E-Paper
Advertisement

Instagram vs WhatsApp: మీ మొబైల్ డేటా త్వరగా అయిపోతుందా? ఆ ఒక్క యాప్ చేసే పనే ఇదంతా!

Instagram vs WhatsApp: మీ మొబైల్ డేటా త్వరగా అయిపోతుందా? ఆ ఒక్క యాప్ చేసే పనే ఇదంతా!
Advertisement

Instagram vs WhatsApp: రోజంతా గంటల తరబడి ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చూసేవాళ్లకి ఫోన్లో ఛార్జింగ్‌ ఎంత ముఖ్యమో డేటా కూడా అంతే అవసరం. కానీ, చాలామందికి ఎదురయ్యే పెద్ద సమస్య ఏంటంటే.. పొద్దున్న లేచి కాసేపు ఫోన్ వాడగానే ‘మీ డేటా 90 శాతం అయిపోయింది’ అని మెసేజ్ రావడం. అది చూడగానే ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అవుతుంది. అసలు అంత డేటా ఏమైపోయింది? ఎక్కడ ఖర్చయింది? అని బుర్ర గీక్కుంటాం. మన డేటాను ఖర్చు చేసే వాటిలో మెయిన్ యాప్‌లు ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ అని మనకు తెలుసు. కానీ, ఈ రెండింటిలో ఏది ఎక్కువ డేటాను లాగేస్తుందో ఇప్పుడు కాస్త క్లియర్‌గా తెలుసుకుందాం.

డేటాను మింగేసే యాప్ ఏదంటే?

నిజం చెప్పాలంటే ఇన్‌స్టాగ్రామ్ పూర్తిగా ఫొటోలు, వీడియోల మీద నడుస్తుంది. దీంతో డేటా భారీగా ఖర్చవుతుంది. యాప్ ఓపెన్ చేయగానే మీరు చూడకపోయినా సరే.. బ్యాక్‌గ్రౌండ్‌లో రీల్స్, స్టోరీలు అన్నీ లోడ్ అయిపోతుంటాయి. సరదాగా అలా గంటసేపు రీల్స్ చూశారంటే చాలు.. 300 నుంచి 600 MB డేటా గాలిలో కలిసిపోతుంది. ఒకవేళ మీరు హై క్వాలిటీ వీడియోలు చూస్తే అది 1GB దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో కాల్స్ చేస్తే మాత్రం గంటకు సుమారు 1.2GB వరకు ఖర్చవుతుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు డేటా త్వరగా అయిపోవడానికి ప్రధాన కారణం ఇన్‌స్టాగ్రామే అని.

Advertisement

Also Read: ఆఫీసులో కూర్చొనే ఇంట్లో కూలర్‌ను ఆపరేట్ చేయొచ్చు.. ధర కూడా తక్కువే!

వాట్సప్ ఎంత ఖర్చు చేస్తుంది?

ఇన్‌స్టాగ్రామ్‌తో పోలిస్తే వాట్సాప్ బెటర్ అనే చెప్పాలి. దీనిని ఎక్కువగా మెసేజ్‌ల కోసం మాత్రమే వాడుతాం కాబట్టి.. డేటా అంతగా ఖర్చు అవ్వదు. గంటసేపు వాయిస్ కాల్ మాట్లాడినా కేవలం 30 నుంచి 50 MB మాత్రమే అవుతుంది. ఇక వీడియో కాల్స్ మాట్లాడినా గంటకు 250 నుంచి 500 MB లోపే ఉంటుంది. అంటే.. ఇన్‌స్టాగ్రామ్ కంటే ఇది చాలా నయం అన్నమాట. అయితే, ఇక్కడ ఒక చిక్కు ఉంది. మీ వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే ఫొటోలు, వీడియోలు అన్నీ ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయ్యేలా సెట్టింగ్స్ ఉంటే మాత్రం.. మీ డేటా మీకే తెలియకుండా మెల్లగా కరిగిపోతుంది.

డేటా ఆదా చేయడమెలా?

Advertisement

మీ మొబైల్ డేటాను పొదుపుగా వాడుకోవాలంటే.. చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అవ్వాల్సిందే. దీని కోసం ముందుగా ఇన్‌స్టాగ్రామ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Data Saver మోడ్‌ను ఆన్ చేసుకోండి. అలాగే వాట్సాప్‌లో Auto Media Downloader ఆప్షన్‌ను ఆపేయండి. మీకు కావాల్సిన ఫొటోలు మాత్రమే డౌన్‌లోడ్ చేసుకుంటే డేటా మిగులుతుంది. ఇక వీడియో కాల్స్ ఏవైనా ఉంటే వీలైనంత వరకు వైఫై ఉన్నప్పుడు మాట్లాడుకోవడం బెస్ట్. ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ డేటా ప్యాక్ రోజంతా వస్తుంది.

Also Read: మళ్లీ రాదు ఈ అవకాశం.. ఏసీలు, ఫ్రిడ్జ్‌లు, కూలర్లపై ఊహించని రీతిలో ధర తగ్గింపు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×