E-Paper
Advertisement

మార్కెట్‌లో స్టాక్ ఖాళీ.. ఒక్కసారిగా రూ.12,000 వరకు పెరిగిన iPhone 17 సిరీస్ ధరలు!

మార్కెట్‌లో స్టాక్ ఖాళీ.. ఒక్కసారిగా రూ.12,000 వరకు పెరిగిన iPhone 17 సిరీస్ ధరలు!
Advertisement

iPhone 17 Series: చాలామంది యువతకి ఐఫోన్ 17 అనేది ఒక డ్రీమ్ ఫోన్. అయితే ఈ ఫోన్ సొంతం చేసుకోవడం ఇకపై అంత తేలికయ్యేలా లేదు. భారత మార్కెట్లో ఐఫోన్ 17 సిరీస్ ధరలు ఊహించని రీతిలో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మార్కెట్‌లో కొన్ని చోట్ల ఈ ఫోన్ల లభ్యత తగ్గడం, మరోవైపు ధరల పెంపు వార్తలు రావడం కొనుగోలుదారులను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. విడిభాగాల ఖర్చులు పెరగడమే దీనికి కారణమని అంటున్నా.. ఐఫోన్ ప్రియులకు మాత్రం ఇది పెద్ద జలక్ అనే చెప్పాలి. మరి ఈ కొత్త రేట్లు ఎప్పటి నుంచి అమల్లోకి రానున్నాయి? ఆ రేట్ల లిస్ట్ ఏంటో.. ఇప్పుడు తెలుసుకుందాం.

రూ.12 వేల వరకు పెరిగే ఛాన్స్..

ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. యాపిల్ కంపెనీ త్వరలోనే కొత్త ధరలను అమల్లోకి తీసుకురానుంది. బేసిక్ మోడల్ ఐఫోన్ 17 ధర ప్రస్తుతం ఉన్న రూ.82,990 నుంచి దాదాపు రూ.94,990కి చేరవచ్చు. ఇక ఐఫోన్ 17 ప్రో ధర రూ.1,34,900 నుంచి రూ.1,46,990 వరకు, టాప్ ఎండ్ మోడల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ ధర రూ.1,49,900 నుంచి ఏకంగా రూ.1,62,000 వరకు పెరిగే అవకాశం ఉంది. అంటే ప్రతి మోడల్‌పై దాదాపు రూ.12,000 వరకు భారం పడేలా కనిపిస్తోంది.

Advertisement

Also Read: 10 నిమిషాల ఛార్జ్‌తో 12 గంటలు బ్యాకప్.. 3D ఆడియో, నాయిస్ క్యాన్సిలేషన్‌తో సరికొత్త బోట్ హెడ్‌ఫోన్స్ లాంచ్!

మార్కెట్‌లో తగ్గిన స్టాక్ లభ్యత..

ఒకవైపు ధరల పెంపు వార్తలు భయపెడుతుంటే.. మరోవైపు మార్కెట్‌లో ఈ ఫోన్లకు విపరీతమైన స్టాక్ కొరత ఏర్పడింది. సరఫరాలో తలెత్తిన సమస్యల వల్ల స్టోర్లలో ఫోన్లు త్వరగా దొరకడం లేదు. అయితే వచ్చే వారంలో కొత్త స్టాక్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ధరలు ఎక్కడ పెరుగుతాయోనన్న భయంతో చాలామంది కస్టమర్లు ముందే ఫోన్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

Advertisement

స్మార్ట్‌ఫోన్ విడిభాగాల తయారీ ఖర్చులు పెరగడం, గ్లోబల్ సప్లై చెయిన్ సమస్యలే ఈ ధరల పెంపునకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల యాపిల్ తమ మ్యాక్‌బుక్, ఐప్యాడ్ మోడళ్ల ధరలను కూడా పెంచడం ఈ వార్తలకు మరింత బలాన్నిస్తోంది. అయితే.. ఈ ధరల పెంపుపై యాపిల్ సంస్థ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి.. ఐఫోన్ 17 సిరీస్ తీసుకోవాలనుకునేవారు కంపెనీ ప్రకటన వచ్చే వరకు వేచి చూడటం మంచిది.

Also Read: ఇంట్లో తేమగా ఉందని హ్యూమిడిఫైయర్ వాడుతున్నారా? నిపుణులు ఎందుకు వద్దంటున్నారో తెలిస్తే..

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×