ష్యం లాంటి అంశాల కారణంగా ఈ ధర ఎక్కువగా ఉండే అవకాశముంది. అంతర్జాతీయ మార్కెట్‌తో పోలిస్తే ఇండియాలో పన్నులు, దిగుమతి చార్జీలు కలవడంతో ధర మరింత పెరిగే ఛాన్స్ కూడా ఉంది. ఇండియాలో ఇది ఇప్పటివరకు వచ్చిన ఐఫోన్‌లలోనే అత్యధిక ధర కలిగిన మోడల్‌గా నిలిచే అవకాశం కనిపిస్తోంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×