E-Paper
Advertisement

నీరు లేని టాయిలెట్.. కరెంట్ లేని హీటర్.. సోనమ్ వాంగ్‌చుక్ ఇంట్లో ఎన్ని వింతలో!

నీరు లేని టాయిలెట్.. కరెంట్ లేని హీటర్.. సోనమ్ వాంగ్‌చుక్ ఇంట్లో ఎన్ని వింతలో!
Advertisement

Sonam Wangchuk Home: దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. గత 20 రోజులుగా ఈ సత్యాగ్రహం కొనసాగుతుండగా.. వాంగ్ చుక్ ఆరోగ్యంపై తీవ్ర ఆందోనళలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే పర్యావరణ హితంగా లడఖ్ లో ఆయన నిర్మించుకున్న ఇల్లు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సంప్రదాయ లడఖ్ నిర్మాణ శైలిని, ఆధునిక విజ్ఞానాన్ని మేళవించి నిర్మించిన ఆ రెండంతస్తుల నివాసం.. పర్యావరణహిత జీవనానికి ఒక అద్భుత ఉదాహరణగా నిలుస్తోంది. అత్యంత శీతల వాతావరణంలోనూ ఎలాంటి కృత్రిమ హీటర్లు లేకుండా ఈ ఇల్లు వెచ్చగా ఉండటం విశేషం.

మైనస్ డిగ్రీల్లోనూ వెచ్చగా..

సాధారణంగా లడఖ్‌లో శీతాకాలంలో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోతాయి. అటువంటి గడ్డకట్టే వాతావరణంలో జీవించడానికి వాంగ్ చుక్ ఇంట్లో ఎలాంటి హీటర్లు గానీ, ఏసీలు గానీ అవసరం లేదు. ఈ ఇంటి గోడలను పూర్తిగా స్థానిక మట్టి, కలపతో నిర్మించారు. సూర్యరశ్మి పూర్తి స్థాయిలో ఇంట్లోకి ప్రవేశించేలా పెద్ద పెద్ద గ్లాసు కిటికీలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పగటి పూట వేడిని గ్రహించి.. రాత్రి వేళల్లో దానిని నెమ్మదిగా విడుదల చేసేలా నీటి సీసాలతో కూడిన ప్రత్యేకమైన బ్లాక్ వాల్ వ్యవస్థను ఇంటికి వాడారు. దీనివల్ల బయట ఎంత చలి ఉన్నా, లోపల మాత్రం ఎల్లప్పుడూ 18°C నుండి 20°C వెచ్చటి ఉష్ణోగ్రత స్థిరంగా కొనసాగుతోంది.

సంప్రదాయం, ఆధునికత మేళవింపు

Advertisement

వాంగ్ చుక్ ఇంటి లోపలి భాగం సంప్రదాయ లడఖ్ శైలిని ప్రతిబింబిస్తూనే ఆధునిక సౌకర్యాలతో అలరారుతోంది. ఇక్కడి లివింగ్ రూమ్‌లో మట్టి గోడలు, అందంగా చెక్కిన చెక్క పైకప్పులు, సహజమైన కాంతిని ఇచ్చే పెద్ద కిటికీలు ఉన్నాయి. వీటితో పాటు ట్రెండీ సోఫాలు, సంప్రదాయ డైనింగ్ టేబుల్స్ ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు బెడ్‌రూమ్ ఎంతో సాదాసీదాగా, చెక్క ఫర్నిచర్, పుస్తకాల అలమరాలతో ప్రశాంతమైన అనుభూతిని కలిగిస్తుంది.

నీటిని ఆదా చేసే ‘కంపోస్ట్ టాయిలెట్’

ఈ ఇంటి ప్రత్యేకతల్లో అత్యంత ముఖ్యమైనది ఇక్కడి వాటర్ లెస్ కంపోస్టింగ్ టాయిలెట్. నీటి కొరత ఎక్కువగా ఉండే లడఖ్ లాంటి ఎడారి ప్రాంతాల్లో ఇది ఎంతో ఉపయోగకరం. ఈ టాయిలెట్‌లో ఫ్లష్ చేయడానికి నీటికి బదులుగా చెక్క పొట్టు లేదా మట్టిని ఉపయోగిస్తారు. ఇది దుర్వాసన రాకుండా చేయడమే కాకుండా, వ్యర్థాలను సమర్థవంతంగా నిల్వ చేస్తుంది. ఈ వ్యర్థాలను తర్వాత సహజ సిద్ధమైన సేంద్రీయ ఎరువుగా మార్చి వ్యవసాయానికి ఉపయోగిస్తారు. దీనివల్ల వేలాది లీటర్ల నీరు ఆదా అవ్వడంతో పాటు పర్యావరణ కాలుష్యం గణనీయంగా తగ్గుతుంది.

Advertisement

Also Read: ఆ దేశంలో తాగి పడిపోయే మందుబాబుల చుట్టూ వాటర్ బాటిళ్లు పెడతారు, ఎందుకంటే?

ప్రకృతి జీవనానికి మార్గదర్శి

సహజ వనరులను వాడుకుంటూ, సాంకేతికతను జోడించి పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవచ్చో సోనమ్ వాంగ్‌చుక్ తన నివాసం ద్వారా నిరూపించారు. టెంపరేచర్ కంట్రోల్, నీటి పొదుపు, పర్యావరణ అనుకూల వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలతో నిర్మితమైన వాంగ్ చుక్ ఇల్లు.. దేశవ్యాప్తంగా ఎందరికో స్ఫూర్తినిస్తోంది. సాంప్రదాయ పద్ధతులకు ఆధునిక ఇంజనీరింగ్ తోడైతే పర్యావరణానికి ఎలాంటి హాని చేయకుండా అద్భుతమైన జీవితాన్ని గడపవచ్చని ఈ ఇల్లు చాటి చెబుతోంది.

Also Read: గ్యాస్ అయిపోయిందా? డోంట్ వర్రీ.. చాయ్ తాగే లోపు సిలిండర్ వచ్చేస్తుంది!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×