E-Paper
Advertisement

ఇన్‌స్టాగ్రామ్ ‘Instants’ లాంచ్.. ఇకనుంచి మాయమైపోయే ఫోటోలతో సరికొత్త చాటింగ్ ఫీల్!

ఇన్‌స్టాగ్రామ్ ‘Instants’ లాంచ్.. ఇకనుంచి మాయమైపోయే ఫోటోలతో సరికొత్త చాటింగ్ ఫీల్!
Advertisement

Instants: ఇన్‌స్టాగ్రామ్ తన ప్లాట్‌ఫారమ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ‘Instants’ అనే వినూత్న ఫీచర్‌ను పరిచయం చేసింది. యూజర్లు తమ డైలీ లైఫ్‌లొ సహజమైన,ఎడిటింగ్ లేని క్షణాలను స్నేహితులతో పంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇన్‌బాక్స్‌లో అందుబాటులో ఉండే ఈ ఫోటోలు, అవతలి వ్యక్తి చూడగానే వాటంతట అవే మాయమైపోతాయి. ఆర్టిఫిషియల్ ఫిల్టర్ల కంటే సహజత్వానికి ప్రాధాన్యతనిస్తూ రూపొందించిన ఈ ఫీచర్, ప్రస్తుత యూత్‌ను తెగ ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, సేఫ్టీ ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరి నేతృత్వంలో వచ్చిన ఈ Instants ఫీచర్, సోషల్ మీడియాలో ‘రియల్ షేరింగ్’ను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రారంభించబడింది.

Advertisement

Instants ఫీచర్ ఎలా పనిచేస్తుంది?

ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లోని ఇన్‌బాక్స్ లో కుడి వైపు కింద భాగంలో ఈ కొత్త ఫీచర్ కనిపిస్తుంది. యూజర్లు కెమెరా ఐకాన్‌ను ట్యాప్ చేసి ఫోటో తీసి తమ ‘Close Friends’ లేదా ‘Mutuals’ (ఒకరినొకరు ఫాలో అయ్యే వారు)కు పంపవచ్చు.

Advertisement

నో ఎడిటింగ్: ఈ ఫీచర్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో స్టోరీస్ లేదా రీల్స్ లాగా ఫిల్టర్లు, స్టిక్కర్లు లేదా ఎడిటింగ్ టూల్స్ ఉండవు.

డిసప్పియరింగ్ మోడ్: అవతలి వ్యక్తి ఫోటోను ఓపెన్ చేయగానే అది డిలీట్ అయిపోతుంది. ఇది చాటింగ్‌ను మరింత ప్రైవేట్‌గా ఉంచుతుంది.

రియాక్షన్స్ & రిప్లైస్: పంపిన ఇన్‌స్టంట్స్ ఫోటోలకు స్నేహితులు నేరుగా రియాక్ట్ అవ్వొచ్చు లేదా రిప్లై ఇవ్వొచ్చు. ఇవి నేరుగా మీ డిఎమ్ లలో కనిపిస్తాయి.

ఆర్కైవ్ , రీక్యాప్ :
చూసేవారికి ఫోటోలు మాయమైనప్పటికీ.. పంపిన వ్యక్తికి మాత్రం ఆ ఫోటోలు వారి ప్రైవేట్ ఆర్కైవ్‌లో దాదాపు ఒక సంవత్సరం పాటు భద్రంగా ఉంటాయి. యూజర్లు ఈ పాత ఇన్‌స్టంట్స్ అన్నింటినీ కలిపి ఒక ‘Recap’ వీడియోగా మార్చి తమ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసుకోవచ్చు.

టీనేజర్ల భద్రత – పేరంటల్ కంట్రోల్స్:
ఇన్‌స్టాగ్రామ్ ఈ ఫీచర్‌ను రూపొందించేటప్పుడే భద్రతకు పెద్దపీట వేసింది.

స్క్రీన్‌షాట్ బ్లాకింగ్: ఈ ఫీచర్‌లో స్క్రీన్‌షాట్లు తీయడం లేదా స్క్రీన్ రికార్డింగ్ చేయడం సాధ్యం కాదు.

స్లీప్ మోడ్: రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు నోటిఫికేషన్లు రాకుండా ‘స్లీప్ మోడ్’ ఆటోమేటిక్‌గా పని చేస్తుంది.

టైమ్ లిమిట్: ఇన్‌స్టంట్స్‌పై గడిపే సమయం కూడా టీనేజర్ల రోజువారీ ఇన్‌స్టాగ్రామ్ టైమ్ లిమిట్‌లోకి వస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లల యాక్టివిటీని ఫ్యామిలీ సెంటర్ ద్వారా పర్యవేక్షించవచ్చు.

స్టాండలోన్ యాప్ :
ఇన్‌స్టాగ్రామ్ ప్రధాన యాప్‌తో పాటు.. కొన్ని దేశాల్లో ‘Instants’ కోసం ప్రత్యేకమైన యాప్‌ను కూడా టెస్ట్ చేస్తోంది. కెమెరాను వేగంగా యాక్సెస్ చేయాలనుకునే వారి కోసం ఈ యాప్ ఉపయోగ పడుతుంది. ఇందులో షేర్ చేసే కంటెంట్ నేరుగా ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌బాక్స్‌తో సింక్ అవుతుంది.

నేటి కాలంలో సోషల్ మీడియాలో అతిగా ఎడిట్ చేసిన ఫోటోలు చూసి బోర్ కొట్టిన వారికి Instants ఒక రిలీఫ్ అని చెప్పవచ్చు. మనలోని సహజమైన కోణాన్ని స్నేహితులతో పంచుకోవడానికి ఇది ఒక సురక్షితమైన, ఆహ్లాదకరమైన మార్గం.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×