E-Paper
Advertisement

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!
Advertisement

iPhone 18 Pro Max Leaks: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ నుంచి త్వరలో రాబోయే ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన లీక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ ఫోన్ కెమెరా విభాగంలో కంపెనీ ఒక విప్లవాత్మక మార్పు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఏ ఐఫోన్‌లోనూ లేని విధంగా, మొదటిసారిగా దీనిలో వేరియబుల్ అపెర్చర్ కలిగిన సరికొత్త సోనీ Sony IMX905 సెన్సార్‌ను వాడనున్నట్లు సమాచారం. దీంతో తక్కువ వెలుతురులోనూ అద్భుతమైన ఫొటోలు, పోర్ట్రెయిట్ షాట్స్ తీసుకోవచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ కొత్త సిరీస్ ఫోన్ల కోసం ఎదురుచూసే వారికి ధరల విషయంలో కొంచెం షాక్ తగిలేలా ఉంది. భారతదేశంలో ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధర, పాత మోడల్స్ కంటే దాదాపు రూ.15,000 నుండి రూ.25,000 వరకు ఎక్కువగా ఉండే అవకాశం ఉందట. విడిభాగాల కొరత, ర్యామ్ ధరలు పెరగడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ ఫోన్లను సెప్టెంబర్ 9న విడుదల చేసే అవకాశం ఉంది. అయితే.. ఈసారి యాపిల్ తమ విడుదల వ్యూహాన్ని మార్చబోతోంది. ప్రీమియం మోడల్స్‌ను శరదృతువులో లాంచ్ చేసి, సాధారణ ఐఫోన్ 18 మోడల్స్‌ను 2027 ప్రారంభంలో తీసుకురావాలని యోచిస్తోంది.

Advertisement

Also Read: గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

ప్రస్తుతం చాలా మందిలో మెదులుతున్న ప్రశ్న ఏమిటంటే.. ఐఫోన్ 17 ప్రో సిరీస్ కొనేయాలా లేక 18 ప్రో మ్యాక్స్ కోసం ఆగాలా అని. ఇప్పుడే అప్‌గ్రేడ్ అవ్వడం వల్ల ఆఫర్ల రూపంలో డబ్బు ఆదా చేసుకోవచ్చు. అలాగే స్టాక్ కొరత వంటి సమస్యలు ఉండవు. ఒకవేళ కెమెరా పరంగా సరికొత్త టెక్నాలజీ కావాలనుకుంటే మాత్రం ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ కోసం ఆగడం మంచిది. అయితే దీనికోసం మరింత ఎక్కువ బడ్జెట్ కేటాయించాల్సి ఉంటుంది.

Advertisement

ఐఫోన్ 18 ప్రో సిరీస్‌తో పాటు యాపిల్ తమ మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్‌ను కూడా అదే సమయంలో పరిచయం చేయవచ్చని టెక్ నిపుణుల అంచనా. ఇది బుక్-స్టైల్ డిజైన్‌తో, పెద్ద స్క్రీన్‌తో రానుంది. తయారీలో ఉండే సంక్లిష్టత వల్ల ప్రారంభంలో దీని స్టాక్ చాలా పరిమితంగా ఉండే అవకాశం ఉంది. సరికొత్త కెమెరా ఫీచర్లు, ఫోల్డబుల్ స్క్రీన్ టెక్నాలజీతో రాబోతున్న ఈ ఫోన్లు మార్కెట్లో ఎలాంటి సంచలనం సృష్టిస్తాయో వేచి చూడాల్సిందే.

Also Read: వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×