E-Paper
Advertisement

AC Buying Guide: ఇన్వర్టర్ vs డ్యూయల్ ఇన్వర్టర్.. రెండింటికి తేడా ఏంటి? కూలింగ్‌కు ఏది బెస్ట్?

AC Buying Guide: ఇన్వర్టర్ vs డ్యూయల్ ఇన్వర్టర్.. రెండింటికి తేడా ఏంటి? కూలింగ్‌కు ఏది బెస్ట్?
Advertisement

AC Buying Guide: ప్రస్తుత వేసవి నేపథ్యంలో చాలా మంది కొత్త ఏసీలను కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్ లో అందుబాటులో ఉన్న నాణ్యమైన ఏసీలను సొంతం చేసుకుంటున్నారు. అయితే ఏసీని కొనేటప్పుడు చాలా మందిని ఓ కన్ఫ్యూజన్ వెంటాడుతోంది. ఇన్వర్టర్, డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీల్లో ఏది కొనుగోలు చేస్తే బాగుంటుందన్న దానిపై వారిలో క్లారిటీ ఉండటం లేదు. ఈ నేపథ్యంలో వాటి మధ్య ప్రధాన వ్యత్యాసాలు, ఏది కొంటే బెటర్ అన్నది ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఇన్వెర్టర్ vs డ్యూయల్ ఇన్వెర్టర్’

సాధారణంగా నాన్ ఇన్వర్టర్ ఏసీలు.. గది మెుత్తం చల్లబడగానే కంప్రెసర్ ను నిలిపివేస్తాయి. మళ్లీ ఉష్ణోగ్రత పెరగగానే మళ్లీ కంప్రెస్ ఆన్ చేస్తాయి. కానీ ఇన్వర్టర్ ఏసీలు అలా కాదు. ఇది గది ఉష్ణోగ్రతను బట్టి కంప్రెస్ స్పీడ్ ను మారుస్తూ ఉంటాయి. అంతే గానీ కంప్రెసర్ ను పూర్తిగా ఆపివేయదు. ఫలితంగా గది కూలింగ్ లో స్థిరంగా కొనసాగుతుంది. అదే డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీలు అయితే.. మరింత సమర్థవంతంగా కూలింగ్ ను అందిస్తాయి. ఈ ఏసీలోని ఒకే కంప్రెసర్‌లో రెండు రోటర్లు (Rotors) ఉండటం వల్ల గది చాలా త్వరగా చల్లబడుతుంది. రెండు రోటర్లు బ్యాలెన్స్‌డ్‌గా తిరగడం వల్ల కంప్రెసర్ వైబ్రేషన్, శబ్దం చాలా తక్కువగా వస్తుంది. కంప్రెసర్‌పై ఒత్తిడి కూడా తక్కువ పడటం వల్ల.. ఎక్కువ డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీలు మన్నికగా ఉంటాయి.

కూలింగ్, విద్యుత్ ఆదా పరంగా..

Advertisement

సాధారణ ఇన్వర్టర్ ఏసీలో ఒకే ఒక రోటరీ కంప్రెసర్ ఉండటం వల్ల అది గది ఉష్ణోగ్రతను బట్టి తన వేగాన్ని సర్దుబాటు చేసుకుంటుంది. దీనివల్ల సాధారణ నాన్ ఇన్వర్టర్ ఏసీలతో పోలిస్తే విద్యుత్ ఆదా అవుతుంది. అయితే డ్యూయల్ ఇన్వెర్టర్ ఏసీలో రెండు రోటర్లు ఉండటం వల్ల కంప్రెసర్ మరింత స్థిరంగా.. తక్కువ వైబ్రేషన్‌తో పని చేస్తుంది. డబుల్ రోటర్స్ ఉండటం వల్ల గది త్వరగా కూలింగ్ అవుతుంది. సింగిల్ ఇన్వర్టర్ తో పోలిస్తే ఇవి విద్యుత్ ను ఆదా చేస్తాయి. కూలింగ్, విద్యుత్ ఆదా, సైలెంట్ పనితీరు పరంగా.. డబుల్ ఇన్వర్టర్ దే పైచేయి అని చెప్పవచ్చు.

Also Read: Tiny Desktop PC: టీవీని కంప్యూటర్‌లా మార్చే.. బుల్లి సీపీయూ.. దీంతో మీ డబ్బంతా ఆదా!

ఫైనల్‌గా ఏది కొంటే బెటర్?

Advertisement

మీ ప్రాంతంలో ఎండలు, ఉక్కపోత ఎక్కువగా ఉంటూ.. ఉష్ణోగ్రతలు క్రమం తప్పకుండా 45 డిగ్రీల పైనే నమోదు అవుతూ ఉంటే డ్యూయల్ ఇన్వర్టర్ కొనుగోలు చేయడం ఉత్తమం. రోజుకు 8-10 గంటలపాటు ఏసీ వినియోగం తప్పనిసరి అనుకున్నవారు కూడా దీనిని పరిశీలించవచ్చు. ఈ ఏసీని ఎక్కువ సమయం ఆన్ చేసి ఉంచినా.. విద్యుత్ బిల్లు తక్కువగానే వస్తుంది. అలాకాకుండా మీ బడ్జెట్ కాస్త తక్కువగా ఉండి.. ఎండలు మరీ తీవ్రంగా లేని ప్రాంతంలో మీరు జీవిస్తున్నట్లైతే సింగిల్ ఇన్వర్టర్ సరిపోతుంది. ఓవరాల్ గా మీ అవసరాలు అభిరుచికి తగ్గట్లు నిర్ణయాన్ని మీరే తీసుకోండి.

Also Read: Price Hike Alert: ఏప్రిల్ 1 నుంచి.. మెుబైల్, టీవీ, ఏసీ ధరల పెంపు.. ఒక్కోదానిపై అదనంగా పడే భారమెంత?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×