E-Paper
Advertisement

యాపిల్ లవర్స్‌కు షాక్.. ఈసారి బ్లాక్ కలర్ లేనట్టే, iPhone 18 Proలో ఊహించని మార్పులు!

యాపిల్ లవర్స్‌కు షాక్.. ఈసారి బ్లాక్ కలర్ లేనట్టే, iPhone 18 Proలో ఊహించని మార్పులు!
Advertisement

iPhone 18 Pro: ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాపిల్ లవర్స్ అందరూ iPhone 18 సిరీస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తన్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ నుంచి ఏదైనా లీక్స్ వెలువడ్డాయంటే.. టెక్ ప్రియుల్లో ఒకటే హడావిడి మొదలైపోతుంది. తాజాగా ఈ ఫోన్ గురించి వెలువడిన లీక్స్చూ స్తుంటే.. ఐఫోన్ లవర్స్‌కు ఈసారి షాక్ తగిలేలా ఒక అప్డేట్ వచ్చింది. ముఖ్యంగా ఐఫోన్‌లో బ్లాక్ కలర్ వేరియంట్‌ను ఇష్టపడే వాళ్లకి. అవును.. మీరు విన్నది నిజమే. ఈసారి ఐఫోన్ 18 సిరీస్‌లోని ప్రో మోడల్‌లో బ్లాక్ కలర్ ఉండకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఆ కొత్త రంగులేంటో తెలుసా?

సాధారణంగా చాలామంది ఐఫోన్‌ను బ్లాక్ లేదంటే స్పేస్ గ్రే రంగుల్లో చూడటానికి ఇష్టపడతారు. కానీ, తాజా సమాచారం ప్రకారం ఈసారి ప్రో మోడల్స్‌లో బ్లాక్ కలర్ ఉండకపోవచ్చట. ప్రముఖ టిప్‌స్టర్ వైల్యాబ్ చెప్తున్న దాని ప్రకారం.. ఐఫోన్ 18 ప్రో ఈసారి గ్రే, సిల్వర్, డార్క్ రెడ్ కలర్స్‌లో రాబోతోంది. సాధారణంగా యాపిల్ తమ ప్రో మోడల్స్‌కు రెడ్ కలర్‌ను అంత త్వరగా కేటాయించదు. కానీ ఈసారి మాత్రం గట్టిగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. గత ఏడాది ఆరెంజ్ కలర్‌కు వచ్చిన క్రేజ్ చూశాక.. ఇలాంటి కొత్త ప్రయోగాలు చేయాలని కంపెనీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

Advertisement

Also Read: ఏటీఎం కార్డు ఇంట్లో మర్చిపోయారా? పేటీఎం ఉంటే చాలు.. ఇలా నగదు విత్ డ్రా చేసుకోవచ్చు!

లుక్ ఎలా ఉండబోతోంది?

డిజైన్ విషయంలో పెద్దగా మార్పులు లేకపోయినా.. ఫోన్ పైన ఉండే ఆ చిన్న కెమెరా కటౌట్ (పంచ్ హోల్) సైజ్ ఈసారి తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల ఫోన్ స్క్రీన్ ఇంకాస్త పెద్దగా, క్లియర్‌గా కనిపిస్తుంది. అలాగే బాడీ తయారీలో అల్యూమినియం వాడుతున్నారట. దీనివల్ల ఫోన్ చేతిలో పట్టుకుంటే చాలా స్టైలిష్‌గా, లైట్ వెయిట్‌గా అనిపిస్తుంది. కొత్త రంగులు ఈ మెటల్ ఫినిషింగ్‌పై ఇంకా అద్భుతంగా మెరిసిపోతాయని టాక్.

బ్యాటరీ సంగతేంటి?

Advertisement

కేవలం కలర్స్ మాత్రమే కాదు.. పనితీరులో కూడా ఐఫోన్ 18 ప్రో ఒక రేంజ్‌లో ఉండబోతోందట. దీనిలో వాడే 2nm ఏ20 ప్రో చిప్‌సెట్ వల్ల ఫోన్ అస్సలు హ్యాంగ్ అవ్వకుండా, సూపర్ ఫాస్ట్‌గా పనిచేస్తుంది. పైగా ఈసారి బ్యాటరీ విషయంలో కూడా యాపిల్ గట్టిగానే ప్లాన్ చేసినట్లు ఉంది. 5,000mAh కంటే.. ఎక్కువ సామర్థ్యం ఉన్న బ్యాటరీని పెడుతున్నారట. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ పెడితే చాలు.. రోజంతా నిశ్చింతగా వాడుకోవచ్చు. అయితే, ఇవన్నీ ప్రస్తుతం లీకులు మాత్రమే. అసలు విషయం తెలియాలంటే సెప్టెంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే మరి.

Also Read: షియోమీ విధ్వంసం.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీతో మిగతా ఫోన్లకు చెక్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×