E-Paper
Advertisement

యాపిల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ కెమెరా అప్‌గ్రేడ్.. iPhone 18 Pro లీకైన వివరాలు చూస్తే మైండ్ బ్లాకే!

యాపిల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ కెమెరా అప్‌గ్రేడ్.. iPhone 18 Pro లీకైన వివరాలు చూస్తే మైండ్ బ్లాకే!
Advertisement

iPhone 18 Pro: యాపిల్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఐఫోన్ కొత్త సిరీస్ ముచ్చట్లు అప్పుడే మొదలయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో రాబోతున్న iPhone 18 Pro మోడల్స్ మార్కెట్లో సరికొత్త సంచలనం సృష్టించబోతున్నట్లు లీకులు అందుతున్నాయి. ముఖ్యంగా కెమెరా, బ్యాటరీ, ఏఐ ఫీచర్లలో భారీ మార్పులతో ఈ ఫోన్ రానుంది.

ఎప్పుడు రావచ్చు? ధర ఎంత ఉండొచ్చు?

యాపిల్ కంపెనీ ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా సెప్టెంబర్ 2026 నాటికి iPhone 18 సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది. అయితే ఈసారి ధరలు కాస్త షాక్ ఇచ్చేలా ఉన్నాయి. ఏఐ హార్డ్‌వేర్ ఖర్చులు పెరగడం వల్ల iPhone 18 Pro ప్రారంభ ధర సుమారుగా రూ.1,22,600 (మన దేశ పన్నులు, కస్టమ్స్ డ్యూటీలు కలిపితే భారత్‌లో ఇది మరికొంత ఎక్కువ) ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Also Read: సినిమా లవర్స్‌కు పూనకాలే.. సోనీ నుంచి మోస్ట్ పవర్‌ఫుల్ హోమ్ థియేటర్ సిరీస్ లాంచ్!

డిజైన్, డిస్‌ప్లే ఎలా ఉంటుంది?

చూడటానికి ఈ ఫోన్ పాత మోడల్స్‌కు కాస్త దగ్గరగానే ఉన్నా, డిస్‌ప్లే విషయంలో యాపిల్ కొన్ని మార్పులు చేస్తోంది. iPhone 18 Pro మోడల్ 6.3 ఇంచుల స్క్రీన్‌తో రానుంది. మునుపటి కంటే మరింత బ్రైట్‌నెస్ ఇచ్చే ఓఎల్ఈడీ డిస్‌ప్లేను ఇందులో వాడుతున్నారు. ఈసారి సిల్వర్, గ్రే, లైట్ బ్లూ రంగులతో పాటు కొత్తగా ‘డార్క్ చెర్రీ’ కలర్ వేరియంట్‌ను కూడా యాపిల్ పరిచయం చేయనుంది.

అద్భుతమైన కెమెరా, సూపర్ బ్యాటరీ:

Advertisement

యాపిల్ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన కెమెరా సిస్టమ్‌ను iPhone 18 Proలో చూడబోతున్నాం. ఇందులో వేరియబుల్ అపెర్చర్ కెమెరాను ఇస్తున్నారు. దీనివల్ల కాంతి తక్కువగా ఉన్నా కూడా అద్భుతమైన ఫొటోలు వస్తాయి, బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ చాలా సహజంగా ఉంటుంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే, మొదటిసారిగా 5000mAh కంటే ఎక్కువ సామర్థ్యం గల బ్యాటరీని ఇస్తుండటంతో చార్జింగ్ చాలా ఎక్కువ సమయం వస్తుంది.

నెక్ట్స్ లెవెల్ పెర్ఫార్మెన్స్, ఏఐ సిరి:

ఈ ఫోన్ వేగాన్ని పెంచడానికి ఏ20 ప్రో చిప్‌ను వాడుతున్నారు. ఏఐ ఫీచర్లు బాగా పనిచేయడం కోసం ఏకంగా 12GB RAMను స్టాండర్డ్‌గా ఇస్తున్నారు. వీటన్నింటికీ మించి సరికొత్త ఐఓస్ 27తో వచ్చే Siri వాయిస్ అసిస్టెంట్ ఇకపై కేవలం చాట్‌బాట్‌లా కాకుండా, మన ఫోన్ స్క్రీన్‌ను అర్థం చేసుకుని, యాప్స్‌తో అనుసంధానమై మన పనులను మరింత సులువుగా చక్కబెట్టేయనుంది.

Also Read: ఇదేందయ్యా ఇది.. ఐఫోన్ డిజైన్‌తో కూల్‌ప్యాడ్ కొత్త ఫోన్.. రేటు మరీ ఇంత తక్కువా!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×