E-Paper
Advertisement

Internet : రికార్డు వేగంతో ఇంటర్నెట్ సేవలు… ఏ దేశంలో ఎంతమంది ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారంటే?

Internet : రికార్డు వేగంతో ఇంటర్నెట్ సేవలు… ఏ దేశంలో ఎంతమంది ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారంటే?
Advertisement

Internet : ప్రస్తుత పరిస్థితుల్లో ఏ చిన్న సమస్య లేదా సందేహం వచ్చినా దాని గురించి ఆరా తీసేందుకు, తెలుకునేందుకు ఇంటర్నెట్‌లో తెగ వెతికేస్తుంటాం. మన వ్యక్తిగత అవసరాలు, కమ్యూనికేషన్, సమాచారం పంచుకోవడం, సమాధానాలు పొందడం లేదా ఇతర విషయాలకు ఈ అంతర్జాలాన్ని ఉపయోగిస్తున్నారు. పైగా సాంకేతికత అందుబాటులోకి వచ్చాక ఈ ఇంటర్నెట్​ వినియోగం మరింత బాగా పెరిగిపోయింది.

అందుకే వినియోగదారులకు వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందించేందుకు కంపెనీలు తెగ పోటీ పడుతున్నాయి. దీంతో డిజిటల్‌ దిశగా దేశం దూసుకెళ్తోంది. పైగా ఆ మధ్యలో కొవిడ్‌ కారణంగా కూడా వర్క్‌ ఫ్రం హోం, ఆన్‌లైన్‌ విద్యకు కూడా ప్రాధాన్యం ఏర్పడింది. అలా ప్రపంచ వ్యాప్తంగా గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ వాడకం గణనీయంగా పెరిగిపోయింది. ఇంకా చెప్పాలంటే రోజు రోజుకు పెరుగుతూ పోతోంది.

Advertisement

ముఖ్యంగా ఈ ఇంటర్నెట్‌ వినియోగం విషయంలో భారత్‌ కూడా దూసుకెళ్తోంది. మరి ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో ఎంత మంది ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారో ప్రస్తుత కథనంలో తెలుసుకుందాం.

ALSO READ : తగ్గేదేలేదంటున్న టెస్లా.. ఎలక్ట్రానిక్ రంగంలో మరో ముందడుగు.. రోబో వ్యాన్, రోబో టాక్సీ లాంఛ్

Advertisement

ఏ దేశంలో ఎంత మంది యూజర్లంటే..

టాప్​లో చైనా – భారత్​ : జనాభా విషయంలో చెనా – భారత్​ ఎప్పుడు ముందు వరుసలో ఉంటాయి. ఇంటర్నెట్​ విషయంలోనూ అవి ముందు వరుసలో ఉన్నాయి. నివేదికల ప్రకారం చైనా జనాభా 141.22 కోట్లు కాగా, అక్కడ ఇంటర్నెట్ వినియోగించేవారు 105 కోట్ల వరకు యూజర్లు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఈ దేశంలోనే ఇంటర్నెట్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

భారత్ జనాభా విషయానికొస్తే 141.72 కోట్లు ఉండగా, ఇంటర్నెట్ ఉపయోగించే యూజర్లు 69.2 కోట్ల మంది ఉన్నారట.

అమెరికా : డెవలప్మెంట్లో ప్రపంచంలోనే టాప్ ప్లేస్ లో ఉన్న అమెరికాలో ఇంటర్నెట్ వాడే యూజర్స్ అయితే ఎక్కువగానే ఉన్నారు. యూఎస్ఏ దేశంలో జనాభా 34.18 కోట్ల మంది ఉన్నారు. అక్కడ ఇంటర్నెట్ యూజర్లు 31.1 కోట్లు మంది ఉన్నారట.

ఇండోనేషియా : ఇక ఇండోనేషియా దేశంలో జనాభా వచ్చే సరికి 28.37 కోట్ల మంది ఉన్నట్లు తెలిసింది. అలానే అక్కడ ఇంటర్నెట్ వినియోగించే వారి సంఖ్య 21.3 కోట్లు.

బ్రెజిల్ : బ్రెజిల్ దేశంలో విషయానికొస్తే 21.76 కోట్ల మంది జనాభా ఉన్నారు. అలానే అక్కడ ఇంటర్నెట్ యూజర్లు 18.8 కోట్ల మంది ఉన్నారు.

రష్యా : రష్యా దేశంలో 14.47 కోట్ల మంది జనాభా ఉండగా, ఇంటర్నెట్ యూజర్లు 12.8 కోట్లు ఉన్నారట.

నెజీరియా : దేశంలో 23.32 కోట్లు మంది జనాభా ఉండగా, ఇంటర్నెట్ యూజర్లు వచ్చేసరికి 12.3 కోట్ల మంది ఉన్నారని తెలిసింది.

జపాన్ : దేశంలో 12.36 కోట్లు మంది జనాభా ఉన్నారు. ఆ దేశంలో ఇంటర్నెట్ యూజర్లు 10.3 కోట్లు మంది ఉన్నారు.

మెక్సికో : దేశంలో 12.93 కోట్ల మంది జనాభా ఉండగా, అక్కడ అంతర్జాలం ఉపయోగించే యూజర్లు 10.1 కోట్లు మంది ఉన్నారు.

పాకిస్థాన్  : దాయాది దేశం పాకిస్థాన్ దేశంలో 25.17 కోట్లు మంది జనాభా ఉన్నారట. అక్కడ ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 8.7 కోట్లుగా ఉంది.

మొత్తంగా అంతర్జాలాన్ని వినియోగించే విషయంలో టాప్​లో చైనా భారత్ ఉండగా, ఆ తర్వాత వరుసగా పైన చెప్పిన దేశాలన్నీ ఉన్నాయి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×