E-Paper
Advertisement

TikTok : ఇన్టాగ్రామ్ లో టిక్ టాక్ ఫీచర్.. ఎలా ఉపయోగించాలంటే!

TikTok : ఇన్టాగ్రామ్ లో టిక్ టాక్ ఫీచర్.. ఎలా ఉపయోగించాలంటే!
Advertisement

TikTok : వీడియో షేరింగ్ ప్లాట్‌ఫారమ్ ఇన్టాగ్రామ్ ఇంటరాక్షన్ ఫీచర్‌ను జోడించింది. ఈ ఫీచర్ తో నచ్చిన విధంగా రీల్స్, పోస్ట్‌లను షేర్ చేసే ఛాన్స్ ఉంది.

యూత్ లో టిక్ టాక్ యాప్ కు ఉండే డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ యాప్ తో ఎన్నో రీల్స్ చేస్తూ తమకు నచ్చిన విధంగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో షేర్ చేసి మురిసిపోతూ ఉంటారు. మరి తాజాగా అమెరికాలో టిక్ టాక్ పై నిషేధం విధించారు. ఈ నేపథ్యంలోనే ఇన్స్టాగ్రామ్ తనకున్న ఫాలోయింగ్ తో మరో సరికొత్త ఫీచర్స్ ను తీసుకొచ్చింది. టిక్ టాక్ నేపథ్యంలోనే ఈ రీల్స్ సహాయంతో రీల్స్, పోస్టులు షేర్ చేసే ఛాన్స్ కల్పించింది.

Advertisement

యుఎస్‌లో టిక్‌టాక్ నిషేధం నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్ రెండు కొత్త ఫీచర్లను తీసుకువచ్చింది. ఇన్టాగ్రామ్ యాజమాన్య సంస్థ మెటా.. ఈ ఫ్లాట్ఫామ్ లో తమ రీల్స్‌కు వినియోగదారులు మరిన్ని మెరుగులు దిద్దే ఛాన్స్ కల్పించింది. యుఎస్‌లోని సుప్రీం కోర్టు టిక్‌టాక్‌ను నిషేధించటంతో దానికి ప్రధాన పోటీదారులుగా ఉన్న మరికొన్ని ఫ్లాట్ఫామ్స్ ప్రయోజనం పొందే అవకాశం ఉంది. అందుకే ఇన్స్టాగ్రామ్ ఈ రీల్ ఫీచర్స్ ను తీసుకొచ్చినట్టు టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్ తాజాగా తీసుకువచ్చిన రెండు సరికొత్త ఫీచర్స్ యూజర్స్ ను మరింత ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అయితే అసలు ఈ ఫీచర్స్ ఏంటి? వీటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

ఇన్‌స్టాగ్రామ్ కొత్త రీల్స్ ఫీచర్ –

Advertisement

టెక్ దిగ్గజం మెటా ఇన్టాగ్రామ్ లో వినియోగదారులు.. తమ స్నేహితులు ఏ రీల్స్‌ను ఇష్టపడ్డారో చూసేందుకు వీలు కల్పించే అప్‌డేట్‌ను ప్రవేశపెట్టింది. ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మొస్సేరి రీల్ వీడియోతో ఈ 2 కొత్త ఫీచర్లకు సంబంధించిన వివరాలు వెల్లడించింది. “ఇన్‌స్టాగ్రామ్ యూజర్స్ వినోదం పొందేందుకు మాత్రమే కాకుండా, ఆకర్షణీయమైన కంటెంట్ తో వారి స్నేహితులతో కనెక్ట్ అయ్యే ఫ్లాట్ఫామ్ గా ఉండాలని కోరుకుంటున్నాము…” అంటూ Mosseri పోస్ట్‌లో తెలిపింది.

ALSO READ : లా నీనా వస్తోంది.. ఇండియాపై అలాంటి ప్రభావం, అసలు ఏంటిదీ?

ఇంకా ఇందులో ఫ్రెండ్స్ ఇంటరాక్షన్ ఫీచర్‌ను సైతం జోడించింది. ఇది మీ స్నేహితులు ఇష్టపడే రీల్స్, పోస్ట్‌లను చూడటానికి అనుమతిస్తుంది. ఈ సరికొత్త ఫీచర్ ను ఎనేబుల్ చేయటానికి రీల్స్ ట్యాబ్ పైన ఉన్న డాట్స్ ను ఉపయోగించాలి. ఇక్కడ ఉన్న కంటెంట్ ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథమ్‌కు భిన్నంగా ఉండటమే కాకుండా యూజర్స్ కొత్త కంటెంట్‌ను యాక్సెస్ చేయగలరు.

అదనంగా ఈ సంస్థ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లోని కొత్త విభాగంలో రిప్లై బార్ అనే ఫీచర్‌ను సైతం జోడించింది. ఈ ఫీచర్ సహాయంతో, బబుల్‌లో కనిపించే వారిపై క్లిక్ చేసి.. ఆ రీల్‌లోని మీ ఫ్రెండ్స్ కు వెంటనే రిప్లై ఇవ్వొచ్చు. ఈ ఫీచర్ ఫ్రెండ్స్ తో చాట్ చేయడానికి యూజర్స్ ను అనుమతించడమే కాకుండా.. ఫాలో అవుతున్న వ్యక్తుల కంటెంట్‌ను సైతం చూసే ఛాన్స్ ఇస్తుంది. రిప్లై బార్ మొదట USలో ప్రవేశపెట్టనున్నారు ఆపై ఈ ఫీచర్స్ ఇతర దేశాలలో సైతం  అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×