// // Infinix Note 60 Pro: తక్కువ ధరలో శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్! -->
E-Paper
Advertisement

Infinix Note 60 Pro: ఐఫోన్ లుక్.. నథింగ్ ఫీచర్లు.. ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

Infinix Note 60 Pro: ఐఫోన్ లుక్.. నథింగ్ ఫీచర్లు.. ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
Advertisement

Infinix Note 60 Pro: మరికొద్ది రోజుల్లో మార్కెట్లోకి రానున్న Infinix Note 60 Pro టీజర్ చూస్తుంటే టెక్ ప్రపంచం నోరెళ్లబెడుతోంది. దీని డిజైన్ అచ్చం ఐఫోన్ 17 ప్రో సిరీస్‌ లాగే ఉంది. ముఖ్యంగా బ్యాక్ సైడ్ ఉన్న ఆ భారీ కెమెరా సెటప్, ఆరెంజ్ కలర్ ఆప్షన్ ఫోన్‌కు ఓ రేంజ్ ప్రీమియం లుక్‌ని తీసుకొచ్చాయి. అయితే, ఇన్ఫినిక్స్ ఇక్కడితో ఆగక.. నథింగ్ ఫోన్లలో మనం చూసేటట్టుగా రియర్ మ్యాట్రిక్స్ డిస్‌ప్లేను కూడా దీనికి జత చేసింది. దీంతో ఫోన్ అన్‌లాక్ చేయకుండానే వెనక ఉన్న చిన్న మినీ ఎల్ఈడి స్క్రీన్‌పై టైమ్, వెదర్, నోటిఫికేషన్లు చూడొచ్చు.

సరికొత్త బెంచ్ మార్క్..

డిస్‌ప్లే విషయానికి వస్తే ఇన్ఫినిక్స్ ఈసారి గట్టిగానే ప్లాన్ చేసింది. దీనిలో 1.5K రిజల్యూషన్ ఉన్న అమోలెడ్ డిస్‌ప్లేను ఇచ్చారు. 144Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో గేమింగ్ ఆడినా, సోషల్ మీడియా స్క్రోల్ చేసినా స్మూత్‌గా సాగిపోతుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 చిప్‌సెట్‌ను వాడారు. హెవీ యాప్స్ అయినా, గ్రాఫిక్స్ గేమ్‌లైనా అస్సలు స్లో అవ్వవు. అలాగే ఫోన్ వేడెక్కకుండా 3D ఐస్‌కోర్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉంది. పైగా JBL ట్యూన్ చేసిన స్పీకర్లు ఉండటంతో సౌండ్ క్వాలిటీ కూడా అదిరిపోతుంది.

Advertisement

Also Read: బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్స్.. 2026లో ట్రెండింగ్‌లో ఉన్న టాప్ సౌండ్‌బార్స్ ఇవే!

6 ఏళ్ల బ్యాటరీ లైఫ్..

బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఈ ఫోన్ ఒక మాన్స్టర్ అని చెప్పాలి. దీనిలో ఏకంగా 6,500mAh భారీ బ్యాటరీని పెట్టారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఇక చార్జర్ ఎక్కడ ఉందో వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా రోజుల తరబడి వాడుకోవచ్చు. దీనికి 90W ఫాస్ట్ ఛార్జింగ్ తో పాటు 30W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.అలాగే ఈ ఫోన్‌లో సెల్ఫ్ హీలింగ్ టెక్నాలజీ వల్ల ఆరేళ్ల వరకు బ్యాటరీ లైఫ్ పాడవకుండా ఉంటుందట. ఇక ఫొటోగ్రఫీ లవర్స్‌ కోసం 50MP నైట్ మాస్టర్ సెన్సార్ ఇచ్చారు. ఇది చీకట్లో కూడా పగటిపూట తీసినంత క్లారిటీగా ఫొటోలు తీస్తుందట.

శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్..

Advertisement

కేవలం నోట్ 60 ప్రో మాత్రమే కాదు, దీనికంటే పవర్‌ఫుల్ నోట్ 60 అల్ట్రాను కూడా ఇన్ఫినిక్స్ తీసుకువస్తోంది. దీనిని ఇటలీకి చెందిన ప్రసిద్ధ డిజైన్ హౌస్ పినెన్‌ఫారినాతో కలిసి డిజైన్ చేశారు. ఈ సిరీస్ ఫోన్లలో వస్తున్న మరో ఫీచర్ శాటిలైట్ కనెక్టివిటీ. నెట్‌వర్క్ అస్సలు లేని మారుమూల ప్రాంతాల్లో ఉన్నా సరే, కాల్స్, మెసేజ్‌లు చేసుకోవచ్చు. ధర గురించి ఇంకా అఫీషియల్‌గా చెప్పలేదు కానీ, త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Also Read: అమెజాన్ బంపర్ ఆఫర్.. వన్‌ప్లస్ ట్యాబ్లెట్ ధర ఇంత తగ్గిందా? యాపిల్ వాచ్‌పై కూడా క్రేజీ డీల్!

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×