E-Paper
Advertisement

డ్యూయల్ కెమెరా, పవర్‌ఫుల్ బ్యాటరీతో వస్తున్న iPhone Air 2.. ఫీచర్స్ లీక్!

డ్యూయల్ కెమెరా, పవర్‌ఫుల్ బ్యాటరీతో వస్తున్న iPhone Air 2.. ఫీచర్స్ లీక్!
Advertisement

iPhone Air 2: యాపిల్ గతేడాది సెప్టెంబర్‌లో తమ అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్‌గా iPhone Airను మార్కెట్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని డిజైన్ చాలామందిని ఆకట్టుకున్నప్పటికీ.. చిన్న బ్యాటరీ, కేవలం ఒకే ఒక రేర్ కెమెరా ఉండటం లాంటి విషయాల్లో యూజర్ల నుంచి కాస్త విమర్శలు వచ్చాయి. అయితే, యాపిల్ ఈసారి తమ తదుపరి మోడల్ iPhone Air 2లో ఈ లోపాలను సరిదిద్దడానికి గట్టిగానే ప్లాన్ చేస్తోందని నెట్టింట లీక్స్ చక్కర్లు కొడుతున్నాయి.

పెరగనున్న బ్యాటరీ సామర్థ్యం:

ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ సమాచారం ప్రకారం.. కొత్త iPhone Air 2లో ఈసారి 3500mAh సామర్థ్యం గల పెద్ద బ్యాటరీని అందించే అవకాశం ఉంది. గత మోడల్‌లో ఉన్న 3149mAh బ్యాటరీతో పోలిస్తే ఇది చాలా మెరుగైన మార్పు అని చెప్పాలి. దీంతో ఫోన్ బ్యాటరీ లైఫ్ పెరగడమే కాకుండా.. ఇతర ఐఫోన్ మోడల్స్‌తో ఉన్న హార్డ్‌వేర్ గ్యాప్‌ను యాపిల్ భర్తీ చేయనుంది.

Advertisement

Also Read: వామ్మో.. డిస్‌ప్లే లేని స్మార్ట్ బ్యాండా? Noise సరికొత్త ప్రయోగం.. ధర, ఫీచర్లు ఇవే!

సరికొత్త ప్రాసెసర్:

ఈ కొత్త ఫోన్‌లో 120Hz రీఫ్రెష్ రేట్‌తో కూడిన 6.55 ఇంచుల డిస్‌ప్లేను అందించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఇది మరింత భద్రత కోసం 3D ఫేస్ రికగ్నిషన్ ఫీచర్‌ను సపోర్ట్ చేస్తుంది. వీటన్నింటికీ తోడు, అత్యంత అధునాతన 2nm ప్రాసెస్ ఆధారంగా రూపొందించిన A20 చిప్‌సెట్‌తో ఈ ఫోన్ పనిచేస్తుందని సమాచారం. తద్వారా ఫోన్ పనితీరు చాలా వేగంగా ఉంటుంది.

కెమెరా విభాగంలో భారీ అప్‌గ్రేడ్:

Advertisement

ఇక ఫొటోగ్రఫీ ప్రియుల కోసం ఈసారి యాపిల్ ఒక ప్రత్యేక అప్‌గ్రేడ్ చేస్తోంది. iPhone Air 2లో డ్యూయల్ రేర్ కెమెరా సెటప్‌ను ఇవ్వబోతున్నారట. ఇందులో 48MP మెయిన్ సెన్సార్‌తో పాటు, ఒక అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ కూడా ఉండనుంది. పాత మోడల్‌లో కేవలం ఒకే ఒక 48MP కెమెరా ఉండటంతో, ఈ కొత్త మార్పు యూజర్లకు మంచి ఎంపిక కానుంది.

లాంచింగ్ ఎప్పుడంటే?

iPhone Air 2ను యాపిల్ సంస్థ బేస్ మోడల్ iPhone 18తో పాటు 2027 ఆరంభంలో లాంచ్ చేసే అవకాశం ఉందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. గతేడాది వచ్చిన మొదటి ఐఫోన్ ఎయిర్ (256GB వేరియంట్) ధర మనదేశంలో రూ.1,19,900గా ఉంది. మరిన్ని అప్‌డేట్స్‌తో రాబోతున్న ఈ కొత్త మోడల్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే మరి.

Also Read: ఐఫోన్ కాదు బాస్.. యాపిల్ నుంచి ఊహించని ‘విజువల్’ గ్యాడ్జెట్.. అసలు ఆట 2027 లోనే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×