E-Paper
Advertisement

ఇన్వర్టర్‌ బ్యాటరీలో ఎలా పడితే అలా నీరు పోస్తున్నారా? పెద్ద తప్పు చేస్తున్నట్లే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి!

ఇన్వర్టర్‌ బ్యాటరీలో ఎలా పడితే అలా నీరు పోస్తున్నారా? పెద్ద తప్పు చేస్తున్నట్లే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి!
Advertisement

Inverter Battery: ప్రస్తుత వేసవి కాలంలో కరెంటు కోతలు సర్వసాధారణంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు చాలా మంది బ్యాటరీ ఇన్వర్టర్లను ఇంట్లో ఉపయోగిస్తుంటారు. కరెంటు పోయిన ప్రతీసారి.. ఇన్వర్టర్ల ద్వారా ఏసీలు, కూలర్లు, టీవీలు, ఫ్రిడ్జ్ లను నడిపిస్తూ ఉపశమనం పొందుతుంటారు.

ఇన్వర్టర్లకు నీరు అతి ముఖ్యం..

అయితే ఇన్వర్టర్ బ్యాటరీలో అతిముఖ్యమైన ప్రక్రియగా నీరు నింపడమనేది ఉంటుంది. చాలా మంది బ్యాటరీ పూర్తిగా ఎండిపోయి, ఇన్వర్టర్ పనిచేయడం ఆగిపోయే వరకు నీటిని మార్చరు. దీనివల్ల బ్యాటరీ జీవితకాలం సగానికి పైగా తగ్గిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్యాటరీలో నీటిని ఎప్పుడు, ఎలా నింపాలో కొన్ని ముఖ్యమైన సూచనలు సైతం చేస్తున్నారు.

నీటిని ఎప్పుడు నింపాలి?

Advertisement

సాధారణంగా ప్రతీ ఇన్వర్టర్ బ్యాటరిపైనా నీటి స్టోరేజీని తెలియజేసే.. ఫ్లోట్ ఇండికేటర్లు ఉంటాయి. ఆ ఇండికేటర్లలోని ఎరుపు మార్క్.. కిందకు పడిపోతే బ్యాటరీలో నీరు సరిపడనంత లేవని అర్థం. అప్పుడు వెంటనే నీటిని నింపాలి. తద్వారా నీటి మట్టం ఎప్పుడూ గ్రీన్ (Green), రెడ్ (Red) మార్కుల మధ్యలో ఉండేలా చూసుకోవాలి.

నీటి స్థాయిపై ఓ కన్నేయండి

సాధారణంగా ప్రతి 2 నుండి 3 నెలలకు ఒకసారి నీటి స్థాయిని తనిఖీ చేస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వేసవి కాలంలో బ్యాటరీ ఎక్కువగా వేడెక్కుతుంది కాబట్టి.. నెలకు ఒకసారి చెక్ చేస్తే ఇంకా ఉత్తమం. ఒకవేళ మీ ఇన్వర్టర్ గతంలో కంటే తక్కువ సమయం బ్యాకప్ ఇస్తుంటే.. బ్యాటరీలో నీరు తగ్గినట్లుగా భావించాలని నిపుణులు పేర్కొంటున్నారు.

ఏ నీటిని వాడితే బెటర్?

Advertisement

ఇన్వర్టర్ బ్యాటరీలో నీళ్లు అనగానే చాలా మంది కుళాయి నీరు లేదంటే ఆర్ఓ వాటర్ పోస్తుంటారు. ఇది చాలా తప్పు. బ్యాటరీ కోసం ప్రత్యేకంగా లభించే డిస్టిల్డ్ వాటర్‌ను మాత్రమే వాడాలి. నల్లా నీటిలో ఉండే ఖనిజ లవణాలు (Minerals) బ్యాటరీ ప్లేట్లను త్వరగా పాడు చేసే ప్రమాదం ఉంటుంది.

Also Read: మేలో విడుదలయ్యే.. మోస్ట్ అడ్వాన్స్డ్ కూలర్లు.. వీటి ముందు ఏసీలు సైతం బలాదూర్!

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

నీరు పోయమన్నారు కదా అని చాలా మంది అతిగా బ్యాటరీని నింపేస్తుంటారు. ఇండికేటర్‌లో గరిష్ట స్థాయి కంటే ఎక్కువగా నీటిని అస్సలు పోయవద్దు. లేదంటే బ్యాటరీ ఛార్జ్ అవుతున్నప్పుడు నీరు వేడెక్కి బయటకు వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ బ్యాటరీ టెర్మినల్స్ వద్ద తెల్లటి పొడి పేరుకుపోతే.. వేడి నీటితో శుభ్రం చేసి కొద్దిగా పెట్రోలియం జెల్లీ లేదంటే వాసెలిన్ రాయండి. అయితే నీటిని నింపేటప్పుడు ఇన్వర్టర్ స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తొలగించడం ఎట్టిపరిస్థితుల్లో మర్చిపోవద్దు. వీలైతే చేతులకు గ్లౌజులు ధరిస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: మేలో రాబోతున్న.. క్రేజీ వాషింగ్ మిషన్లు ఇవే.. మార్కెట్‌ను షేక్ చేయడం పక్కా!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×