E-Paper
Advertisement

ఐఫోన్ లెవల్ ఫీచర్లు.. నథింగ్ ఫోన్ లాంటి డిజైన్.. Infinix Note 60 Pro లాంచ్ డేట్ ఫిక్స్!

ఐఫోన్ లెవల్ ఫీచర్లు.. నథింగ్ ఫోన్ లాంటి డిజైన్.. Infinix Note 60 Pro లాంచ్ డేట్ ఫిక్స్!
Advertisement

Infinix Note 60 Pro: తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లు ఇచ్చే కంపెనీ ఏదైనా ఉందంటే అది ఇన్ఫినిక్స్ అని చెప్పక తప్పదు. ఇప్పుడా కంపెనీ నుంచి Infinix Note 60 Pro అనే సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 13న భారత్‌లో అధికారికంగా లాంచ్ కానుంది. ఈ ఫోన్ సేల్స్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఇన్ఫినిక్స్ వెబ్‌సైట్‌లోనూ ఉండబోతున్నాయి. అయితే ఈ ఫోన్‌లో అందరినీ ఆకర్షిస్తున్న మెయిన్ విషయం ఏమిటంటే.. ఫోన్ వెనుక ఉండే ఆ లైటింగ్ సెటప్. నథింగ్ ఫోన్లలో ఉండే గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ లాగే, దీని వెనుక కూడా మెరిసే లైట్లతో కూడిన యాక్టివ్ మ్యాట్రిక్స్ డిస్‌ప్లేను తీసుకొస్తున్నారు.

వావ్ అనిపించేలా డిజైన్..

ఈ ఫోన్ లుక్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. గ్లాసీ ఫినిషింగ్‌తో పాటు డీప్ ఓషన్ బ్లూ, మిస్ట్ టైటానియం లాంటి 6 రకాల క్రేజీ కలర్స్‌లో ఈ ఫోన్ రానుంది. అలాగే ఫోన్ వెనుక చతురస్రాకారపు కెమెరా సెటప్ ఉన్నా.. ఆ పక్కనే ఉండే ఎల్‌ఈడీ లైట్లు మాత్రం స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. మనకు ఏదైనా నోటిఫికేషన్ వచ్చినా లేదంటే సాంగ్స్ వింటున్నా.. ఆ లైట్లు రిథమిక్‌గా వెలుగుతూ చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటాయి. ఈ ఫోన్‌లో 8GB నుంచి మొదలుకొని 12GB వరకు RAM వేరియంట్లు ఉండబోతున్నట్లు టాక్.

కళ్లు చెదిరే డిస్‌ప్లే క్వాలిటీ..

Advertisement

దీనిలో సినిమాలు చూసినా లేదంటే గేమ్స్ ఆడినా ఒక రకమైన కొత్త అనుభూతిని ఇచ్చేలా దీని స్క్రీన్‌ను డిజైన్ చేశారు. అలాగే దీనిలో 6.78 అంగుళాల పెద్ద అమోలెడ్ డిస్‌ప్లే ఉండబోతోంది. 144Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల ఫోన్ వాడేటప్పుడు చాలా స్మూత్‌గా అనిపిస్తుంది. ఇక బ్రైట్‌నెన్ విషయానికి వస్తే 4,500 నిట్స్ వరకు ఉండబోతోంది. దీంతో ఎంత ఎండలో అయినా స్క్రీన్ చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. దీంతోపాటు స్క్రీన్ పగిలిపోకుండా గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్, నీళ్లు పడినా ఏం కాకుండా IP64 రేటింగ్ కూడా ఇచ్చారు.

Also Read: వచ్చేస్తోంది Oppo F33 సిరీస్.. ఫీచర్లు, ధర వివరాలు తెలిస్తే ఇప్పుడే బుక్ చేసేసుకుంటారు!

పర్ఫార్మెన్స్‌లో తోపు..

Advertisement

ఫోన్ హ్యాంగ్ అవ్వకుండా ఉండాలంటే మంచి ప్రాసెసర్ ఉండాలి కదా. అందుకే ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 అనే పవర్‌ఫుల్ చిప్‌సెట్‌ను వాడుతున్నట్లు సమాచారం. ఇది లేటెస్ట్ 4nm టెక్నాలజీతో రాబోతోంది. తద్వారా బ్యాటరీని తక్కువగా వాడుకుంటూనే చాలా ఫాస్ట్‌గా పనిచేస్తుంది. అలాగే హెవీ గేమర్స్ కోసం అడ్రినో A810 గ్రాఫిక్స్ కూడా తోడయ్యాయి. ఇక లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 వెర్షన్‌తో వస్తున్న ఈ ఫోన్ వాడుతుంటే.. సాఫ్ట్‌వేర్ పరంగా చాలా అడ్వాన్స్‌డ్‌గా అనిపిస్తుంది.

కెమెరా సెటప్ అదిరింది..

ఈ Infinix Note 60 Proలో 50MP మెయిన్ కెమెరాను ఇచ్చారు. అలాగే దీనిలో OIS సదుపాయం ఉంది కాబట్టి.. చేతులు కొంచెం వణికినా సరే ఫొటోలు మాత్రం బ్లర్ అవ్వకుండా చాలా షార్ప్‌గా వస్తాయి. ఇక సెల్ఫీల కోసం 13MP కెమెరా ఉంది. ఇకపోతే బ్యాటరీ విషయానికి వస్తే.. 6,500mAh అంటే మామూలు విషయం కాదు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజులు కంటిన్యూగా వాడొచ్చు. పైగా 90W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది కాబట్టి.. నిమిషాల్లోనే ఫోన్ ఫుల్ ఛార్జ్ అయిపోతుంది.

ధర ఎంత ఉండొచ్చు?

ఇన్ఫినిక్స్ ఫోన్లంటేనే మన బడ్జెట్‌కు తక్కువలో దొరుకుతాయి. ఈ ఫోన్ ధర కూడా రూ.18,000 నుంచి రూ.20,000 లోపు ఉండే అవకాశం ఉంది. ఈ రేంజ్‌లో ఇలాంటి ఫీచర్లు, అద్భుతమైన లుక్ ఉన్న ఫోన్ దొరకడం అంటే గొప్ప విషయమే. మీరు కూడా తక్కువ ధరలో కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ఏప్రిల్ 13న విడుదల కానున్న ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కోసం వేచి చూడక తప్పదు మరి.

Also Read: ఇంత రేటు తగ్గిందేంట్రా? జస్ట్ రూ.12వేలకే Vivo Y19s 5G ఫోన్ వచ్చేస్తోంది!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×