E-Paper
Advertisement

iPhone 17 Pro Max : ఇప్పటివరకూ వచ్చిన వాటిలో తోపు మెుబైల్ ఇదే.. ఫీచర్స్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!

iPhone 17 Pro Max : ఇప్పటివరకూ వచ్చిన వాటిలో తోపు మెుబైల్ ఇదే.. ఫీచర్స్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!
Advertisement

iPhone 17 Pro Max : యాపిల్ కంపెనీ తాజాగా లాంఛ్ చేసిన ఐఫోన్ 16 సిరీస్ ఇప్పటికీ మార్కెట్లో హాట్ కేక్స్ లా అమ్మడు పోతున్నాయి. ఈ సిరీస్ నుంచి లాంఛ్ చేసిన గ్యాడ్జెట్స్ అన్నిటికీ మంచి డిమాండ్ కనిపిస్తుంది. ఇక త్వరలోనే ఐఫోన్ 17 సిరీస్ ను యాపిల్ లాంఛ్ చేయడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐఫోన్ 17 ప్రో మాక్స్ డిజైన్, ధర, ఫీచర్స్ పై లేటెస్ట్ అప్డేట్స్ లీక్ అయ్యి టెక్ ప్రియులను ఉర్రూతలూగిస్తున్నాయి.

యాపిల్ నుంచి కొత్త సిరీస్ లాంఛ్ అవుతుందంటే టెక్ ప్రియులకు పండగే. ఈ టెక్ దిగ్గజం.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ మొబైల్స్ ను లాంఛ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది ఐఫోన్ 16 సిరీస్ ను లాంఛ్ చేయగా.. వచ్చే ఏడాది ఐఫోన్ 17 సిరీస్ ను లాంఛ్ చేయడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ మొబైల్స్ అన్నీ లేటెస్ట్ అప్డేట్స్ తో రాబోతున్నాయి.

Advertisement

ఆపిల్ కంపెనీ ప్రతి ఏడాది సెప్టెంబర్ రెండు లేదా మూడో వారంలో ఐఫోన్ సిరీస్ లాంఛ్ చేస్తుంది. ఇక ఈ ఏడాది ఐఫోన్ 16 సిరీస్ ను సెప్టెంబర్ లో లాంఛ్ చేయగా.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ సెప్టెంబర్ 9, 2025న రాబోతున్ననట్లు తెలుస్తుంది. ఇక ఇండియాలో సెప్టెంబర్ 10 నుంచి 14 మధ్య ఈ ఫోన్స్ కొనుగోలుకు అందుబాటులో ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఐఫోన్ 17 ప్రో మాక్స్ ధర, ఫీచర్స్ మరోసారి వైరల్ గా మారాయి,

ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఫీచర్స్ – 

Advertisement

ధర – ఐఫోన్ 16 ప్రో మాక్స్ లాంఛ్ అయినప్పుడు దీని ధర రూ. 1,44,900. 256 GB వేరియంట్ ధర ఈ రేంజ్ లో ఉండగా… దీని కంటే ముందుగా లాంఛ్ అయిన ఐఫోన్ 15 ప్రో మాక్స్ ధర కంటే 15000 ఎక్కువగా ఉంది. ఇక ఐఫోన్ 17 సైతం రూ.15000 ఎక్కువగా ఉంటే అవకాశం కనిపిస్తుంది.

ఫీచర్స్ – ఈ మొబైల్ ఫీచర్స్ సైతం అదిరిపోయే విధంగా ఉండనున్నట్టు తెలుస్తుంది. డిజైన్తో పాటు కెమెరాను సైతం ఆత్యాధునికంగా ఆపిల్ కంపెనీ డిజైన్ చేయనున్నట్లు టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

డిజైన్ – ఐఫోన్ 17 ప్రో మాక్స్ అండర్ డిస్ ప్లే ఫేస్ ఐడి టెక్నాలజీతో రాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మొబైల్ ను బెస్ట్ లుకింగ్ కోసం గ్రీన్ కలర్ ఆప్షన్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

డిస్ ప్లే – ఈ మొబైల్ యాంటీ రిఫ్లెక్షన్ తో రాబోతుందని.. ఇక స్క్రాచ్ రెసిస్టెంట్గా బ్రైట్ లైట్ తో రాబోతున్నట్టు తెలుస్తోంది.

బ్యాటరీ పర్ఫామెన్స్ – ఐఫోన్ 16 ప్రో మాక్స్ 4685 ఎంహెచ్ బ్యాటరీతో రాగా ఐఫోన్ 17 ప్రో మాక్స్ దీని కంటే ఎక్కువ పరిమాణంలో రాబోతున్నట్టు తెలుస్తోంది.

కెమెరా – ఐఫోన్ 17 ప్రో మాక్స్ 48 టెలిఫోటో లెన్స్ తో రాబోతుంది. ఆపిల్ విజన్ ప్రో హెడ్సెట్ అండ్ 24 ఫ్రెంట్ కెమెరాతో ఈ మొబైల్ లాంఛ్ కాబోతున్నట్టు అంచనా.

కనెక్టివిటీ అండ్ చిప్సెట్ – ఫాస్ట్ ఇంటర్నెట్ స్పీడ్ కోసం ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఆపిల్ డిజైన్ వైఫై 7 చిప్ సెట్ తో రాబోతున్నట్టు తెలుస్తోంది.

ఇక ఈ లీకైన ఈ ఫీచర్స్ టెక్ ప్రియులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఐఫోన్ 17 సిరీస్ ఎప్పుడు వస్తుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూసేలా చేస్తున్నాయి.

ALSO READ :  అస్సలు ఊహించని గ్యాడ్జెట్.. రింగ్ సైజులో స్మార్ట్ వాచ్.. ఫీచర్స్ వేరే లెవెల్ అంతే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×