E-Paper
Advertisement

Instagramలో పిచ్చి పిచ్చి పోస్టుల గోల వద్దు అనుకుంటున్నారా? అయితే ఆ రెండు కొత్త బటన్లు మీ కోసమే!

Instagramలో పిచ్చి పిచ్చి పోస్టుల గోల వద్దు అనుకుంటున్నారా? అయితే ఆ రెండు కొత్త బటన్లు మీ కోసమే!
Advertisement

Instagram New Features: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఇన్‌స్టాగ్రామ్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫొటోలు, రీల్స్‌తో కోట్లాది మందిని ఆకట్టుకునే ఈ యాప్.. ఇప్పుడు వినియోగదారుల కోసం ఒక పెద్ద అప్‌డేట్‌పై కసరత్తు చేస్తోంది. సాధారణంగా మనం చూసే లైక్స్, కామెంట్లు, వాచ్ హిస్టరీ ఆధారంగా ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథమ్ మనకు కొన్ని పోస్టులను రికమండ్ చేస్తూ ఉంటుంది. అయితే, ఇకపై అలా కాకుండా మనకు ఎలాంటి కంటెంట్ కావాలో, ఏది వద్దో మనమే నేరుగా నిర్ణయించుకునేలా కొత్త కంట్రోల్స్ రాబోతున్నాయి. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మొస్సేరి స్వయంగా వెల్లడించారు.

సెట్టింగ్స్ వెతికే పనిలేకుండా..

ఇంతకుముందు మనకు నచ్చని కంటెంట్‌ను నియంత్రించాలంటే యాప్ లోపల ఉండే సెట్టింగ్స్‌లోకి వెళ్లి వెతుక్కోవాల్సి వచ్చేది. ఇది చాలా మందికి తెలియదు, ఒకవేళ తెలిసినా కాస్త ఇబ్బందిగా అనిపించేది. కానీ కొత్త అప్‌డేట్‌తో ఈ తలనొప్పి తప్పనుంది. మనం హోమ్ ఫీడ్‌లో ఉన్నప్పుడు స్క్రీన్‌ను కిందికి లాగితే (పుల్ డౌన్ చేస్తే) చాలు, రికమండేషన్ కంట్రోల్స్ స్క్రీన్ పైనే ప్రత్యక్షమవుతాయి. అలాగే రీల్స్ చూస్తున్నప్పుడు కూడా కేవలం ఒక్క స్వైప్ అప్‌తో ఈ పర్సనలైజేషన్ మెనూను సులభంగా ఓపెన్ చేయవచ్చు. దీనివల్ల మనం చూసే ఫ్లో దెబ్బతినకుండానే, నచ్చిన విధంగా సెట్టింగ్స్ మార్చుకోవచ్చు.

Advertisement

Also Read: Xiaomi 18లో 4 ఇంచ్ బ్యాక్ డిస్‌ప్లే.. Vivo X500లో కాంపాక్ట్ డిజైన్.. లీకైన రెండు క్రేజీ ఫోన్ల ఫీచర్లు!

అల్గారిథమ్‌కు మీరే బాస్..

ఈ మార్పుల్లో భాగంగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కింద ప్రత్యేకంగా రెండు కొత్త బటన్లను పరీక్షిస్తోంది. అందులో ఒక బటన్‌ను నొక్కితే ‘నాకు ఇలాంటి కంటెంట్ మరిన్ని చూపించు’ అని యాప్‌కు చెప్పినట్లు అవుతుంది. మరో బటన్ నొక్కితే ‘ఇలాంటివి నాకు ఇక చాలు.. చూపించొద్దు’ అని అర్థం. కేవలం లైక్ కొట్టడం లేదా ఎక్కువసేపు చూడటం మాత్రమే కాకుండా, మనకు ఏం కావాలో ఈ బటన్ల ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌కు నేరుగా, బలంగా చెప్పే అవకాశం లభిస్తుంది. దీనివల్ల అల్గారిథమ్ పూర్తిగా మన అభిరుచులకు తగ్గట్టుగా మారిపోతుంది.

అనవసరమైన కంటెంట్‌కు చెక్..

Advertisement

ఈ కొత్త టూల్స్ అన్నీ అందుబాటులోకి వస్తే హోమ్ ఫీడ్, రీల్స్, ఎక్స్‌ప్లోర్ పేజీలు పూర్తిగా మారిపోతాయి. మనకు సంబంధం లేని వీడియోలు, పిచ్చి పిచ్చి పోస్టుల గోల తగ్గిపోతుంది. మనకు నిజంగా ఏది అవసరమో, ఏది ఆసక్తికరంగా ఉందో ఆ కంటెంట్ మాత్రమే స్క్రీన్ పై కనిపిస్తుంది. అయితే యూజర్లు కోరుకుంటున్న తాము ఫాలో అయ్యే అకౌంట్ల పోస్టులు మాత్రమే వరుసగా కనిపించేలా పాత పద్ధతిని తీసుకురావాలని యూజర్లు కోరుతున్నారు. కానీ ప్రస్తుతం మెటా దృష్టి కేవలం అల్గారిథమ్‌ను మెరుగు పరచడంపైనే ఉంది. ఈ ఫీచర్లు ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్నాయి, త్వరలోనే ఇవి మన ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Also Read: యాపిల్ స్మార్ట్ స్కెచ్.. మెటా మార్కెట్‌ను దెబ్బకొట్టేలా సరికొత్త గ్లాసెస్.. లాంచింగ్ ఎప్పుడంటే?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×