E-Paper
Advertisement

ఐఫోన్ యూజర్లకు షాక్.. యాపిల్ నుంచి ఊహించని నిర్ణయం, ఇంతకీ ఏమైందంటే?

ఐఫోన్ యూజర్లకు షాక్.. యాపిల్ నుంచి ఊహించని నిర్ణయం, ఇంతకీ ఏమైందంటే?
Advertisement

iPhone 18 Pro: యాపిల్‌ ప్రొడక్ట్స్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి మాటల్లో చెప్పలేనిది. అలాంటి ఐఫోన్ లవర్స్‌కు ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. ఇప్పటికే విడుదలైన ఐఫోన్ 16, 17ల ఇంకా గురించే చర్చ నడుస్తుంటే.. అప్పుడే ఐఫోన్ 18 ప్రో గురించి సోషల్ మీడియాలో లీకులు వెలువడ్డాయి. ముఖ్యంగా ఐఫోన్ 14 ప్రో మోడల్ నుంచి మనం చూస్తున్న ఆ డైనమిక్ ఐలాండ్ డిజైన్‌లో ఈసారి గట్టి మార్పు ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. స్క్రీన్ పైన ఉండే ఆ నల్లటి పిల్ షేప్ కటౌట్ పరిమాణాన్ని కంపెనీ బాగా తగ్గించబోతోందట.

డిజైన్‌లో వస్తున్న మార్పు ఏంటి?

చైనాకు చెందిన ప్రముఖ టెక్ అనలిస్ట్ చెప్పిన సమాచారం ప్రకారం.. యాపిల్ ప్రస్తుతం ఐఫోన్ 18 ప్రో కోసం రెండు రకాల డిజైన్లను టెస్ట్ చేస్తోంది. ఒకటి ఇప్పుడు మనం వాడుతున్న సైజులోనే ఉండగా.. రెండోది మాత్రం మినీ వెర్షన్‌లో ఉందట. ఫేస్ ఐడికి సంబంధించిన కొన్ని పార్ట్స్‌ను డిస్‌ప్లే లోపలికి పంపడం ద్వారా ఈ కటౌట్ సైజును తగ్గించాలని చూస్తున్నారు. అదే గనుక నిజమైతే.. ఇప్పుడున్న దానికంటే దాదాపు 35 శాతం మేర ఆ కటౌట్ చిన్నదిగా మారిపోతుంది. దీనివల్ల మనకు స్క్రీన్ పైన ఇంకా ఎక్కువ స్పేస్ దొరుకుతుంది.

Advertisement

Also Read: iPhone 17 సిరీస్‌పై ఊహించని డిస్కౌంట్లు.. విజయ్ సేల్స్ యాపిల్ డేస్ సేల్ పూర్తి వివరాలివే!

వెనుక వైపు మాత్రం అదే లుక్..

ముందు భాగంలో ఇంత పెద్ద మార్పు చేస్తున్నా.. వెనుక వైపు మాత్రం యాపిల్ పెద్దగా రిస్క్ తీసుకోవడం లేదనే చెప్పాలి. కెమెరా సెటప్, ఫోన్ బాడీ షేప్ దాదాపు ఐఫోన్ 17 ప్రో లాగే ఉండొచ్చట. కేవలం వాడే మెటీరియల్స్, ఫినిషింగ్, అలాగే కొత్త కలర్స్ విషయంలో మాత్రం కొన్ని మార్పులు ఉండొచ్చు. అయితే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫోల్డబుల్ ఐఫోన్ కూడా ఈ 2026 లైనప్‌లోనే వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం.

అసలు ఉద్దేశ్యం అదేనా?

Advertisement

ఐఫోన్ 14 ప్రోలో ఈ డైనమిక్ ఐలాండ్‌ను తీసుకొచ్చినప్పటి నుంచి యాపిల్ అందులో పెద్దగా మార్పులేమీ చేయలేదు. ఇప్పుడు ఈ సైజును తగ్గించడం వల్ల యూజర్లకు వీడియోలు చూస్తున్నప్పుడు, గేమ్స్ ఆడుతున్నప్పుడు అంతగా ఇబ్బంది ఉండదు. అసలు పైన ఎలాంటి కటౌట్స్ లేకుండా, మొత్తం స్క్రీన్ మాత్రమే కనిపించే ఐఫోన్‌ను తీసుకురావాలన్నది యాపిల్ అసలు ప్లాన్. దానికి ఈ మినీ డైనమిక్ ఐలాండ్ అనేది తొలి అడుగు అని అనుకోవచ్చు.

Also Read: యాపిల్‌కు చెక్ పెట్టేలా ఒప్పో కొత్త ప్లాన్.. వామ్మో, ఈ Mini Padలో ఇన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లా!

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×