E-Paper
Advertisement

ఓరి నాయనా.. iPhone 15 Proపై ఏకంగా రూ.59,000 తగ్గింపు, ఎక్కడ కొనుగోలు చేయాలంటే?

ఓరి నాయనా.. iPhone 15 Proపై ఏకంగా రూ.59,000 తగ్గింపు, ఎక్కడ కొనుగోలు చేయాలంటే?
Advertisement

iPhone 15 Pro Price Drops: చాలామంది మిడిల్‌క్లాస్ యువత డ్రీమ్ ఏమిటంటే.. జీవితంలో ఒక్కసారైనా ఐఫోన్ కొనాలని ఉంటుంది. కానీ, యాపిల్ బ్రాండ్స్ రేట్లు చూసి ‘అబ్బో.. మనకెందుకులే’ అని ఆగిపోతుంటారు. ముఖ్యంగా Pro మోడల్స్ ధరల గురించి మాటల్లో చెప్పలేము. కానీ ఇప్పుడు అలాంటి వారికి గోల్డెన్ ఛాన్స్ దొరికింది. గతేడాది లాంచ్ అయినప్పుడు రూ.లక్షకు పైగా ధర పలికిన iPhone 15 Pro ధర ఇప్పుడు అమాంతం పడిపోయింది. ప్రస్తుతం జియోమార్ట్ అందిస్తున్న ఈ ఆఫర్ వివరాలు చూస్తే.. పోకిరి సినిమాలో మహేష్ బాబు చెప్పినట్లు ‘దిమ్మతిరిగి మైండ్ బ్లాక్’ అవ్వాల్సిందే ఎవరికైనా.

జియోమార్ట్‌లో కళ్లు చెదిరే తగ్గింపు..

ప్రస్తుతం జియోమార్ట్ iPhone 15 Pro ధరను ఏకంగా రూ.60,900కు తగ్గించేసింది. ఇక్కడితోనే ఆఫర్ ముగిసిపోలేదు. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే మరో రూ.10,000 డిస్కౌంట్ పొందొచ్చు. అన్ని ఆఫర్లు పోను కేవలం రూ.50,900కే ఈ ప్రీమియం ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. లాంచ్ అయినప్పటి నుంచి చూస్తే దాదాపు రూ.59,000 వరకు తగ్గింపు లభించడం అంటే మామూలు విషయం కాదు.

Advertisement

Also Read: మినీ ఏసీలు.. ఇవి నిజంగానే కూలింగ్ ఇస్తాయా? అంతా ఉత్తిదేనా? ఫుల్ రివ్యూ

iPhone 15 Pro స్పెసిఫికేషన్లు..

తక్కువ రేటుకు వస్తోంది కదా అని ఫోన్ క్వాలిటీ తగ్గుతుందేమో అని భయం అక్కర్లేదు. ఈ ఫోన్‌లో వాడిన ఏ17 ప్రో చిప్ సెట్ ఇప్పటికీ టాప్ లెవల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. పైగా ఇది టైటానియం బాడీతో వస్తుంది కాబట్టి.. చాలా స్టైలిష్‌గా, చేతిలో పట్టుకుంటే మంచి గ్రిప్‌తో ఉంటుంది. దీని కెమెరా క్వాలిటీ గురించి ఇక చెప్పక్కర్లేదు. సినిమా రేంజ్ ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు. ఒక సాదాసీదా మిడ్‌రేంజ్ ఫోన్ కొనే బడ్జెట్‌లోనే యాపిల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ రావడం అనేది ఒక రకంగా అదృష్టమే.

స్టోర్ల మధ్య పెరిగిన పోటీ..

Advertisement

జియోమార్ట్ మాత్రమే కాకుండా విజయ్ సేల్స్ లాంటి ఇతర షోరూమ్‌లు కూడా ఐఫోన్లపై పోటీపడి మరి ఆఫర్లు ఇస్తున్నాయి. మార్కెట్లోకి కొత్తగా iPhone 16, 17 మోడల్స్ రావడంతో పాత స్టాక్‌ను క్లియర్ చేయడానికి ఇలాంటి భారీ తగ్గింపులు ఇస్తున్నారు. బడ్జెట్‌లో మంచి Pro మోడల్ ఫోన్ వాడాలి అనుకునే వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. ఎప్పటి నుంచో ఐఫోన్ కొనాలని కలలు కంటున్న సామాన్యులకు కూడా ఇప్పుడు అది అందుబాటులోకి వచ్చింది. ఇక ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఆర్డర్ చేసేయండి మరి.

ముఖ్య గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Also Read: కేవలం రూ.1కే కొత్త సిమ్.. జియో, ఎయిర్‌టెల్ ప్లాన్ల కంటే ఇదే తక్కువా? పూర్తి వివరాలివే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×