E-Paper
Advertisement

ఇంటర్నల్ మెమరీ vs SD కార్డ్.. మీ స్మార్ట్‌ఫోన్‌కు ఏది ఉంటే బెస్ట్?

ఇంటర్నల్ మెమరీ vs SD కార్డ్.. మీ స్మార్ట్‌ఫోన్‌కు ఏది ఉంటే బెస్ట్?
Advertisement

Internal Memory vs SD Card: ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ దర్శనమిస్తోంది. ఫోటోలు, వీడియోలు, యాప్స్, గేమ్స్‌తో ఫోన్ల స్టోరేజ్ ఎప్పుడూ నిండిపోతూనే ఉంటుంది. అయితే సాధారణంగా స్టోరేజ్ విషయంలో ఓ కన్ఫ్యూజన్ మెుబైల్ యూజర్లను వెంటాడుతూ ఉంటుంది. ఇంటర్నల్ మెమరీ (Internal Memory) ఎక్కువ ఉన్నది తీసుకోవాలా? లేక SD కార్డ్ (SD Card) వేసుకుంటే సరిపోతుందా? అని చాలా మంది ఆలోచిస్తుంటారు. ఈ నేపథ్యంలో రెండింటిలో ఏది బెస్ట్? దేనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి? వంటి వివరాలను ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.

వేగవంతమైన పనితీరు

ఫోన్ వేగంగా పనిచేయడంలో స్టోరేజ్ కీలక పాత్ర పోషిస్తుంది. అందులోనూ స్టోరేజ్ రకాన్ని బట్టి కూడా మెుబైల్ పనితీరు, వేగం ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు. స్మార్ట్‌ఫోన్‌లోని ఇంటర్నల్ స్టోరేజ్ చాలా వేగంగా పనిచేస్తుందని తెలియజేస్తున్నారు. యాప్స్ ఓపెన్ అవ్వడం, గేమ్స్ లోడ్ అవ్వడం, ఫోన్ బూట్ అవ్వడం వంటివన్నీ ఇంటర్నల్ మెమెురీ చకా చకా చేసేస్తుందని స్పష్టం చేస్తున్నారు. దీనితో పోలిస్తే.. SD కార్డు చాలా నెమ్మదిగా పనిచేస్తుందని పేర్కొంటున్నారు. యాప్స్‌ను SD కార్డ్‌లో ఇన్‌స్టాల్ చేస్తే.. అవి ఓపెన్ కావడానికి ఎక్కువ సమయం పడుతుందని అంటున్నారు. ఒక్కోసారి ఫోన్ హ్యాంగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందని వివరిస్తున్నారు.

డేటా భద్రత

Advertisement

ఇంటర్నల్ మెమరీ.. ఫోన్ మదర్‌బోర్డ్‌కే అతుక్కొని ఉంటుంది కాబట్టి భద్రతాపరంగా సేఫ్ అని చెప్పవచ్చు. ఫోన్ పోతే తప్ప డేటా మిస్సయ్యే అవకాశం ఉండదు. అదే SD కార్డ్ విషయానికి వస్తే.. ఇవి త్వరగా పాడైపోయే (Corrupt) అవకాశం ఉంది. ఒక్కోసారి వైరస్ వల్ల లేదా కార్డ్ సరిగ్గా రీడ్ అవ్వకపోవడం వల్ల డేటా మొత్తం పోవచ్చు. అయితే.. ఫోన్ పాడైపోయినా SD కార్డ్ తీసి వేరే దాంట్లో వాడుకునే వెసులుబాటు ఉంటుంది.

ఖర్చు పరంగా చూస్తే..

బడ్జెట్ విషయానికి వస్తే రెండింటికీ చాలా తేడా ఉందని నిపుణులు అంటున్నారు. ఎక్కువ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఫోన్ కావాలంటే కంపెనీలు వేల రూపాయలు అదనంగా వసూలు చేస్తాయని పేర్కొంటున్నారు. దీంతో పోలిస్తే.. SD కార్డ్ చాలా చౌకైనదని తెలియజేస్తున్నారు. SD కార్డ్ ద్వారా తక్కువ ధరలోనే ఎక్కువ స్టోరేజ్ ను మెుబైల్ యూజర్లు పొందొచ్చు.

బ్యాటరీ లైఫ్

Advertisement

ఇంటర్నల్ మెమెురీ.. ఫోన్ ప్రాసెసర్‌తో కలిసి నేరుగా పనిచేస్తుంది కాబట్టి బ్యాటరీ వినియోగం ఆప్టిమైజ్‌గా ఉంటుంది. దీనివల్ల బ్యాటరీ పొదుపుగా ఖర్చు అవుతుందని చెప్పవచ్చు. అదే మెమరీ కార్డ్‌ విషయానికి వస్తే.. ఫైల్స్‌ను రీడ్ చేయడానికి ప్రాసెసర్ అదనంగా కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల బ్యాటరీ కొంచెం త్వరగా అయిపోవచ్చు.

Also Read: లంబాడీల ధర్నాకు హరీశ్ రావు మద్దతు.. సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశ్నల వర్షం

ఫైనల్గా ఫోన్‌కు ఏది బెస్ట్?

స్మార్ట్ ఫోన్‌లో హెవీ గేమ్స్ ఆడేవారు, ఎక్కువ యాప్స్ మెయిన్ టెన్ చేసేవారికి ఇంటర్నల్ మెమెురీ బెస్ట్ ఆఫ్షన్ అని చెప్పవచ్చు. 4K వీడియోలను రికార్డ్ చేసి.. సోషల్ మీడియాలో ఈజీగా అప్ లోడ్ చేసేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలా కాకుండా బడ్జెట్ తక్కువగా ఉండి.. కేవలం సినిమాలు, పాటలు, ఫొటోలు స్టోర్ చేసుకోవడానికి అయితే SD కార్డ్ బెస్ట్ అని చెప్పవచ్చు. అలాంటి వారు తక్కువ ఇంటర్నల్ మెమరీ ఉన్న ఫోన్ కొని.. దానికి మంచి క్వాలిటీ కలిగిన SD కార్డ్‌ను జత చేసుకుంటే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: ఛార్జర్‌ను ఎప్పుడూ ప్లగ్‌లోనే ఉంచుతున్నారా? కొంపలు అంటుకుంటాయ్ భయ్యా!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×